Breaking News

పథకం ప్రకారమే పోలీసులపై దాడి

Published on Mon, 08/07/2023 - 04:19

పుంగనూరు (చిత్తూరు జిల్లా): చంద్రబాబు పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై దాడిచేసి గాయపరచి, పోలీస్‌ వాహనాలకు నిప్పు పెట్టారని చిత్తూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.శ్రీలక్ష్మి తెలిపారు. ఆదివారం సాయ­ంత్రం ఆమె పుంగనూరులో పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ అశోక్‌కుమార్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలో రూట్‌మ్యాప్‌ను కాదని పుంగనూ­రు­లోకి దౌర్జన్యంగా వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను నివారించినందుకే రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడి చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారన్నా­రు. ఈ ఘటనపై ఎస్పీ రిషా­ంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసి, సీసీ çఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు చేసిన వారిలో 62 మందిని అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలిస్తున్నామన్నారు.

పోలీసులను రెచ్చగొట్టి.. తద్వారా కాల్పులు జరిగేలా చేయాలన్నది టీడీపీ ముఖ్య నేతల ఉద్దేశం అని తేలిందన్నారు. అవసరమనిపిస్తే పోలీసులను చంపాలని, ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరిపితే టీడీపీ వారు చనిపోతే తద్వారా ఇమేజ్‌ పొందేలా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2న రొంపిచెర్లలో వ్యూహ రచన చేశారన్నారు. ఆయన పీఏ గోవర్దన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి విచారించగా ఈ విషయం వెల్లడైందన్నారు. దీంతో ప్రస్తుతం చల్లా రామ­చంద్రారెడ్డిని ఏ–1 నిందితునిగా కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)