Breaking News

పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్‌చల్‌.. వైఎస్సార్‌సీపీ ప్రేమ్‌ కుమార్‌ ఎక్కడ?

Published on Thu, 12/12/2024 - 09:15

సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో అక్రమ కేసుల్లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, సోషల్‌ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా గుంటూరులో సోషల్‌ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి తీసుకువెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు సమాచారం ఇవ్వాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్‌ వేదికగా అరెస్ట్‌ వీడియోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అంబటి..‘గుంటూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్‌ను ఎవరో తీసుకెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి.. ప్రేమ్‌ కుమార్‌ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రేమ్‌ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇక, ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రేమ్‌ కుమార్‌కు తీసుకువెళ్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ పోలీస్‌ యూనిఫామ్‌ ధరించకపోవడం గమనార్హం. మరోవైపు.. ప్రేమ్‌ కుమార్‌ను తీసుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు.

ఈ సందర్బంగా తెలుగుదేశం నాయకులపైన పోస్టులు పెడతావా? అంటూ ప్రేమ్ కుమార్‌ను బలవంతంగా లాక్కెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్‌ను బలవంతంగా ఎవరో తీసుకువెళ్లారని పోలీసులకు ఫిర్యాదుకు చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేశారు. మరోవైపు.. ప్రేమ్‌ కుమార్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు అండగా నిలిచారు. 

ఇది  కూడా చదవండి:  మేడం చెప్పారు.. స్టేషన్‌కు రండి

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)