Breaking News

క్రెడిట్‌ చోరీ.. మంత్రులదీ అదేదారి

Published on Sat, 12/06/2025 - 08:02

డోన్‌: టీడీపీ కూటమి ప్రభుత్వంలో క్రెడిట్‌ చోరీ సంస్కృతిని చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలూ కొనసాగిస్తున్నారు. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి సైతం ఇదే బాటను అనుకరించారు. 

వివరాల్లోకెళ్తే.. నంద్యాల జిల్లాలోని డోన్‌ పట్టణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్‌ అతిథి గృహాన్ని 2024 జనవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రారంభించారు. ఇప్పుడు ఆ భవనాన్ని తామే నిర్మించామంటూ చంద్రబాబు సర్కార్‌లోని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి గురువారం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కార్యాలయంగా ప్రారంభించారు. 

పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభకులుగా, సభ అధ్యక్షులుగా డోన్‌ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, విశిష్ట అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, ఫరూక్‌లు పాల్గొన్నట్లు కొత్త శిలాఫలకాన్ని వేయించారు. ఇది చూసిన స్థానికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రచారాలు చేసుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. 

భవనం వద్ద రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రారంభించినట్లు స్పష్టంగా శిలాఫలకం కనిపిస్తోంది. అయినప్పటికీ నిస్సిగ్గుగా ఇలా క్రెడిట్‌ చోరీ చేయడంపై ముక్కున వేలేసుకుంటున్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)