Breaking News

ప్రజాస్వామ్యం ఖూనీ..

Published on Sun, 11/01/2026 - 07:03

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌..

గుంటూరులో కొనసాగుతున్న టీడీపీ గూండాల దౌర్జన్యం

  • 61వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై కిశోర్‌పై దాడి
  • మాజీ కార్పొరేటర్‌ ఉషారాణిపై కూడా దాడి చేసిన పచ్చమూక
  • టీడీపీ గూండాల దాడిలో ఇద్దరి తీవ్ర గాయాలు
  • 21వ డివిజన్‌ దొంగ ఓట్లు వేసిన టీడీపీ గూండాలు
  • అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

  • రామచంద్రాపురం 20వ వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డిమాండ్
  • మున్సిపల్  కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి... గుండు బోగుల రమేష్
  • రామచంద్రపురం పట్టణంలో 20 వార్డులో నకిలీ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి ఓటు వేయడానికి వచ్చిన వారిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు
  • విషయాన్ని పోలీసులకు తెలిపినా అతనిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టారని ఆరోపిస్తున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు  
  • విషయం తెలుసుకుని బూత్ వద్దకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు... టీడీపీ నేతలు
  • 20వ వార్డులో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ రీ పోలింగ్ నిర్వహించవలసిందిగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందజేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుండు బోగుల రమేష్

కృష్ణాజిల్లా

  • ఉయ్యూరు మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్
  • 76.17 శాతం పోలింగ్ నమోదు  
  • మొత్తం వార్డులు : 32
  • మొత్తం ఓటర్లు : 32,793  
  • ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు : 24,979
  • పురుషులు : 11,908
  • మహిళలు: 13,071

చిత్తూరు

  • చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 62.53శాతం పోలింగ్ నమోదు
  • మొత్తం 175 పోలింగ్ కేంద్రాల్లో 62.53 శాతం పోలింగ్ నమోదు
  • పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డుల్లో పోలింగ్  30925 ఓట్లు పోల్ అయ్యాయి
  • మొత్తం 72.76%. శాతం పోలింగ్ నమోదు

నెల్లూరు

  • నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫైనల్ పోలింగ్ శాతం 57.72%

విజయవాడ

  • కార్పోరేషన్‌లో 8గంటల వరకు 54.74 శాతం పోలైన ఓట్లు
  • ఇంకా 55వ డివిజన్‌లో కొనసాగుతున్న పోలింగ్

ప్రకాశం జిల్లా

  • చీమకుర్తిలో 14 వార్డు బూత్ నెంబర్ 14కి రిపోలింగ్‌కు అధికారులు అదేశం
  • రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న రిపోలింగ్

విజయనగరం జిల్లా

  • పోలింగ్ ముగిసిన తరువాత ఏజెంట్లకు ఇవ్వాల్సిన ఫారం 35 ఇవ్వకుండా వెళ్లిపోయిన పోలింగ్ అధికారులు
  • బ్యాలెట్ పేపర్ అకౌంట్ వివరాలు ఇవ్వకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఆందోళన
  • ఫారం థర్టీ ఫైవ్ ఇవ్వకుండానే బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్‌ కి ప విజయనగరం 59 60 61 62 63 వార్డులలో అధికారుల ఆగడం
  • బ్యాలెట్ పేపర్ ఎకౌంటు ఫారం 35 ఇవ్వకపోతే స్ట్రాంగ్ రూమ్‌లో ఓట్లను చేర్చుతారు అనే భయంతో అభ్యర్థులు

కాకినాడ

  • పిఠాపురంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం
  • జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌తో కలిసి దౌర్జన్యం
  • పిఠాపురంలో జనసేన దౌర్జన్యం
  • రిగ్గింగ్‌కు పాల్పడుతున్న వంకతో  19 వ వార్డు బూత్ లోకి వెళ్ళేందుకు ఎంపీ ఉదయ్  శ్రీనివాస్,కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు..బ్యాలెట్ బాక్స్ లు సీల్ చేశారని చెప్పినా వినని పంతం నానాజీ ,ఉదయ్ శ్రీనివాస్
  • పోలీస్‌లపై ఎమ్మెల్యే నానాజీ బూతుపురాణం

కృష్ణా జిల్లా 

  • మచిలీపట్నం నగరపాలక సంస్థలో ముగిసిన పోలింగ్
  • 70.83 శాతం పోలింగ్ నమోదు
  • వార్డులు : 60
  • మొత్తం ఓటర్లు: 1,39,246
  • పోలైన ఓట్లు : 98,627

ఎన్టీఆర్ జిల్లా - ప‌ట్ట‌ణ స్థానిక సంస్థల పోలింగ్ శాతం
సాయంత్రం 05.00 గంట‌లు (ఫైనల్)

  • కొండపల్లి : ఐదు పోలింగ్ స్టేషన్ల పరిధిలో సమాచారం ఇంకా అందవలసి ఉంది
  • తిరువూరు : 73.81%
  • నందిగామ : 72.67%
  • జగ్గయ్యపేట : 72.92%

విజయవాడ

  • మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయంత్రం ఐదు గంటలకు 49.42 % పోలింగ్ నమోదు
  • ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్‌లల్లో జరుగుతున్న పోలింగ్

ఎన్టీఆర్ జిల్లా

  • జగ్గయ్యపేట మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్.
  • మొత్తం నమోదైన పోలింగ్ శాతం. 72.92%

విశాఖ

  • ఎలమంచిలి నియోజకవర్గంలో ముగిసిన పోలింగ్
  • 76% జరిగిన పోలింగ్

పశ్చిమగోదావరి జిల్లా
నరసాపురం మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ వివరాలు

  • మొత్తం పోలింగ్ శాతం: 69.64%
  • పురుషుల ఓట్లు: 15,690
  • మహిళల ఓట్లు: 17,037
  • మొత్తం పోలైన ఓట్లు: 32,727
  • ఆకివీడు నగర పంచాయతీ  పోలింగ్ శాతం 72.75

కృష్ణాజిల్లా

  • ఉయ్యూరులో 14,15,18,21,22 వార్డులో ఎన్నికల అధికారుల అత్యుత్సహం
  • పోలింగ్ అయిన ఓటర్ జాబితాను బయటికి పంపించిన అధికారులు
  • ఓటర్ లిస్ట్ ఎలా బయటికి పంపిస్తారంటూ ఎన్నికల అధికారులను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
  • పోలింగ్ స్టేషన్‌లో ఉన్న అభ్యర్థులను బయటకు పంపిన ఎన్నికల అధికారులు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించడంపై పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తి ఫైర్

విజయవాడ

  • న్యూ రాజరాజేశ్వరి పేట వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని ఈసారపు దేవి భర్త రాజా రమేష్‌ను అరెస్ట్ చేసిన సింగ్ నగర్ పోలీసులు
  • 2,3, బూతుల్లో ఓటు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుల్ని  అడ్డుకొన్న టిడిపి నేతలు
  • సింగ్ నగర్  కార్పొరేటర్ అభ్యర్థి భర్తను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు
  • పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • పోలీస్ స్టేషన్‌కి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు

నెల్లూరు జిల్లా

  • నెల్లూరు కార్పొరేషన్ లో ఓటు వేయడానికి ఇంకా క్యూలైన్స్‌లో వేచివున్న ఓటర్లు
  • 5 గంటల వరకు పోలింగ్ ముగిసిన సమయానికి ఇలా..
  • ఆత్మకూరు 73.09
  • నాయుడుపేట 70.7
  • బుచ్చిరెడ్డిపాలెం 60.52
  • వెంకటగిరి  67.04
  • సూళ్లూరుపేట  63.72

అనకాపల్లి జిల్లా

  • ముగిసిన నర్సీపట్నం మున్సిపల్ పోలింగ్
  • మొత్తం 49,099 ఓట్లకు గాను పోలైన ఓట్లు 35,647 ఓట్లు
  • 72.60 శాతం నమోదు

విజయవాడ

  • 16వ డివిజన్ – Zion High School పోలింగ్ స్టేషన్‌లో ఉద్రిక్తత
  • 16వ డివిజన్ పరిధిలోని Zion High School పోలింగ్ స్టేషన్ వద్ద కూటమి నాయకులు పహారా
  • పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న దేవినేని అవినాష్
  • సరైన గుర్తింపు కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు లేకుండా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న కూటమి నాయకులు
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని బయటకు పంపాలని పోలీసు అధికారులను ప్రశ్నించిన దేవినేని అవినాష్
  • దేవినేని అవినాష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాతే వారిని బయటకు పంపిన పోలీసులు
  • పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులను టీడీపీ కూటమి నాయకులు తోసివేస్తూ దురుసుగా ప్రవర్తించిన ఘటన
  • ఈ వ్యవహారంపై పోలీసుల తీరును ప్రశ్నించిన దేవినేని అవినాష్

    చిత్తూరు
  • చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ సిబ్బంది, పోలీసులు నిర్లక్ష్యం
  • కట్టమంచి పోలింగ్ కేంద్రంలో ఖాళీ బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

    విజయనగరం జిల్లా
  • శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్
  • ఏ వర్గ ప్రజల గురించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకో లేదు ఎంతసేపు ప్రచార పిచ్చే
  • నాడు నేడు ద్వారా సగంలో ఉన్న స్కూల్ నిర్మాణాలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు
  • విద్య వైద్యం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
  • ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారు
  • ఈ ఎన్నికలు జరిపే విధానం చూస్తే నవ్వాలో ఏడాలో తెలియడం లేదు
  • అసలు ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదు

    విజయనగరం జిల్లా
  • మున్సిపల్ ఎన్నికల్లో సాయంత్రం 5  వరకు 62.65 శాతం ఓటింగ్ నమోదు
  • విజయనగరంలో 59.64 శాతం
  • నెల్లిమర్లలో 77.96 శాతం
  • బొబ్బిలిలో 70.33 శాతం

