Breaking News

బ్యాలెట్‌ బాక్సులను మార్గమధ్యంలో దించేసి..

Published on Thu, 11/05/2026 - 06:47

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్..

గుంటూరు:

  • నల్లపాడులో తీవ్ర ఉద్రిక్తత
  • బ్యాలెట్‌ బాక్సులు మార్చేందుకు టీడీపీ కుట్రలు
  • వెంగాయళపాలెం బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌కు తీసుకెళ్లకుండా నల్లపాడులో దించిన వైనం
  • రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు
  • నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్‌
  • లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు మహిళా నేతలపై లాఠీచార్జ్‌
     

వైఎస్సార్‌ జిల్లా

  • గోపవరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బ్రాహ్మణ పల్లెకు చేరుకున్న బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా
  • రామాపురం పోలింగ్ బూత్‌లో ఇంకు బాటిల్ పోశారంటూ ప్రచారం రావడంతో ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి కుమారుని పై దాడి చేసేందుకు భారీగా చేరుకున్న టీడీపీ గూండాలు 
  • బ్రాహ్మణ పల్లెలోనే ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా.. ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి
  • తమకు పోలీసులు సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా

శ్రీ సత్యసాయి జిల్లా

  • ధర్మవరం నియోజకవర్గం వెంకటగారిపల్లిలో టీడీపీ నేతల బరితెగింపు
  • వైఎస్సార్‌సీపీ నేతలపై విచక్షణా రహితంగా దాడులు
  • ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
  • వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చారన్న కారణంతో దాడులు చేసిన టీడీపీ నేతలు
  • జిల్లాలోని మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం రామాయణహట్టి గ్రామంలో టీడీపీ నేతల దొంగ ఓట్లు
  • బయట నుంచి బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సులో వేస్తున్న వైనం
  • ఒక టీడీపీ నేతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు
  • వైరల్‌గా మారిన టీడీపీ నేతల బాగోతం వీడియోలు

శ్రీ సత్యసాయి జిల్లా

  • ధర్మవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత
  • జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి నేతల దొంగ ఓట్లు
  • విషయం తెలిసి గ్రామానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతల కార్లపై రాళ్ల దాడులు
  • వైఎస్సార్‌సీపీ నేత ప్రతాప్ రెడ్డికి చెందిన వాహనం ధ్వంసం
  • పోలీసు జీపు అద్దాలు ధ్వంసం, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  

  • అమలాపురం రూరల్  మండలం ఈదరపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • కూటమి పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
  • శ్రీకాంత్‌ను అడ్డుకున్న కూటమి నాయకులు కార్యకర్తలు
  • ఇరు వర్గాల మద్య వాగ్వాదం
  • శ్రీకాంత్ కామెంట్స్...
  • అధికార పార్టీ యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతుంది
  • ఈదరపల్లి వంటి కేంద్రాలను సమస్యాత్మక గ్రామాలుగా ముందుగానే గుర్తించినా పూర్తిలో పోలీసులు భద్రత కల్పించలేకపోయారు
  • పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిన్నారు
     

ఏలూరు జిల్లా

  • ద్వారకా తిరుమల మండలం తూర్ల లక్ష్మీపురంలో ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ నాయకులు ఓటు వేసేందుకు వెళ్లగా వారికి ఇచ్చిన బ్యాలెట్ పేపర్ పై అప్పటికే బీజేపీ సింబల్ పై సిరా ముద్ర ఉండడంతో అవాక్కయ్యారు
  • ఇదేంటని పోలింగ్ ఆఫీసర్‌ను ప్రశ్నించగా స్లిప్పు మడత పెట్టేటప్పుడు పొరపాటున కమలం గుర్తుపై ఇంకు అంటుకుందన్నఅధికారులు
  • మిగిలిన స్లిప్పులపై కూడా కమలం గుర్తుపైనే ముద్రలు ఉన్నట్టు గుర్తింపు
  • ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
  • ఇలా రిగ్గింగ్ చేసుకునేటప్పుడు అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం అని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
  • ఓటమి భయంతో కూటమి నేతలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

అనకాపల్లి

  • బుచ్చయ్యపేట మండలం తురకలపూడిలో బరితెగించిన కూటమి నేతలు
  • దొంగ ఓట్లు వేస్తున్న కూటమి నేతలు
  • అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు రాజారావు, లోవరాజు, రమేష్, నాని
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌లపై కూటమి కార్యకర్తలు దాడి

