Breaking News

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

Published on Thu, 01/29/2026 - 11:03

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం చెవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. భాస్కర్‌రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడులకు సైతం బెయిల్‌ ఇచ్చింది.

వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్‌17వ తేదీన సిట్‌ బెంగుళూరులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కుంభకోణానికే ఆస్కారమే లేదని.. ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. 

ఈ క్రమంలో అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. చివరకు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్‌ ద్వారా ఉపశమనం లభించింది. 

సిట్‌ అభియోగాలు
డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్‌ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)