విశాఖ

  • జీవీఎంసీ ఎన్నికల్లో ఛాలెంజింగ్ ఓట్
  • జీవీఎంసీ 5వ వార్డులో ప్రత్యేకంగా ఓటు హక్కు పొందిన దుర్గా ప్రసాద్
  • తన ఓటు దుర్వినియోగం అయిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

తిరుపతి జిల్లా

  • తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ పరిధిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
  • రాఘవేంద్ర నగర్, కేశవాయానాకుంటలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన నకిలీ ఓటర్లను పట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

చిత్తూరు జిల్లా

  • చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్
  • 21 వ డివిజన్ పరిధిలో వల్లియప్ప నగర్‌లో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు
  • పట్టించుకోని పోలీసులు

అనంతపురం

  • టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రిగ్గింగ్
  • అనంతపురం నగరంలోని 11వ డివిజన్‌లో టీడీపీ గూండాలతో వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
  • టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లటంపై వైఎస్సార్ సీపీ నేతల అభ్యంతరం
  • టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను నిలదీసేందుకు వెళ్లిన మహిళలను అడ్డుకున్న పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గన్‌మెన్లు

చిత్తూరు జిల్లా

  • చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్
  • 21వ డివిజన్ పరిధిలో వల్లియప్ప నగర్‌లో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు
  • పట్టించుకోని పోలీసులు

    కర్నూలు జిల్లా
  • గూడూరు నగర పంచాయతీ ఫైనల్ పోలింగ్ శాతం 83.60
  • కర్నూలులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ శాతం 51.84

    కృష్ణాజిల్లా
  • మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముగిసిన పోలింగ్
  • బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేస్తున్న అధికారులు
  • బ్యాలెట్ బాక్స్‌లను  కృష్ణా  యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనున్న అధికారులు

ఎన్టీఆర్ జిల్లా  ప‌ట్ట‌ణ స్థానిక సంస్థల పోలింగ్ శాతం
మధ్యాహ్నo 04.00 గంట‌లు వరకు నమోదైన పోలింగ్ శాతం

  • కొండపల్లి  : 60.49.%
  • తిరువూరు : 68.30 %
  • నందిగామ : 70.98%
  • జగ్గయ్యపేట : 65.60%

ఏలూరు జిల్లా

  • ముదినేపల్లిలో  వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డగించి టీడీపీ కార్యకర్తలు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బరితెగించి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు
  • దెబ్బలు తగిలిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అంబులెన్స్ ద్వారా హాస్పటల్కు తరలింపు
  • పోలీస్ స్టేషను ముందు ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు

విజయనగరం జిల్లా

  • విజయనగరం ఎం ఆర్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

అనంతపురం

  • విజయనగర లా కాలేజీలో ఉద్రిక్తత
  • రిగ్గింగ్ చేసేందుకు టీడీపీ నేతల యత్నం
  • టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో గూండాగిరి
  • టీడీపీ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
  • పోలీసులతో వాగ్వాదం
  • 31 వార్డులోని పోలింగ్ బూత్ 31/1,2,3,4, వద్ద ఉద్రిక్తత
  • టీడీపీ వారు రిగ్గింగ్ చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఆందోళన
  • MLA దగ్గుబాటి ప్రసాద్, టీడీపీ, జనసేన, నాయకులు పోలింగ్ బూత్ లోకి వెళ్లడం పై ఆందోళన
  • వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి రెడ్డి అక్కడికి చేరుకొని ఆగ్రహం

హిందూపురం

  • హిందూపురంలోని 17వ వార్డులో ముగిసిన పోలింగ్
  • పోలింగ్ బూత్ గేటుకు తాళాలు వేసిన అధికారులు

    కర్నూలు
  • మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి టీజీ భరత్ హల్ చల్
  • పోలింగ్ కేంద్రం వద్ద తన అనుచరులతో హడావుడి
  • 12వ వార్డు ఉస్మానియా కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో ఫోన్‌లో మంతనాలు చేసిన మంత్రి
  • పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి 15 నిమిషాల పాటు కూర్చున్న మంత్రి
  • ఆక్కడే  నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ మాట్లాడుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న మంత్రి టీజీ భరత్
  • ఎన్నికల నియమాలని ఉల్లంఘించిన మంత్రి టీజీ భరత్

అనంతపురం

  • శ్రీ చైతన్య స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన టీడీపీ అల్లరి మూకలను పట్టుకున్న స్పెషల్ పోలీసులు

అక్రమ అరెస్టులు..

  • కదిరి పట్టణంలో 18వ వార్డుకు సంబంధించి టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ
  • పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్ అడ్డుపడడంతో రూరల్ సీఐ నాగేంద్ర ఆయనని అక్రమంగా అరెస్టు చేశారు 
  • అక్కడున్న ఓటర్లు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఖండిస్తూ జై జగన్ అనే నినాదాలతో అడ్డుపడగా వారిని భయభ్రాంతులకు గురి చేసి బాబ్జాన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పల్నాడు జిల్లా 

  • చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక 17వ వార్డులో రిగ్గింగ్‌
  • జనసేన పార్టీకి చెందిన పెంట్యాల బాలాజీ ఇతర ప్రాంతాలకు చెందిన జనంతో పోలింగ్ కేంద్ర వద్దకు దూసుకు వచ్చి రిగ్గింగ్‌..
  • దీంతో వార్డు ప్రజలు పోలింగ్ కేంద్ర సమీపనే ఉన్న రోడ్డుపై బైఠాయించి ఈ సందర్భంగా పోలింగ్ వాయిదా వేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్‌


చిత్తూరు

  • చిత్తూరు నగరంలోని 44 వ వార్డు రాంనగర్ కాలనీలో కేశవరెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన అమ్మాయిని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని హరీషారెడ్డి

తిరుపతి జిల్లా

  • తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యం
  • 49వ డివిజన్ సుందరయ్య నగర్‌లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ దొంగ ఓటర్లను అడ్డుకున్న సీపీఎం కార్యకర్తలు

తిరుపతి జిల్లా

  • తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 50 వ డివిజన్‌లో జనరల్  ఏజెంట్ శ్రీనివాసులు రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు
  • కూటమి నేతలు ఆదేశాలతో జనరల్ ఏజెంట్ శ్రీనివాసులు రెడ్డి ను స్టేషన్ కు తరలించిన పోలీసులు

తిరుపతి జిల్లా

  • పుత్తూరులో టీడీపీ దౌర్జన్యం
  • వైఎస్సార్‌సీపీ నేతలపై పోలింగ్ కేంద్రం వద్ద దాడి
  • పుత్తూరు మున్సిపాలిటీ మెయిన్ స్కూల్ వద్ద ఉద్రిక్తత
  • పుత్తూరు జనసేన చైర్మన్ అభ్యర్థి అమ్ములు కొడుకు దౌర్జన్యం
  • పుత్తూరు మున్సిపాలిటీ 33 వార్డు బూత్‌లో దొంగ ఓట్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ యువ నాయకుడు మనోజ్ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి

పల్నాడు జిల్లా

  •  మాచర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న టీడీపీ రౌడీయిజం
  •  సామాన్య ఓటర్లకు కూడా తప్పని‌ బెదిరింపులు
  • 12 వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లను అడ్డుకుని బెదిరించిన పచ్చ గూండాలు, పోలీసులు
  • మీ ఓటు మేం వేస్తాం వెళ్లిపోవాలంటూ హుకూం 
  • కాదు కూడదు అంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరిక

ప్రకాశం జిల్లా

  • అద్దంకిలో రిగ్గింగ్‌
  • వార్డులలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపుతున్న కూటమినేతలు  
  • కూటమి నేతలకు సహకరిస్తున్న పోలీసులు 

మార్కాపురం జిల్లా

  • సెయింట్ పాల్స్ కాలేజ్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై దాడి కలకలం
  • 2వ పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్ పై దాడి చేసిన టీడీపీ నేతలు
  • మాకు రక్షణ కావాలి అంటున్న వైఎస్సార్‌సీపీ 2వ వార్డ్ అభ్యర్థి లక్ష్మీ దేవి
  • పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన

తిరుపతి

  • తిరుపతి కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ నాయకులు తీసుకు వచ్చిన వారిని అడ్డుకున్న కమ్యూనిస్ట్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్
  • యశోద నగర్, సప్తగిరి కాలనీ, రైల్వే కాలనీల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన పెద్ద ఎత్తున తరలిస్తున్న టీడీపీ నాయకులు
  • 48 వ డివిజన్లలో టిడిపి రిగ్గింగ్ యత్నం అడ్డుకున్న సీపీఎం, సీపీఎం నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద నిరసన

విజయవాడ

  • నిర్మలా కాన్వెంట్ పోలింగ్ స్టేషన్‌లో అక్రమంగా బూత్ ఏజెంట్ల నియామకం
  • స్థానికంగా ఓటు హక్కు లేకపోయినా కూటమి పార్టీకి చెందిన వ్యక్తులను బూత్ ఏజెంట్లుగా కూర్చోబెట్టడంపై అభ్యంతరం
  • నియోజకవర్గానికి సంబంధం లేని బయటి వ్యక్తులు పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడంపై  ఆగ్రహం వ్యక్తం చేసిన  ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
     

పల్నాడు జిల్లా

  • వినుకొండలో బరితెగించిన తెలుగుదేశం నాయకులు
  • నియోజకవర్గంలోని గ్రామాల నుంచి వినుకొండకు భారీ స్థాయిలో తెలుగుదేశం గుండాలను రప్పించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
  • 10 వార్డుల్లో పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేసిన తెలుగుదేశం గుండాలు
  • యధేచ్చగా రిగ్గింగ్
  • తెలుగుదేశం రౌడీలు రిగ్గింగ్ చేస్తున్న పట్టించుకోని పోలీసులు

