Breaking News

చంద్రబాబు, పవన్‌ ఏకాంత చర్చలు

Published on Thu, 02/05/2026 - 05:57

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అడ్డగోలుగా విష ప్రచారం చేసి దొరికిపోయిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ బుధవారం ప్రత్యే­కంగా సమావేశమయ్యారు. ఉండవల్లి­లోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవా­రం ఇద్దరూ రెండున్నర గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సీబీఐ సిట్‌ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌ ద్వారా బయటకొచ్చిన నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి పాపం మూటగట్టుకున్నారని ప్రజలు నమ్ముతుండడం.. వారు చెప్పిన అబద్ధాలను ఎంత సమర్థించుకుంటున్నా ప్రజలు నమ్మకపోవడంతో దీనిపై ఏం చేయాలని కూటమి నేతలు రెండ్రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. అందులోభాగంగానే చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్‌ బుధవారం సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇక లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్‌ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాలపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించడంవల్ల ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపైనే ఎక్కువగా వీరు మాట్లాడుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. 

అలాగే, త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకం పైనా ప్రాథమికంగా చర్చలు జరిపారు. బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు తమకే కావాలని పట్టుబడుతుండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ, జనసేన చెరొకటి పంచుకోవాలా లేక బీజేపీని ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలని ఒప్పించాలా అనే అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. 

అయితే, ఈసారి జనసేనకు ఒక స్థానం కచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబును పవన్‌ కోరినట్లు తెలిసింది. అలాగే, తన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి అంశాలను కూడా పవన్‌ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోపాటు ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్‌ పదవులతోపాటు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడంవల్ల ఎదురవుతున్న సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)