బాబు 'సూపర్‌ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు

Published on Thu, 06/05/2025 - 04:45

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ సహా 143 వాగ్దానాలతో నమ్మించి, ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హామీలు అమలు చేయకుండా వెన్ను­పోటు పొడిచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌­సీపీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. కూటమి ప్రభుత్వం కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఉప్పెనలా కదలివచ్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’లో కదంతొక్కారు. 

బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు.. అంటూ ప్లకార్డులు చేతబూని.. తక్షణమే హామీలు అమలు చేయాలని.. లేదా మోసం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ర్యాలీల్లో నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి.. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు వైఎస్సార్‌సీపీ నే­తలు డిమాండ్‌ పత్రాలను అందజేశారు. 

‘సూపర్‌ సిక్స్‌ పే­రుతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్క­రికీ వెన్నుపోటు పొడిచావు.  నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? వైఎస్‌ జగన్‌ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు.. విద్య, వై­ద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రెడ్‌బుక్‌తో టెర్రర్‌ సృష్టిస్తున్నావు.. ఇక చా­లు మీ నిర్వాకం. 

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో తమ వాహనాలతో కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రేషన్‌ వాహనాల డ్రైవర్లు   

ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చే­యాలి’ అని ఊరూరా ప్రజలు డిమాండ్‌ చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలకు తండోప తండాలుగా జనం కదలి రావడమే కూట­మి ప్రభుత్వంపై ఏడాదిలోనే పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తు­న్నా­రు. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ 26 జిల్లాల్లోనూ వెన్నుపోటు దినం, నిరసన ర్యాలీలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో వైఎస్సార్‌సీపీ కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. 
 


ఆ పిలుపే ప్రభంజనమై.. 
సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని చంద్రబాబు కూటమి విజయం సాధించి బుధవారం (జూన్‌ 4)తో సరిగ్గా ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్‌ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని.. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి, తక్షణమే హామీలు అమలు చేయాల­ని అధికారులకు డిమాండ్‌ పత్రాలు అందజేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చా­రు. 

 కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన పథకాల బోర్డులను ప్రదర్శిస్తూ నెల్లూరు సిటీలో నిరసన తెలుపుతున్న ప్రజలు  

అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమా­ల్లో పాల్గొనాలని కోరా­రు. జగన్‌ పిలుపు ప్రభంజనమై.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారని గ్రహిం­చిన కూటమి ప్రభుత్వం దాన్ని విఫలం చేయ­డానికి కుట్ర­లు చేసింది. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం–నిర­సన ర్యాలీలను అడ్డుకోవడానికి యధావిధిగా రెడ్‌ బుక్‌­తో భయానక వాతావరణం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది.  

గుంతకల్లు 

ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి పోలీసులను ఉ­సిగొల్పింది. బుధవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైఎ­స్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారి­ని హౌస్‌ అరెస్టు చేశారు. మాచర్లలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు.. బయటకు వస్తే కేసులు పెడతామని నాయకులు, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించారు. 

గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కూటమి కుట్రలు.. పోలీసుల ఆంక్షలను చిత్తు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనం కదం తొక్కారు.    

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)