 

విజయవాడ

  • విజయవాడలో మూడు గంటలకు 40.8% పోలైన ఓట్లు

విజయనగరం జిల్లా

  • బొబ్బిలి 22వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత
  • రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతలు
  • ​టీడీపీ శ్రేణుల రిగ్గింగ్‌ను అడ్డుకున్న ఎస్ఐ లోవరాజు
  • విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపైనే దౌర్జన్యం
  • ఎస్ఐ పైకి దూసుకెళ్లి దాడికి యత్నించిన టీడీపీ అభ్యర్థి బంధువు పువ్వాల శ్రీనివాసరావు
  • ​"వైఎస్సార్‌సీపీకి పనిచేస్తున్నావా" అంటూ ఎస్ఐకు బెదిరింపులు
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ తీరుపై స్థానికుల ఆగ్రహం

కర్నూలు

  • కర్నూలు మునిసపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపి దౌర్జన్యాలు
  • రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పోలీసులు
  • 67వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పోరేటర్ అభ్యర్థి అనితా తమ్ముడు శ్రీకాంత్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • అక్రమ అరెస్టు చేస్తారా అంటూ కర్నూలు టూ టౌన్ పోలీసులను అడ్డుకున్న అనితా
  • పోలీస్ వాహనం పైకి ఎక్కి అక్రమ అరెస్టును అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి

పల్నాడు జిల్లా

  • చిలకలూరిపేటలో తెలుగుదేశం నాయకుల అరాచకం
  • నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం గుండాలను చిలకలూరిపేట రప్పించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు
  • చిలకలూరిపేట లో ఉన్న 48 వార్డుల్లో పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేసిన టిడిపి రౌడీలు
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఏజెంట్లను బయటకు పంపించేసిన తెలుగుదేశం గుండాలు
  • యదేచ్చిగా చిలకలూరిపేటలో తెలుగుదేశం నాయకుల రిగ్గింగ్
  • చేతులెత్తేసిన పోలీసులు

తిరుపతి, మున్సిపల్ ఎన్నికలు
తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారా? : భూమన కరుణాకర్ రెడ్డి

  • ఎన్నికల పేరుతో గూండాగిరీ చేస్తున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
  • తిరుపతి పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్, దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు
  • మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, ఆయన అనుచరులపై భూమన తీవ్ర ఆరోపణలు
  • 45, 53, 57, 59, 6, 13, 42, 63, 20వ వార్డుల్లో రిగ్గింగ్ జరుగుతోందని సమాచారం
  • 16వ వార్డులో వెబ్ కెమెరాలను తొలగించారంటూ భూమన ఆరోపణ
  • ఎల్‌బీనగర్, అమరావతి నగర్‌లోనూ వెబ్ కెమెరాల తొలగింపు జరిగిందని వెల్లడి
  • పోలింగ్ అధికారులను దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
  • ఎన్నికల ఏజెంట్లు, అభ్యర్థులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు
  • పోలింగ్ కేంద్రాల్లో అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఆగ్రహం
  • తిరుపతిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అరికట్టాలని డిమాండ్
  • ఎన్నికల ప్రక్రియను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను తక్షణమే అరికట్టాలని భూమన డిమాండ్
  • రిగ్గింగ్, దౌర్జన్యాల ఆరోపణలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి
  • అక్రమాలు జరిగినట్లు తేలిన వార్డుల్లో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్
  • పూర్తి భద్రత, పారదర్శకతతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి
  • ఓటు హక్కును కాపాడాలి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి – భూమన కరుణాకర్ రెడ్డి
  • ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

తూర్పుగోదావరిజిల్లా
మధ్యాహ్నం 3.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

  • కొవ్వూరు మున్సిపాలిటీ 55.21 శాతం
  • నిడదవోలు మున్సిపాలిటీ 59.62శాతం

తిరుపతి
తిరుపతి జిల్లాలో  మధ్యాహ్నం 3గంటలకు వరకు జరిగిన పోలింగ్ శాతం వివరాలు

  • తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు గాను 42.12. శాతం
  • పుత్తూరు.36 వార్డులకు గాను 64.66 శాతం

కృష్ణా జిల్లా - ప‌ట్ట‌ణ స్థానిక సంస్థల పోలింగ్ శాతం
మధ్యాహ్నo 03.00 గంట‌ల వరకు

  • మచిలీపట్నం : 55.1 %
  • ఉయ్యూరు: 59.35%
  • పెడన : 65.79 %

ఎన్టీఆర్ జిల్లా - ప‌ట్ట‌ణ స్థానిక సంస్థల పోలింగ్ శాతం
మధ్యాహ్నo 03.00 గంట‌ల వరకు

  • కొండపల్లి       : 59.03%
  • తిరువూరు    :  61.25%
  • నందిగామ    :  62.39%
  • జగ్గయ్యపేట :  58.25%

విజయనగరం జిల్లా
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో  ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం

  • విజయనగరంలో 49.29   శాతం
  • నెల్లిమర్లలో 63.37  శాతం
  • బొబ్బిలి లో 60.97 శాతం

పశ్చిమగోదావరి జిల్లా

  • మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
  • నరసాపురం మున్సిపాలిటీ  పోలింగ్ శాతం 58.11%
  • ఆకివీడు నగర పంచాయతీ పోలింగ్ శాతం 61.94%

    కాకినాడ జిల్లా
    మున్సిపల్ ఎన్నికల్లో  మధ్యాహ్నం 3.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాల వివరాలు
  • పిఠాపురం- 63.16%
  • గొల్లప్రోలు- 63.55%
  • పెద్దాపురం- 57.02%
  • సామర్లకోట - 58.00%
  • తుని- 55.95%
  • ఏలేశ్వరం - 61.22%
  • మొత్తం 59.34 % పోలింగ్  నమోదు

పులివెందుల: 

ఎస్‌ఈసీ చంద్రబాబు మనిషి: వైఎస్‌ జగన్‌

  • ఎస్‌ఈసీ సహా అంతా చంద్రబాబు చేతిలో తోలు బొమ్మలు
  • పులివెందులలో చోటు చేసుకున్న ఘటనలపై వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆవేదన
  • ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
  • ఈ ఘటనలపై కోర్టుకు వెళతాం
  • పులివెందులలో  ఓటు వేయకుండా వెనుదిరిగిన వైఎస్‌ జగన్‌
  • రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు ప్రజలకు తెలియాలి

విజయవాడ

  • స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం గేట్‌కి వినతిపత్రం కట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా గేట్‌కి వినతిపత్రం కట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు

    పల్నాడు జిల్లా 
    వినుకొండ
  • వినుకొండ 8 వ వార్డు అర్చన మూర్తి దంపతులపై దాడి చేసిన టీడీపీ నాయకుడు
  • మహిళని చూడకుండా మొహం మీద పిడి గుద్దులు గుద్ది నెట్టేసిన వైనం
  • మాచర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న టీడీపీ రౌడీయిజం
  • సామాన్య ఓటర్లకు కూడా తప్పని‌ బెదిరింపులు
  • 12 వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లను అడ్డుకుని బెదిరించిన పచ్చ గూండాలు, పోలీసులు
  • మీ ఓటు మేం వేస్తాం వెళ్లిపోవాలంటూ హుకూం
  • కాదు కూడదు అంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరిక

    నెల్లూరు జిల్లా
  • ఆత్మకూరులో జనసేన vs టిడిపీ
  • మంత్రి ఆనంపై జనసేన ముఖ్య నేత నలిసెట్టి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
  • పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆత్మకూరు మున్సిపాలిటీలో 8 చోట్ల పోటీ చేసాం
  • 11వ వార్డు జనసేన అభ్యర్థిగా వున్న తనను పోలింగ్ కేంద్రం వద్దకు రావద్దంటూ పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణ
  • పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఎస్సై మెడ పట్టుకుని తోసేశారు అన్న శ్రీధర్
  • మంత్రి ఆదేశాలతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ఆగ్రహం
  • జనసేన నాయకులు, కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారంటూ మండిపాటు

తిరుపతి

  • కార్పోరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లు
  • యశోధనగర్ ,సప్తగిరి నగర్, రైల్వే కాలనీ లో దొంగ ఓటర్లు సిద్ధం చేసిన టీడీపీ నాయకులు

పల్నాడు జిల్లా

  • మాచర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న టీడీపీ రౌడీయిజం
  • సామాన్య ఓటర్లకు కూడా తప్పని‌ బెదిరింపులు
  • 12 వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లను అడ్డుకుని బెదిరించిన పచ్చ గూండాలు, పోలీసులు
  • మీ ఓటు మేం వేస్తాం వెళ్లిపోవాలంటూ హుకూం
  • కాదు కూడదు అంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరిక

    విజయవాడ: 
    ఎస్‌ఈసీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత 
  • స్థానిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై నిరసన
  •  ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా ఎమ్మెల‍్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు  
  • విజయవాడలో ఎస్‌ఈసీ ఆఫీసు దగ్గర ఆందోళన
  • కార్యాలయం గేటు వద్ద బైఠాయింపు

కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు

  • ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డులో పోలింగ్ నిలిపివేత
  • మూడో వార్డులో కూటమి తరపున పోటీ చేస్తున్న టీడీపీ
  • బ్యాలెట్ పేపర్ లో సైకిల్ సింబల్ బదులు కమలం గుర్తు ఉండడంతో గందరగోళం

గుంటూరు

  • గుంటూరు కార్పొరేషన్‌లోని పోలింగ్ కేంద్రాలలో ఉదయం నుంచి కొనసాగుతున్న టీడీపీ గుండాల అరాచకాలు
  • పోలింగ్ బూత్‌లలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ గుండాలు
  • బ్యాలెట్ బాక్సులు క్రింద పడేసిన టీడీపీ గుండాలు
  • పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నేతలు
  • బ్యాలెట్ బాక్స్‌లు క్రింద పడేయడంపై పోలింగ్ బూత్‌లో నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ ఏజెంట్
  • వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ ఏజెంట్ పై దాడికి పాల్పడిన టీడీపీ నేతలు 
  • దొంగ ఓట్లు వేస్తున్న వారిని వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకుంటున్నారని కోపంతో దాడులకు దిగిన పచ్చ పార్టీ నేతలు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చంపుతామని పోలీసుల ముందే బహిరంగంగా హెచ్చరిస్తున్న టీడీపీ నేతలు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైసిపి నేతల ఆగ్రహం
  • 57 డివిజన్ లో దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయిస్తున్న టీడీపీ నేతలు
  • లిటిల్ ఫ్లవర్ పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

నంద్యాల జిల్లా....

