Breaking News

టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్‌

Published on Sun, 01/19/2025 - 03:26

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిస­లాట జరిగి ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం.. ఈ ఘటన గురించి మరచిపోక ముందే 13న లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రం దృష్టి సారించింది.

తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై టీటీడీ నుంచి నివేదిక కోరింది. వరుస పరిణామాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవాలు తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ అడిషనల్‌ సెక్రటరీ సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌కు ఆదేశాలు జారీ చేసింది.  సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌ ఆదివారం తిరుమలకు వస్తారని టీటీడీ చైర్మన్‌కు లేఖ పంపింది. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు శనివారం రాత్రి తిరిగి సమాచారం అందించింది. టీటీడీ చరిత్రలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి టీటీడీని రాజకీయంగా వాడుకోవడంపై దృష్టి సారించింది. 

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న విచక్షణ మరచి, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఉన్న రికార్డుకు మచ్చ తీసుకొస్తూ కనీస ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శ­నం టోకెన్ల కోసం ఒక్కసారిగా క్యూలైన్‌ గేట్లు తెరిచారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రా­ణాలు కోల్పోయారు. 

ఈ ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో షార్ట్‌ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగడం ఆందోళనకు గురి చేసింది. వీటన్నింటికీ తోడు లోకేశ్‌ మనిషి లక్ష్మణ్‌కుమార్‌ ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతుండటం పట్ల టీటీడీ యంత్రాంగం మండిపడుతోంది.  

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)