Breaking News

చంద్రబాబు డైరెక్షన్‌తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్‌

Published on Wed, 10/15/2025 - 06:00

రాజమహేంద్రవరం రూరల్‌: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్‌ పేరును చెప్పిస్తూ వీడియో లీక్‌ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్‌సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్‌ చేయడానికే జోగి రమేష్‌ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.

దాని కోసం సిట్‌ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్ర­బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్‌ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్‌ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్‌ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు.  

ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి 
‘జుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్‌ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్‌ పోయిందని పోలీసులకు స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఫోన్‌లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్‌ చేశాడు? జుడీషియల్‌ రిమాండ్‌లో ఉండే ఈ వీడియో రికార్డ్‌ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్‌ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చేటప్పుడు రికార్డ్‌ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.

అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్‌ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు  జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్‌ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.

ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్‌కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)