  • డోన్, బేతంచర్ల మున్సిపల్ ఎన్నికలను బహిష్కరణ చేసినట్లు ప్రకటించిన మాజీ మంత్రి బుగ్గన
  • పోలీసులు కూటమి ప్రభుత్వానికి బానిసలుగా మారారని మండిపాటు
  • ఎన్నికలకు భద్రత కల్పించి ఎన్నికలు సజావుగా జరిపించాలంటూ నిన్న ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు
  • హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని అధికారులు
  • రిపోలింగ్ కోసం హైకోర్టు,సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్న మాజీ మంత్రి
  • ఎన్నికలపై న్యాయం జరిగే వరకూ కోర్టులను ఆచరిస్తామంటూ మాజీ మంత్రి వెల్లడి 
  • నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హౌస్ అరెస్ట్

విజయవాడ

  • ఎస్ఈసీ కార్యాలయం ముందు కింద కూర్చుని నిరసన తెలుపుతున్న వైసిపి నేతలు
  • ఎన్నికల కమిషనర్ తీరుకు నిరసనగా ధర్నా
  • ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, కల్పలత రెడ్డి, రూహుల్లా, హనుమంతరావు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు

నంద్యాల జిల్లా

  • నంద్యాలలో వైసిపి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కి అడుగడుగునా పోలీసులు అడ్డంకులు
  • నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నా కూడా పోలీసులు వేధింపులు
  • అడుగడుగునా అడ్డంకులు సృష్టించి పోలింగ్ సరలిని టీడీపీకి అనుకూలంగా మలచడానికి పోలీసుల ప్రయత్నాలు
  • మంత్రి ఫరూక్, ఆయన కుమారులు ఫిరోజ్, ఫయాజ్, ఎంపీ శబరికి లేని నిబంధనలు నాకే వర్తిస్తాయా అంటూ పోలీసులను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి
  • నోటీసులు ఇచ్చి ఆయనను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • 2024లో కేసును సాకుగా చూపి మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
  • శ్రీశైలం, పక్క నియోజకవర్గల నుండి భారీగా టీడీపి మూకలు వారి అనుచరులతో నంద్యాలో ఉన్నారు
  • మంత్రి ఫరూక్ పై, ఆయన కుమారులపై ఉన్న కేసులు వారికి వర్తించవా అని ప్రశ్నించారు

విశాఖ

  • విశాఖ 37వ వార్డులో రిగ్గింగ్‌కు యత్నం
  • టీడీపీ, జనసేన నేతలతో పోలింగ్‌ సిబ్బంది కుమ్మక్కు
  • మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణిని అడ‍్డుకున్న టీడీపీ రౌడీలు
  • కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మేయర్‌అభ‍్యర్థి వరుదు కల్యాణి

తిరుపతి : వైఎస్సార్‌సీపీ పార్టీ ఏజెంట్ పై దాడి..

  • 83వ డివిజన్లో రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ
  • అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ పార్టీ ఏజెంట్ చైతన్య
  • మారణాయుధాలతో దాడికి తెగబడిన టీడీపీ గూండాలు
  • టీడీపీ అభ్యర్థి శంకర్ యాదవ్‌తో పాటు 50 మందికి పైగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్  చైతన్యపై దాడి
  • తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన చైతన్య
  • కారును ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
  • ప్రజల నుండి వైఎస్సార్‌సీపీకి పెద్ద ఎత్తున మద్దతు..
  • తట్టుకోలేక ఓటమి భయంతో రిగ్గింగుకు పాల్పడుతున్న కూటమి అభ్యర్థులు
  • పోలింగ్ బూత్‌ల వద్ద మోహరించిన ఇతర ప్రాంతాల రౌడీ మూకలు
  • పోలీసుల సహకారంతో  కొనసాగుతున్న రిగ్గింగ్, పట్టించుకోని అధికారులు..
  • కూటమి అభ్యర్థులతో కుమ్మక్కైన పోలీసులు అధికారులు..
  • ప్రజా క్షేత్రంలో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేక రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు..

అన్నమయ్య జిల్లా మదనపల్లె 11వ వార్డులో దొంగ ఓట్ల కలకలం..!

  • ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులతో ఓట్లు వేయించారంటూ ఆరోపణలు..
  • అధికార పార్టీ నాయకుడి కళాశాల విద్యార్థినులతో దొంగ ఓట్లు వేయించినట్లు వైఎస్సార్‌సీపీ ఆరోపణ..
  • గమనించి అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ యువకులు..
  • రంగంలోకి దిగిన పోలీసులు..
  • విద్యార్థినులతో వచ్చిన కారును అక్కడి నుంచి పంపించిన పోలీసులు..
  • 11వ వార్డులో చోటుచేసుకున్న ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ..

కర్నూలు జిల్లా...

  • ఎమ్మిగనూరు పట్టణంలోని 26వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత..
  • మహిళలపై లాఠీచార్జి చేసిన పోలీసులు..
  • పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రయత్నం..
  • అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి, పార్టీ శ్రేణులు
  • వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు..
  • ప్రతిఘటించిన వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలు..
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జీ
  • రాజీవ్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు..

ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు..

  • 11వ వార్డులో బీజేపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ..
  • పోలింగ్ బూత్ వద్ద జనసేన నేతలతో బీజేపీ నేతల కవ్వింపు చర్యలు..
  • రెండు సార్లు ఎదురెదురుగా వెళ్లి గొడవలకు దిగిన బీజేపీ, జనసేన నేతలు
  • రాళ్లు దాడులకు దిగిన బీజేపీ, జనసేన నాయకులు..
  • బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేత అడ్డగిరి శ్యామ్‌
  • లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • కాలనీలలో ఉద్రిక్త పరిస్థితులు, కాసేపు పోలింగ్‌కు అంతరాయం..

కడపలో రిగ్గింగ్ బట్టబయలు..

  • జమ్మలమడుగు ఓటింగ్ శాతంలో విచిత్రాలు
  • 4గంటల్లోనే 60.92 శాతం పోలింగ్
  • 11 గంటలవరకు 60.92 శాతం నమోదైనట్టు ఎస్ఈసీ ప్రకటన
  • మధ్యాహ్నం 1 గంటకు 61.86 శాతం పోలింగ్ నమోదు
  • మొదటి 4 గంటల్లో 60.92 శాతం నమోదైనట్టు చూపిన ఎస్ఈసీ
  • తర్వాత 2 గంటల్లో కేవలం 1 శాతం మాత్రమే నమోదైనట్టు వెల్లడి
  • ఎస్ఈసీ లెక్కలతో బట్టబయలైన రిగ్గింగ్..
  • భారీ పోలింగ్‌పై ఎస్ఈసీ అధికారులకు అనుమానాలు..
  • రిటర్నింగ్ అధికారితో మాట్లాడిన ఎస్ఈసీ

పులివెందులలో భారీగా రిగ్గింగ్..

  • ఓటర్లు వెళ్లకుండానే 51.5 శాతం ఓటింగ్ జరిగినట్టు ప్రకటన
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కొట్టి పంపేసిన టీడీపీ గూండాలు
  • స్థానిక ఓటర్లను పోలింగ్ బూతులకు రానివ్వని పోలీసులు, టీడీపీ గూండాలు

చిత్తూరు..

  • చిత్తూరు 31వ డివిజన్ పరిధిలో టీడీపీ నేత కాజురు బాలాజీ హల్‌చల్!
  • వైఎస్సార్‌సీపీ పార్టీ పోలింగ్ ఏజెంట్స్‌కు బెదిరింపులు..
  • ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లపై దాడి చేసిన టీడీపీ గూండాలు..
  • పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు..

విజయవాడ..

  • 70వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌పై టీడీపీ శ్రేణుల దాడి..
  • ఎలక్షన్ ఏజెంట్ విజయ్ యాదవ్ మెడలో వున్న ఐడిని లాగి పడేసిన టీడీపీ శ్రేణులు..

విశాఖ..

  • వరుదు కళ్యాణి కామెంట్స్‌..
  • 37వ వార్డు ఐదో పోలింగ్ బూత్‌లో జనసేన నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు.
  • వారికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు..
  • వారిని వెంటనే విధులు నుంచి తొలగించాలి..
  • ఓడిపోతామని భయంతో రిగ్గింగ్ దాడులకు పాల్పడుతున్నారు..
  • ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తోంది..
  • వైఎస్సార్‌సీపీ మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటర్ల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.
  • పోలింగ్ బూతుల్లో జనసేన నాయకులను ఉంచి వైఎస్సార్సీపీ నేతలను బయటికి వెళ్ళమని అధికారులు చెబుతున్నారు.


విశాఖ..

  • జీవీఎంసీ 92వ వార్డులో రిగ్గింగ్ చేసేందుకు యత్నించిన జనసేన నేతలు..
  • జనసేన నేతల రిగ్గింగ్ ప్రయత్యాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు..
  • దౌర్జన్యం చేసేందుకు యత్నించిన కూటమి నేతలు..

