Breaking News

సీఎం హైదరాబాద్‌ టూర్‌ @ 71

Published on Wed, 10/01/2025 - 04:37

సాక్షి, అమరావతి: తీరిక దొరికితే చాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. అన్నట్లు వారాంతాల్లో, సెలవు రోజుల్లో విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌ వెళ్లి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 70 సార్లు హైదరాబాద్‌ వెళ్లి వచ్చినట్లు టీడీపీ కూటమి వర్గాలు.. అధికార వర్గాలు, సోషల్‌ మీడియాలో విస్తృ­తంగా చర్చ జరిగింది.

ఆ తర్వాత ఆదివారం 71వ సారి కూడా హైదరాబాద్‌ వెళ్లి రావడంతో మరోమారు ఈ విషయం వైరల్‌ అయ్యింది. మంత్రి లోకేశ్‌ ఈ 16 నెలల్లో 77 సార్లు హైదరాబాద్‌కు వెళ్లొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర, ఎన్నికల ప్రచార సమయంలో మినహా ఏపీ వైపే చూడలేదు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అయితే హైదరాబాద్‌ వేదికగానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం.

సినిమా షూటింగ్‌లు, వ్యక్తిగత పనులకే అక్కడ పరిమితం కావడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు, పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్‌ హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు. పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడుపుతున్నారని, విజయవాడలో ఉన్న రోజులను వేళ్లపై లెక్క పెట్టవచ్చని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)