Breaking News

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: బొత్స

Published on Sun, 11/02/2025 - 13:40

సాక్షి, శ్రీకాకుళం: కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమని.. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి.. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’’ అని బొత్స  నిలదీశారు.

‘‘చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు?.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు?. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.

సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాత్రులం అంటే కుదరదు.. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీదిరి
సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది. మహిళలే అధికంగా చనిపోయారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందించాం.. ఈరోజు వైఎస్సార్‌సీపీ నేతలు అందరం కలిసి బాధితులను పరామర్శించాం. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం..

 రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?: కన్నబాబు
కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఘటన కలిచివేసింది.. క్షతగాత్రులంతా నిరుపేదలు. నిమితమాత్రులమంటూ బాబు వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రైవేట్ ఆలయం అని మాట్లాడుతున్నారు. ఆసుపత్రులను ప్రైవేటుకు ఇచ్చినట్టు.. ఆలయాలను కూడా ప్రైవేటుకు ఇస్తున్నామని చెప్పండి. సినిమా హీరోయిన్ వస్తే రోప్ పార్టీ వేసి భద్రత ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేదు. ఆలయాల్లో భద్రత కోసం ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందా.? రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?. ఇది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటన మాటెంటి..? కాశీబుగ్గలో జరిగింది ప్రైవేట్ ఘటన కాదు.. ప్రభుత్వం బాధ్యత వహించాలి. కష్టం అంటే జగన్ ముందుంటారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)