     

  • పులివెందుల మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి.
  • ఆర్వో తనూజ లేకపోవడంతో పులివెందుల ఆర్డీఓ చిన్నయ్యకు పోలింగ్ సరళిపై ఫిర్యాదు చేయనున్న వైఎస్‌ జగన్‌.
  • ఆర్వో ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన వైఎస్‌ జగన్‌
  • 70 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో కలిసి వైఎస్‌ జగన్‌ బైఠాయింపు.
  • ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన.
  • ఆర్వో శ్రీనివాస్‌, ఆర్డీవో చిన్నయ్యతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకోవడంపై ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌.
  • ఎన్నికలు అంటే పోటీ జరగాలి: అధికారులతో వైఎస్‌ జగన్‌
  • ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనపడుతున్నారు. 

కడప : రవీంద్రనాథ్  రెడ్డి కామెంట్స్..

  • స్దానిక ఎన్నికల్లో మొదటి నుంచి అన్నీ దౌర్జన్యాలే
  • పోలీసులు వారికి సహకరిస్తున్నారు..
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో 11 డివిజన్లు, మేయర్ అభ్యర్థి నామినేషన్లు వేశారు..
  • ఇవాళ పోలింగ్ రోజు అదే దౌర్జన్య పరిస్థితి..
  • 65 డివిజన్‌లో మా పార్టీ అభ్యర్ది ఫయాజ్ కొట్టి తరిమేశారు..
  • పోలీసులు, వైఎస్సార్‌సీపీ పార్టీ మధ్య ఎన్నికలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది..
  • ఏజెంట్లనే పోలీసులు బయటికి పంపించారు..
  • ప్రజాస్వామ్య వాదులు అందరూ ఈ దుస్థితిని ఖండించాలి..

విశాఖపట్నం..
ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తోంది : వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కళ్యాణి

  • 37వ వార్డు ఐదో పోలింగ్ బూత్‌లో జనసేన నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు..
  • వారికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు..
  • వారిని వెంటనే విధులు నుంచి తొలగించాలి..
  • ఓడిపోతామని భయంతో రిగ్గింగ్ దాడులకు పాల్పడుతున్నారు..
  • వైఎస్సార్‌సీపీ మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటర్ల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది..
  • పోలింగ్ బూతుల్లో జనసేన నాయకులను ఉంచి వైఎస్సార్‌సీపీ నేతలను బయటికి వెళ్ళమని అధికారులు చెబుతున్నారు.

పల్నాడు జిల్లా..
మాచర్ల మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తోన్న టీడీపీ గూండాలు..

  • ఓటర్లను ఓట్లేయకుండా రిగ్గింగ్ చేస్తోన్న టీడీపీ రౌడీలు
  • మరో అడుగు ముందుకేసి పోటీ చేస్తోన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు..
  • బెదిరించి ఓటేయకుండా అడ్డుకుంటోన్న కిరాయి రౌడీలు
  • ఓటేయడానికి వెళ్లిన ఆరో వార్డు అభ్యర్థి సబ్బసాని అంజలిపై దాడికి యత్నం..
  • చేతిలో ఉన్న ఓటర్ స్లిప్‌ను సైతం లాక్కుని బలవంతంగా బయటకు పంపిన తీరు..
  • అంజలి ఓటును సైతం టీడీపీ కిరాయి గూండాలే వేసిన వైనం..
  • పోటీలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓటును చోరీ చేస్తున్నా కూడా నవ్వుతూ కూర్చోన్న ఎన్నికల సంఘం అధికారులు
  • బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడి రిగ్గింగ్ చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోని వైనం
  • తనపై దాడికి యత్నించి ఓటు చోరీ చేసిన టీడీపీ మూకలపై చర్యలు తీసుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తోన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంజలి


ఓటు వేయనీయకుండా బయటకు గెంటేశారంటూ 80 ఏళ్ల వృద్ధుడి ఆవేదన..

  • మాచర్ల మున్సిపాలిటీలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోన్న పచ్చ మూక
  • పోలింగ్ బూత్‌లోకి వెళ్లాక ఓటర్ల చేతుల్లోంచి స్లిప్‌లను లాక్కుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు
  • మొత్తం 71 పోలింగ్ బూతుల్లోనూ ఇదే తరహా రౌడీయిజం, రిగ్గింగ్..
  • ఇదేంటని ప్రశ్నిస్తే మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషణ..
  • తన చేతిలో స్లిప్ లాక్కుని సిరా గుర్తు వేశాక ఓటు వేయనీయలేదు..
  • ఆపై బూతులు తిడుతూ బయటకు గెంటేశారంటూ వెంకట్ రెడ్డి అనే 80 ఏళ్ల వృద్ధుడి ఆవేదన

విజయవాడ : జమ్మలమడుగులో రిగ్గింగ్ అనుమానాలు..

  • 4 గంటల్లోనే 60.92 శాతం పోలింగ్
  • భారీ పోలింగ్‌పై ఎస్ఈసీ అధికారులకు అనుమానాలు
  • రిటర్నింగ్ అధికారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఎస్ఈసీ అధికారులు
  • ఎస్ఈసీ ఫోన్‌కి స్పందించని జమ్మలమడుగు ఆర్ఓ
  • జమ్మలమడుగు ఆర్ఓ తీరుపై ఎస్ఈసీ అధికారుల అసహనం

ఎన్టీఆర్‌ జిల్లా.. నందిగామ జడ్పీ హైస్కూల్‌లో  ఉద్రిక్తత

  • టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం.
  • 'పసుపు రంగు' దుస్తులు మార్చుకుని రావాలని అభ్యర్థికి పోలీసుల సూచన.
  • పోలింగ్‌ కేంద్రంలోని 'ఫ్యాన్‌'పై టీడీపీ నేతల అభ్యంతరం.
  • ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు..

నంద్యాల...

  • నంద్యాల పోలింగ్ భూతుల వద్ద హల్‌చల్ చేస్తున్న టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి
  • పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రలోభాలకు పాల్పడుతూ ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడిన వైనం..
  • టీడీపీ చైర్మన్ అభ్యర్థి తరుపున పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు..
  • నంద్యాలలోని పలు వార్డుల్లో ఎంపీ శబరి హల్‌చల్ చేస్తున్న పట్టించుకోని ఎన్నికల అధికారులు..

పులివెందుల పోలింగులో సిత్రాలు..

  • రిగ్గింగులో ఎడా పెడా లెక్కలు చూసుకోకుండా ఓటింగ్..
  • 11గంటలకు అధికారిక లెక్కల ప్రకారం 1.25 శాతం ఇతరులు ఓట్లు పోలైనట్లు అధికారిక ప్రకటన
  • ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం మొత్తం 54532 ఓట్లలో ఇతరుల ఓట్లు 681
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం పులివెందుల మున్సిపాలిటీలో కేవలం 14 మంది మాత్రమే ఇతరుల కేటగిరీ ఓట్లు
  • 14 మందికి 681 మంది ఎలా ఓటు వేశారనేది ప్రశ్న

వైయస్సార్ జిల్లా
రిగ్గింగ్‌కు పోలింగ్ శాతమే నిదర్శనం..

  • ఉదయం 11గంటలకు పులివెందులలో 34 శాతం పోలింగ్
  • కేవలం 4 గంటల్లోనే 34 శాతంపై అనుమానాలు
  • జమ్మలమడుగులో ఏకంగా 42.5 శాతం పోలింగ్
  • పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ  ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్
  • పులివెందులలో ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలను ఆక్రమించిన పచ్చ మూకలు
  • పోలింగ్ ప్రారంభం కాకముందే రిగ్గింగ్‌కు దిగారనే ఆరోపణలు
     

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 11 గంటలవరకు నమోదైన పోలింగ్ శాతం..

  • నరసాపురం మున్సిపాలిటీలో 21.22 శాతం పోలింగ్ నమోదు
  • పుత్తూరు మున్సిపాలిటీలో 28 శాతం పోలింగ్ నమోదు
  • మదనపల్లి మున్సిపాలిటీలో 28.29 శాతం పోలింగ్ నమోదు
  • పుంగనూరు మున్సిపాలిటీలో 31.82 శాతం పోలింగ్ నమోదు
  • మచిలీపట్నం మున్సిపాలిటీలో 29.06 శాతం పోలింగ్ నమోదు
  • ఉయ్యూరులో 25.11 శాతం పోలింగ్ నమోదు
  • పెడనలో 32.77 శాతం పోలింగ్ నమోదు
  • విశాఖ జీవీఎంసీ పరిధిలో 13.34 శాతం పోలింగ్ నమోదు
  • కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం 32.09 శాతం పోలీంగ్  నమోదు
  • విజయవాడ కార్పోరేషన్ పరిధిలో 18.56 శాతం పోలింగ్ నమోదు
     

చిత్తూరు, తేది: 01.11.2026
ఈ రోజు ఉదయం 7.00 గంటల నుంచి 11.00 గంటల వరకు చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం పట్టణ స్థానిక సంస్థల్లో నమోదైన పోలింగ్ వివరాలు..

  • జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 11.00 గంటల వరకు మొత్తం 35.57 శాతం పోలింగ్ నమోదు.. మొత్తం 97,782 ఓట్లు..
  • చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్: 32.50 శాతం పోలింగ్ (48,290 ఓట్లు)
  • కుప్పం మున్సిపాలిటీ: 44.30 శాతం పోలింగ్ (17,959 ఓట్లు)
  • నగరి మున్సిపాలిటీ: 40.46 శాతం పోలింగ్ (17,498 ఓట్లు)
  • పలమనేరు మున్సిపాలిటీ: 33.02 శాతం పోలింగ్ (14,035 ఓట్లు)
     

గుంటూరు..

