చంద్రబాబు మార్కు ‘కుట్ర’ తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు?

Published on Mon, 09/23/2024 - 06:06

నేరం జరిగిందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి ఎంతో ప్రాశస్త్యమైన చరిత్ర కలిగిన, పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నేయిలో జంతువుల కొవ్వు కలిపితే ఏం చేయాలి? వెంటనే కల్తీ నేయి సరఫరా చేసిన కంపెనీపై ఫిర్యాదు చేయాలి. కేసు పెట్టాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. దోషులకు శిక్షపడేట్టు చేయాలి. ఆహార భద్రతా చట్టం అందుకు అవకాశం కల్పిస్తోంది కూడా. కానీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు మాత్రం అవేవీ పట్టడం లేదు. ఊకదంపుడు నిరాధార రాజకీయ ఆరోపణలతో లబ్ధి పొందడానికే యతి్నస్తున్నారు.  

సాక్షి, అమరావతి:  టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని తమకు జూలై 23నే తెలిసిందని చెబుతున్న చంద్రబాబు.. మరి ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పక పోవ­డం విస్తుగొలుపుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే కుట్రకే ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా అడ్డదారిలో రాజకీయ ప్రయోజ­నాల కోసం ఎంతకైనా దిగజారుతానని మరోసారి నిరూపించారు.

లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా చేసిన ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదిక వెల్లడించినట్టు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో దు్రష్పచారాన్ని తెరపైకి తెచి్చంది. జూలై 23న నివేదిక వచ్చిందని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. మరి నెయ్యి కల్తీ జరిగినట్టు జూలై 23నే తెలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంగానీ టీటీడీగానీ ఏం చేయాలి? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై కేసు నమోదు చేయాలి. ఎందుకంటే టెండరు నిబంధనలను ఉల్లంí­œుంచి కల్తీ నెయ్యి సర­ఫరా చేయడం నేరం.

అందులో­నూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత దెబ్బతినేలా కల్తీ నెయ్యి సరఫరా చేయడం మహాపరాధం. జంతువుల కొవ్వు­తో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేయడమే నిజమైతే.. ఆ కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయడమే నిజమైతే.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదిక వచ్చి 2 నెలలైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ కంపెనీపై కేసు పెట్టనే లేదు. 

కల్తీ చేస్తే 6 నెలల నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష  
కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆహార భద్రత చట్టం అవకాశం కలి్పస్తోంది. ఆ చట్టంలోని సెక్షన్‌ 15ఏ ప్రకారం.. ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడిన వారిపై, కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేసిన సంస్థపై భారీ జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కలి్పస్తోంది.  నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేశారని నిరూపితమైతే సరఫరా సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థపై కేసు నమోదు చేయనే లేదు. ఎందుకంటే కేసు నమోదు చేస్తే.. నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతుంది.

నెయ్యి సరఫరా చేసిన సంస్థ తాము కల్తీ చేయలేదని ఘంటాపథంగా వాదిస్తోంది. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సవాల్‌ విసురుతోంది. దాంతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రుజువు చేయాల్సిన బా­ధ్య­త ప్రభుత్వానిదే అవుతుంది. కానీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలే­దని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆ సంస్థపై కేసు నమోదు చేయలేద­న్నది అసలు లోగు­ట్టు. అయినా సరే చంద్రబాబు ని­స్సిగ్గుగా దిగజా­రుడు రాజకీయాలు చేస్తున్నారు.  పవన్, లోకేశ్‌ తదితరులు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)