Breaking News

ప్రమాదకరంగా చంద్రబాబు కరకట్ట నివాసం

Published on Mon, 09/02/2024 - 12:33

సాక్షి,అమరావతి : ప్రకాశం బ్యారేజ్‌కు రికార్డ్‌ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ఇన్‌ఫ్లో,ఔట్‌ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది.  దీంతో కరకట్ట మీదగా నీరు ప్రవహించడంతో.. ఆ వరద చంద్రబాబు నివాసంలోపలకి వెళ్లింది. నీరు లోపలికి రాకుండా సిబ్బంది ఆదివారం లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు. అయినప్పటికీ వరద తీవ్రతతో నీరు చంద్రబాబు ఇంటి లోపలికి చేరింది. దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటర్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరద
ఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. ఇందులో నారా లోకేష్‌ గెస్ట్‌ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది. అయితే ఇసుక బస్తాలు వేసి వరద నీరు లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది.  

కలెక్టర్‌ కార్యాలయంలో బాబు బస
ఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని, రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు.

చంద్రబాబు ఇంట్లోకి వరద

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)