  • గుంటూరు కార్పొరేషన్‌లో దొంగ ఓట్లు వేయిస్తున్న టీడీపీ నేతలు...
  • మొత్తం 20 డివిజన్లలో  దొంగ ఓట్లు వేయిస్తున్న టీడీపీ నేతలు...
  • పోలీసుల సమక్షంలోనే దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైనం..
  • అన్ని డివిజన్లలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని అడుగడుగునా అడ్డుకుంటున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు...
  • 57వ డివిజన్ విద్యానగర్ కాలనీలో లిటిల్ ప్లవర్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేయడానికి వెళ్తున్న మహిళలను పట్టుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు...
  • వివరాలు అడిగేసరికి మొహం చాటుకొని పారిపోతున్న మహిళలు..
  • టీడీపీ అభ్యర్థులు దొంగ ఓట్లు వేయిస్తున్న పోలీసులు..
  • ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు...
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు...

తిరుపతి..

  • తిరుపతి 22 వ డివిజన్ పరిధిలో టీపీపీఎం స్కూల్ వద్ద ఓటింగ్‌కు వచ్చే ఓటర్లను అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు
  • టీడీపీ నాయకులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మేయర్ డాక్టర్ శిరీష
  • ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు..
  • పోలింగ్ కేంద్రంకు 100 మీటర్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న టీడీపీ గుండాలు

నంద్యాల జిల్లా...

  • టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న డోన్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్...
  • రిగ్గింగ్ కోసం భారీగా గూండాలను పోలింగ్ బూతులకు తరలించిన టీడీపీ నేతలు..
  • కొన్ని బూత్‌లను ఆక్రమించిన పచ్చ మూకలు
  • ఉదయం నుంచి కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టు పర్వాలు..

కృష్ణాజిల్లా...
చంద్రబాబు ప్రభుత్వం, ఎస్ఈసీ, పోలీసులపై పేర్ని నాని ఫైర్..

  • హిందూ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు
  • ఏపీ డీజీపీ, ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠల కంటే ధృతరాష్ట్రుడు చాలా బెటర్
  • కళ్లుండి ఈ ఇద్దరు చూడలేక పోతున్నారు..
  • కళ్ల ముందే ఎన్నికల్లో అన్యాయం జరుగుతున్న కుర్చీ కోసం సైలెంట్‌గా ఉన్నారు..
  • కుర్చీ కోసం ఇంతలా దిగజారాలా?!
  • ఎన్నికల్లో ఇంతకు బరితెగించాలా.., ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయాలా?!
  • ఉన్మాదుల మాదిరి ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు..
  • ఎందుకు ఇంకా ఎన్నికలు చేయటం..
  • అంతా బాగుంది అనుకుంటున్నారు, 2029లో ఎన్నికల కోడ్ వచ్చాక తెలుస్తుంది..
  • పులివెందులలో నేరగాళ్లను పిలిపించి ఓట్లు వేయిస్తున్నారు..
  • చంద్రబాబు, లోకేష్ ఈ దుశ్చర్యకు ఒడిగడుతున్నారు..
  • వీరికి మానసిక రుగ్మత వచ్చింది..

నెల్లూరు..

  • నెల్లూరు సిటీ డివిజన్స్‌లో దొంగ ఓట్లు పోలింగ్‌కు మంత్రి నారాయణ స్కెచ్..
  • 14, 16, 17 సహా పలు డివిజన్స్ పోలింగ్ స్టేషన్స్ వద్దకు బస్సులో చేరుకున్న నారాయణ కళాశాల విద్యార్థులు
  • బస్సుల ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని నిలదీసిన వైఎ‍స్సార్‌సీపీ శ్రేణులు
  • సమాధానం చెప్పకుండా మొహం చాటేస్తున్న విద్యార్థులు

విశాఖ..

  • ఓటు హక్కు వినియోగించుకున్న కేకే రాజు..
  • ఓడిపోతామని భయంతో పులివెందులలో దాడులకు పాల్పడుతున్నారు..
  • రాష్ట్రాన్ని మరో బీహార్ గా మార్చేశారు..
  • సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా అధికారులు వ్యవహరించారు.
  • చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు.
  • వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు..
  • అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారు.. 

 

నంద్యాల జిల్లా..

  • నందికొట్కూరు 18,19 వార్డుల వద్ద టీడీపీ నేతల హల్‌చల్,
  • సీయస్ఐ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద గుంపు గుంపులుగా వెళ్తున్న టీడీపీ నేత జాకీర్,
  • హౌసింగ్ బోర్డు వద్ద వైఎస్సార్‌సీపీ నేతల మీదకి వెళ్తున్న టీడీపీ నేత రవీంద్ర రెడ్డి,
  • ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు..

 

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదు

  • రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో 9,68,919 మంది ఓటర్లకు గాను 8,12,821 మంది ఓటు హక్కు వినియోగం
  • అత్యధికంగా నాగరిలో 20.69 శాతం పోలింగ్ నమోదు
  • జమ్మలమడుగులో 20.56 శాతం పోలింగ్ నమోదు
  • కడప జిల్లా జమ్మలమడుగులో 20.56 శాతం పోలింగ్ నమోదు
  • మార్కాపురం జిల్లా కనిగిరిలో 19.47 శాతం పోలింగ్ నమోదు
  • చిత్తూరు జిల్లా కుప్పంలో 19.51 శాతం పోలింగ్ నమోదు
  • పలమనేరులో 19.57 శాతం పోలింగ్ నమోదు
  • రాయదుర్గంలో 18.88 శాతం పోలింగ్ నమోదు
  • పెనుకొండలో 18.99 శాతం పోలింగ్ నమోదు
  • నందిగామలో 17.99 శాతం పోలింగ్ నమోదు
  • నందికొట్కూరులో 16.99 శాతం పోలింగ్ నమోదు
  • అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 16.73 శాతం పోలింగ్ నమోదు
  • విజయవాడలో ఉదయం 9 గంటల వరకు 7.79 శాతం పోలింగ్ నమోదు
  • విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 3.34 శాతం పోలింగ్ నమోదు
  • గుంటూరులో 5.21 శాతం పోలింగ్ నమోదు
  • నెల్లూరులో 5.89 శాతం పోలింగ్ నమోదు
  • కర్నూలులో 11.15 శాతం పోలింగ్ నమోదు
  • తిరుపతిలో 11.72 శాతం పోలింగ్ నమోదు
  • మొత్తం 3,453 వార్డుల్లో పోలింగ్, 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు

విశాఖపట్నం.. గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్..

  • మింది హైస్కూల్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
  • ఓటు హక్కు మాత్రమే కాదు పౌరుడి చేతిలో ఆయుధం..
  • ప్రతీ ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి..
  • రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తుంది..
  • ఓటు వేసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడం దారుణం....
  • కధన రంగంలో వీర మరణం పొందుతాం తప్ప వెనకడుగు వేసేది లేదు..
  • వైఎస్సార్‌సీపీ వీరోచిత పోరాటం చేసింది..
  • కూటమి ప్రభుత్వం అభద్రతాభావం బయటపడుతుంది..
  • ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు..
  • పులివెందులనే టార్గెట్ చెయ్యాలని చూస్తున్నారు..
  • ఇలా జరిగితే ఎన్నికలు ఎందుకు? చంద్రబాబు తన మనుషులను నామినేట్ చేస్తే సరిపోయేది..
  • నియంతృత్వ ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు..
  • ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల తరపున పోరాటం చేస్తాం..

ఇంటూరి చిన్నా కామెంట్స్..

  • జగ్గయ్యపేట 7 వ వార్డులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరీ చిన్నాను అడ్డుకున్న పోలీసులు.
  • ఎన్నికల అధికారి ఏజెంట్‌గా గుర్తింపు కార్డు ఇచ్చిన నీ మీద కేసులు ఉన్నాయంటూ బయటికి తీసుకొచ్చిన సీఐ వెంకటేశ్వర్లు
  • జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికలలో రెడ్‌బుక్  రాజ్యాంగం అమలు చేస్తున్నారు.
  • స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అండదండలతో కేసులు ఉన్న వారికి కూడా కూటమి ఏజెంట్లుగా నియమించిన అధికారులు..
  • కూటమి నాయకులు చేసిన తప్పులకు బాధపడే రోజు త్వరలో వస్తుంది..

ఎన్టీఆర్‌ జిల్లా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు...

  • నందిగామలో కొనసాగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్‌
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను మీపై పాత కేసులు ఉన్నాయంటూ బయటకు పంపుతున్న పోలీసులు...
  • పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు...
  • పోలీసులు వీడియోలు తీయొద్దంటూ మీడియాపై ఆంక్షలు...

ఎన్టీఆర్‌ జిల్లా..
ప‌ట్ట‌ణ స్థానిక సంస్థల పోలింగ్ శాతం
తేదీ: 01-11-2026
స‌మ‌యం: ఉద‌యం 9.00 గంట‌లు
* విజయవాడ: 2.14 %
* కొండపల్లి:  3.23 %
* తిరువూరు: 14.36 %
* నందిగామ: 17.99 %
* జగ్గయ్యపేట: 7.65 %

(ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా)

గుంటూరు..
వైఎస్సార్‌సీపీ నేత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై వైఎస్సార్‌సీపీ నేత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
  • గుంటూరులో కార్పొరేషన్  47వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మోదుగుల
  • పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని మోదుగుల ఆరోపణ
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ మాజీ ఎంపీ ఆగ్రహం
  • పోలింగ్ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించడం లేదు..
  • టీడీపీ ఏజెంట్లకు మాత్రమే పోలింగ్ కేంద్రాల్లో అనుమతి ఇస్తున్నారంటూ అభ్యంతరం..
  • ఎన్నికల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
  • పోలింగ్ ముగిసే వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
  • పోలింగ్ కేంద్రాల్లోనే ఉండి ప్రతి పరిణామాన్ని పర్యవేక్షించాలని పార్టీ క్యాడర్‌కు సూచన..
  • రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటాయని మోదుగుల ఆశాభావం

పల్నాడు జిల్లా..

  • మాచర్ల‌ మున్సిపాలిటీలో మొత్తం 71 పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేసిన‌ టీడీపీ గూండాలు
  • 36 వార్డుల్లోని 71 పోలింగ్ బూతుల్లో మాస్ రిగ్గింగ్‌కు పాల్పడుతోన్న పచ్చ రౌడీలు
  • సామాన్యులకు ఓట్లు వేసే అవకాశమే లేకుండా చేస్తోన్న టీడీపీ కిరాయి మూకలు
  • ప్రతీ పోలింగ్ బూత్‌ల బయట వందలాదిగా టీడీపీ గూండాలు
  • పోలింగ్ బూత్ లోపల మాస్ రిగ్గింగ్
  • ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • ఆరు గంటలుగా పోలీస్ స్టేషన్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

ఇస్లాంపురం..

  • ఇస్లాంపురం 11,12 వార్డుల్లో ప్రజలను తమ ఓటర్ స్లిపులను తీసుకొని, ఓటు వేయించని పోలీసులు, గుండాలు
  • గర్ల్స్‌ హైస్కూల్‌ వద్ద ఓటర్లపై రాళ్లు రువ్వుతున్న టీడీపీ మూకలు

ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్

  • చీమకుర్తిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్.
  • చీమకుర్తిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరోవైపు పట్టణంలోని తన నివాసంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు ఆదివారం ఉదయం హౌస్ అరెస్టు చేశారు.
  • గాంధీనగర్ మొదట్లో ఉన్న ఆయన నివాసాన్ని అష్ట దిగ్బంధనం చేశారు.
  • ఇంట్లో నుంచి బయటికి రానీయకుండా పహారా కాస్తున్నారు.

నెల్లూరు..

  • చింతారెడ్డిపాలెం బూత్ నెంబర్ 213లో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ‌నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి.
  • నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి..
  • ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.
  • ఎలక్షన్ కమిషన్, జిల్లా ఎస్పీ గట్టి భద్రత ఏర్పాటు చేశారు..
  • ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి..

టీడీపీ రిగ్గింగ్‌.. 

  • వైఎస్సార్ జిల్లా..
  • ఇస్లాంపురం పోలింగ్ బూత్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ గుండాలు.
  • మొత్తం రిగ్గింగ్ చేస్తున్నారని ఓటర్ల ఆవేదన.
  • స్లిప్పులు లాక్కుని టీడీపీ గుండాలే ఓట్లు వేసుకుంటున్నారని ఓటర్ల ఆవేదన


నంద్యాల జిల్లా..

  • డోన్‌లో 12వబూత్‌లో వైఎస్సార్సీపీ ఏజెంట్ అక్రమ అరెస్ట్.
  • టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ లోపలికి చేరి ఓటర్లను ప్రభావితం చేస్తున్న సమయంలో అడ్డు చెప్పిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్.
  • అధికారులను ప్రశ్నించినందుకు స్టేషన్‌కు తరలించిన పోలీసులు .
  • ఏజెంట్ల అక్రమ అరెస్టులపై మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు.

ఓటర్లకు డీఎస్పీ బెదిరింపులు

  • పులివెందులలో ఓటర్లను బెదిరించిన డీఎస్సీ మురళీ నాయక్‌.
  • మీకు ఓటు వేసే అధికారం ఇప్పుడు లేదంటూ డీఎస్సీ హుకుం.
  • మీరు ఓటు వేయకూడదని ఓటర్లకు డీఎస్పీ బెదిరింపులు.
  • ఓటర్లకు రక్షణ కల్పించకుండా వెనక్కి పంపుతున్న పోలీసులు.
  • పులివెందులలో బూత్‌లను ఆక్రమిస్తున్న టీడీపీ రౌడీలు.
  • పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లు రాకుండా రాళ్ల దాడులు.
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పచ్చమూకలు.
  • టీడీపీ గూండాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు.
  • పులివెందుల బాయ్స్‌ జూనియర్‌ కాలేజీ వద్ద ఓటర్ల నిరసన.
  • ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకున్న పోలీసులు.
  • పోలింగ్‌ బూత్‌ వద్ద 400 మంది ఓటర్ల బైఠాయింపు.
  • తమ ఓట్లు టీడీపీ నేతలే వేస్తున్నారని ఓటర్ల ఆందోళన. 

పల్నాడు జిల్లా

  • మాచర్లలో పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ గూండాలు
  • ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ మాస్ రిగ్గింగ్ చేస్తోన్న కిరాయి గూండాలు
  • పోలింగ్ బూత్ బయట వందలాదిగా టీడీపీ రౌడీలు
  • పోలింగ్ బూత్ లోపల మాటువేసి‌న పచ్చ మూక
  • అడ్డగోలుగా రిగ్గింగ్‌కు పాల్పడుతోన్న టీడీపీ రౌడీలు
  • సామాన్య ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చిన సమయంలో బెదిరింపులు
  • ఓటు వేయడానికి వస్తే తిరిగి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తోన్న కిరాయి మూక
  • మాస్ రిగ్గింగ్ కు సహకరిస్తోన్న ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు
  • మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిని దిగ్బంధించిన పోలీసులు

వైఎస్సార్ జిల్లా

  • చివరికి నేషనల్ మీడియాపై కూడా దాడి
  • కవరేజ్‌లో ఉన్న ఇండియా టుడే కెమెరా పగులగొట్టిన పచ్చ మూకలు
  • ఉదయం మరో రిపోర్టర్‌పై దాడి
  • మీడియా వారి వద్ద సెల్ ఫోన్లు లాక్కున్న పచ్చ బ్యాచ్‌.
  • కెమెరాలు, సెల్ ఫోన్లు ధ్వంసం
  • టీడీపీ అక్రమాలను చిత్రీకరించకుండా దాడులకు దిగుతున్న గూండాలు
  • పులివెందుల 11, 12 బూత్‌ల వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • వైఎస్సార్ సీపీ ఏజెంట్లు, ఓటర్లపై రాళ్ళ దాడికి దిగిన టీడీపీ మూకలు
  • ఎవర్నీ పోలింగ్ బూత్ వైపు రాకుండా అడ్డుకుంటున్న పచ్చ గూండాలు. 

విశాఖ..

  • ఓటు హక్కు వినియోగించుకున్న జీవీఎంసీ వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి..
  • ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఓటు వేసిన వరుదు కళ్యాణి.
  • వరుదు కళ్యాణి కామెంట్స్‌...
  • ఓటు సామాన్యుడి వజ్రాయుధం..
  • ప్రతీ ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకొని విశాఖ అభివృద్ధికి బాటలు వేయాలి.
  • కొన్ని ఏరియాల్లో పోలింగ్ ఏజెంట్లకు ఓటింగ్ ఫామ్స్ ఇవ్వలేదు..
  • ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.


విజయవాడ

  • కార్పొరేషన్ ఎన్నికల్లో గందరగోళం
  • బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారుల వైఫల్యం
  • సీరియల్ నంబర్లు లేకుండా పలు చోట్ల అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు
  • నిబంధనలకు విరుద్ధంగా బ్యాలెట్ పేపర్లు ముద్రణ
  • 55వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింబల్ మార్చేసిన పోలింగ్ అధికారులు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఫిర్యాదుతో 55వ డివిజన్‌లో పోలింగ్ నిలిపివేసిన ఆర్వో..
  • కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రణ.  
  • బ్యాలెట్‌ పేపర్‌ వచ్చిన తరువాత పోలింగ్
  • మరో రెండు గంటలు సమయం పట్టే అవకాశం..


వైఎస్సార్ జిల్లా

  • పులివెందులలో పూర్తి కర్ఫ్యూ వాతావరణం
  • పోలింగ్ బూత్ లను ఆక్రమించుకున్న టీడీపీ
  • టీడీపీ అక్రమాలకు ఊతమిస్తున్న పోలీసు చర్యలు
  • పట్టణంలోని షాపులను మూసివేయిస్తున్న పోలీసులు
  • ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్న పచ్చ మూకలు
  • ఓటరు బయటకు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న పచ్చ మూకలు
  • షాపులను మూసి వేయించి టీడీపీ మూకల చర్యలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులు

పల్నాడు జిల్లా

  • మాచర్లలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిని దిగ్బంధించిన పోలీసులు
  • ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు
  • ఇంటి చుట్టుపక్కల ఇనుప కంచెలు, బారీకేడ్ల ఏర్పాటు
  • అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు పిన్నెల్లి ఇంటి వైపునకు రాకుండా అడ్డగింత
  • ఇప్పటికే 12 మంది కౌన్సిలర్లు, పార్టీ నేతల అరెస్ట్
  • ఐదు గంటలుగా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధం.

పచ్చమూక అరాచకం..

  • దాడులు, అరాచకాలతో పేట్రేగిపోతున్న పచ్చమూకలు.
  • పచ్చ గూండాలను ఉసిగొలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఖాకీలు.
  • వైఎస్సార్‌సీపీ నేతల దుష్యంత్‌ రెడ్డిపై పోలీసుల దురుసు ప్రవర్తన.
  • ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పచ్చ గూండాలు. 

అరాచకాలు, అక్రమాల వీడియోలు పంపండి..

  • స్థానిక ఎన్నికల్లో అరాచకాలు, అక్రమాలపై ఫిర్యాదు చేయండి.
  • మీ ప్రాంతంలో పోలింగ్‌ను అడ్డుకుంటున్న వీడియోలను వాట్సాప్‌ చేయండి.
  • వాట్సాప్‌ నెంబర్‌: 950 5555 065.

తిరుపతి

  • వెంకటగిరి మున్సిపాలిటీలో గందరగోళం.
  • 35వ వార్డు పోలింగ్‌ బూత్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమూరు.
  • టీడీపీ అభ్యర్థికి ఫ్యాన్‌ గుర్తు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సైకిల్‌ గుర్తు.
  • బెజవాడ కార్పొరేషన్‌ 55వ డివిజన్‌లో నిలిచిన పోలింగ్‌.
  • అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్‌. 
  •  

అనంతపురం..

  • మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్‌..
  • ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
  • ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
  • ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధం.
  • ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి.
  • అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో అరాచకవాదులకు ఓటుతో బుద్ధి చెప్పాలి.
  • దౌర్జన్యాలు, రౌడీయిజానికి ఓటుతోనే సమాధానం చెప్పాలి.
  • డబుల్ రిజిస్ట్రేషన్లకు కూడా ఓటుతో బుద్ధి చెప్పాలి.

మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ కామెంట్స్‌...

  • అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రశాంత వాతావరణం కావాలి.
  • ఇప్పుడు అనంతపురాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
  • హింసా రాజకీయాలను నమ్ముకున్న వారికి ఓటుతో సమాధానం చెప్పాలి.
  • ప్రతి ఓటు మార్పునకు నాంది కావాలి.

పల్నాడు జిల్లా..

  • మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు..
  • మాచర్ల మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం.
  • ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులు సరికాదని వ్యాఖ్య.
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, అభ్యర్థులను బూత్‌లకు రాకుండా అరెస్టులు చేస్తున్నారని ఆరోపణ.
  • ఇలాంటి పరిణామాలపై ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్న.
  • బూత్ క్యాప్చరింగ్ చేసి భారీగా రిగ్గింగ్ చేయడానికే అరెస్టులు చేస్తున్నారని ఆరోపణ.
  • మొత్తం 12 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలను పోలీసులు స్టేషన్‌లో నిర్బంధించారని వెల్లడి.
  • నాలుగు గంటలుగా అభ్యర్థులు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు.
  • పోలింగ్ ప్రారంభమైనా బూత్‌ల పరిశీలనకు కూడా వెళ్లకుండా అభ్యర్థులను అరెస్టు చేశారని ఆరోపించారు.

 

మదనపల్లిలో పోలీసుల అత్యుత్సాహం

  • అన్నమయ్య జిల్లా..
  • మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల అత్యుత్సాహం
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి జింక చలపతి నేలపై కూర్చుని నిరసన 
  • తనపై లాఠీలతో దాడి చేశారని, కాలితో తన్ని బయటకు నెట్టేశారని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చలపతి
  • ఎన్నికల అధికారి జారీ చేసిన అధికారిక పాస్/ఐడీ కార్డును మీడియాకు, పోలీసులకు చూపిస్తూ, 
  • సరైన అనుమతి ఉన్నప్పటికీ తనను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఆగ్రహం
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బలవంతంగా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి వేస్తున్నారని ఆగ్రహం.
  • టీడీపీ వారిని మాత్రం లోపల కూర్చోబెట్టి, తమను మాత్రం దురుసుగా బయటకు నెట్టారన్న చలపతి
  • శివకుమార్ అనే అధికారి తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం

వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌.. 

  • చిలుకలూరిపేటలో విడదల రజిని హౌస్‌ అరెస్ట్‌.
  • ‍కడప మాజీ మేయర్‌ పాకా సురేష్‌ అరెస్ట్‌.
  • వైఎ‍స్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులను పట్టించుకోని పోలీసులు.
  • దాడులపై ఫిర్యాదు చేసిన మాజీ మేయర్‌ అరెస్ట్‌. 

అన్నమయ్య జిల్లా..

  • మదనపల్లిలో ఉద్రిక్తత.
  • పోలింగ్‌ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.
  • మరోవైపు.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హౌస్‌ అరెస్ట్‌. 

గుర్తులు తారుమారు..

  • విజయవాడ నగరపాలక సంస్థ 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ముందు హస్తం గుర్తు.
  • కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రణ
  • పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తూ ఆర్ఓ గతంలో విడుదల చేసిన ఫారం-11లో మాత్రం సక్రమంగానే గుర్తులు
  • అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తులు మార్చారా? అనే అనుమానాలు
  • ఆర్ఓ వద్దకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.‌
  • ఏం జరుగుతుందోనని డివిజన్‌లో తీవ్ర ఉత్కంఠ

 

వైఎస్‌ ప్రమీలమ్మపై దాడి..

  • పులివెందులలో టీడీపీ గూండాగిరి
  • వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిపై దాడి.
  • బూత్‌ నెంబర్‌ 21 వద్ద వైఎస్‌ ప్రమీలమ్మపై దాడి.
  • మహిళా అభ్యర్థిపై దాడికి తెగబడ్డ టీడీపీ గూండాలు.
  • పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు తిష్ట వేశారు: వైఎస్‌ ప్రమీలమ్మ.
  • పోలింగ్‌ కేంద్రాలకు వెల్లకుండా అడ్డుకుంటున్నారు.
  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని నన్నే అడ్డుకున్నారు.
  • వైఎ‍స్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డగించి రిగ్గింగ్‌కు కుట్ర. 

 

50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు..

  • ఏపీలో 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు.
  • అన్ని చోట్లా సీసీ కెమెరాలు పెట్టలేమన్న ఎస్‌ఈసీ.
  • అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌ ఉండాలన్న సుప్రీంకోర్టు.
  • 5737 పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు. 

వైఎస్సార్‌ జిల్లా..

  • పులివెందులలో టీడీపీ మరో కుట్ర.
  • భారీగా దొంగ ఓట్ల వేయించుకునేందుకు టీడీపీ పన్నాగం.
  • ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను దింపుతున్న టీడీపీ.
  • దొంగ ఓటర్లకు 1500 చొప్పున ఇచ్చి దింపుతున్న బీటెక్‌ రవి.
  • అల్లర్లకు ముందుగానే రౌడీలను సిద్ధం చేసుకున్న టీడీపీ. 

పోలీసులు లాఠీచార్జ్‌

  • పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌
  • బూత్‌ నెంబర్‌ 17 వద్ద లాఠీచార్జ్‌.
  • పులివెందులలో టీడీపీ గూండాల స్వైర విహారం
  • పులివెందుల బూత్‌ నెంబర్‌ 38 వద్ద కర్రలతో హల్‌చల్‌
  • కర్రలతో బహిరంగంగా తిరుగుతున్న టీడీపీ గూండాలు
  • కడపలో కొనసాగుతున్న పచ్చ మూకల అరాచకాలు
  • పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల అడ్డగింత.
  • ఏజెంట్ల ఫామ్‌లను చించేసిన టీడీపీ గూండాలు.
  • టీడీపీ రౌడీలు హల్‌చల్‌ చేస్తున్నా పట్టించుకోని పోలీసులు.
  • మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిని అడ్డుకున్న పోలీసులు. 

పల్నాడు జిల్లా..

  • మాచర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న పచ్చ గూండాలు, పోలీసుల అరాచకాలు
  • పోలింగ్‌ బూత్‌ల వద్ద మాటువేసిన టీడీపీ గూండాలు
  • గుంపులు గుంపులుగా పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మూకలు
  • పోలింగ్ బూతుల్లో కేవలం టీడీపీ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం
  • మరోవైపు కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకుల అరెస్టులు
  • ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • కనీసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పోలింగ్ బూత్‌లను పరిశీలించే అవకాశం కూడా ఇవ్వని పోలీసులు, అధికారులు. 

 

  • మొత్తం ఓటర్లు 99,36,014 మంది.. 11,378 పోలింగ్‌ కేంద్రాలు
  • 13 నగరపాలక సంస్థలు, 79 మున్పిపాలిటీలకు ఎన్నికలు
  • 13 మేయర్‌ పదవులకు పోటీలో 153 మంది
  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పోటీలో 367 మంది
  • బందోబస్తుకు 36,351 మంది పోలీసులు
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌
  • 13 నగరాల్లో ఉన్న 59,97,918 మంది ఓటర్ల కోసం 6,384 పోలింగ్‌ కేంద్రాలు,
  • 79 మున్సిపాలిటీల్లో ఉన్న 39,38,096 మంది ఓటర్ల కోసం 4,994 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు.


పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 

  • 13 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు – 153 మంది 
  • కార్పొరేషన్లలోని 804 డివిజన్లకు – 3,073 మంది 
  • 70 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవులకు –  367 మంది 
  • 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 2,382 వార్డు కౌన్సిలర్‌ పదవులకు – 6,669 మంది

పోలింగ్‌ సిబ్బంది ఇలా.. 

  • రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) – 1,449 మంది 
  • సహాయ రిటర్నింగ్‌ అధికారులు – 2,543 మంది 
  • ప్రిసైడింగ్‌ అధికారులు – 13,504 మంది 
  • అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు – 13,504 మంది 
  • ఇతర పోలింగ్‌ అధికారులు – 51,716 మంది 
  • మైక్రో అబ్జర్వర్లు – 3,720 మంది 
  • వెబ్‌కాస్టింగ్‌ సిబ్బంది – 1,835 మంది  

 

  • మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం

వైఎస్సార్ జిల్లా..

  • పులివెందులలో పచ్చ మూకల అర్ధరాత్రి అరాచకం
  • ఓ వివాహానికి వచ్చిన వారి వాహనాలను దహనం చేసిన పచ్చ మూకలు
  • మూడు కార్లు, ఒక ట్రాక్టర్ దగ్దం చేసిన టీడీపీ గూండాలు
  • పోలింగ్ సందర్భంగా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర
  • రాత్రి పెద్ద ఎత్తున మద్యం సేవించి విచ్చలవిడిగా స్వైర విహారం చేసిన పచ్చ మూకలు
  • తెల్లవారు జామునే పోలింగ్ బూత్‌ల వద్ద తిష్ట వేసిన పచ్చ మూకలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)