విజయవాడ

  • ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ అనుమానాలు
  • ఎస్ఈసి ప్రకటనతో బట్టబయలైన బండారం
  • మధ్యాహ్నం 1 గంటకు 30.50 శాతం పోలింగ్
  • 6 గంటల్లో 30.50 శాతం పోలింగ్ నమోదు
  • మధ్యాహ్నం 1 గంట తర్వాత భారీగా అసాధారణంగా పెరిగిన పోలింగ్
  • మధ్యాహ్నం 3 గంటలకు 58.55 శాతం నమోదు
  • 2 గంటల్లోనే 28 శాతం నమోదు పై అనుమానాలు
  • మొదటి 6 గంటల్లో 30 శాతం తర్వాత రెండు గంటల్లోనే 28 శాతం పోలింగ్
  • అనేక జిల్లాల్లో దౌర్జన్యంగా టీడీపీ రిగ్గింగ్


కర్నూలు జిల్లా

  • చిప్పగిరి మండలం గుమ్మనూరులో ఉద్రిక్తత
  • కూటమి నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్
  • కూటమి నాయకులు బీజేపీ , టీడీపీ నాయకుల మధ్య చెలరేగిన వివాదం
  • ఇరువర్గాలు కర్రలతో, రాళ్ళతో పరస్పర దాడులు, పలువురికి గాయాలు
  • దాడులకి పాల్పడిన కొందరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం

కాకినాడ జిల్లా
కాకినాడ

  • తుని మండలం అటకువాని పాలెం పోలింగ్ బూత్ లో ఓటర్లపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకులు
  • టీడీపీ నేతల దౌర్జన్యానికి ఓటర్ల భయబ్రాంతులు
     

నెల్లూరు జిల్లా

  • నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఆత్మకూరు సీఐ గంగాధర్ ఓవర్ యాక్షన్
  • పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని అడ్డుకొని రహదారికి పోలీసు వాహనం అడ్డుపెట్టిన సీఐ
  • మండలంలో పర్యటించడానికి వీల్లేదంటూ నానా యాగి

తిరుపతి జిల్లా, చంద్రగిరి

  • సప్తగిరి కాలనీ, 115,116,117 బూతులలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  • అన్నా రామచంద్రయ్య, అన్న రామకృష్ణ, సప్తగిరి నగర్ ఓటర్లు కాకపోయినా ఇక్కడ ఓటు వేశారు
  • సీసీ కెమెరాలలో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి
  • దీనికి సహకరించిన పోలీసులు, అధికారుల మీద చర్యలు చేపట్టాలి
  • జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికార పార్టీకి దాసోహమయ్యారు
  • ప్రజల పక్షాన కాకుండా టీడీపీ పక్కా నా పని చేస్తున్నారు ఎస్బిఐ సుబ్బారాయుడు
  • దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, న్యాయపరంగా పోరాడుతామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

నెల్లూరు జిల్లా

  • ఉదయగిరి, బండగానిపల్లిలో ఉద్రిక్తత
  • బిజ్జంపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డ టీడీపీ గూండాలు
  • అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి
  • ఇరు వర్గాల మద్య ఘర్షణ జరగడంతో లాఠీచార్జ్  చేసిన పోలీసులు
  • మర్రిపాడు మండలంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్స్ ను బయటకు నెట్టి రిగ్గింగ్
  • 27, 28 బూత్‌లలో టీడీపీ శ్రేణులతో దగ్గర వుండి రిగ్గింగ్ వేయిస్తున్న ఎసై బలరాం రెడ్డి

ప్రకాశం జిల్లా

  • చీమకుర్తి మండలం బల్లమూడి గ్రామం ఎంపీటీసీ ఎన్నికలలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
  • ఏజెంట్లను, అభ్యర్థి భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి దొంగ ఓట్లు వేసుకుంటున్నారు
  • తక్షణమే సంతనూతలపాడు నియోజకవర్గ నాలుగు మండలాలు రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసిన మాజీమంత్రి మెరుగు నాగార్జున

తిరుపతి జిల్లా

  • మంగళం కోర్టు జడ్పీ హైస్కూల్ దగ్గర మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన
  • పోలింగ్ బూత్ దగ్గర ఇతర ప్రాంతాల నుంచి రౌడీ ముఖాలను పిలిపించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
  • రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గుండాలు
  • టీడీపీ రౌడీ ముఖాలకు తొత్తులుగా పోలీసులు పని చేస్తున్నారంటూ పోలింగ్ బూత్ ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన
  • శివ రెడ్డితో పాటు మంగళం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన
  • పోలీసులే టీడీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  • ఇతర ప్రాంతాల నుంచి వందలాదిమంది పోలింగ్ బూతులు దగ్గర ఉన్న పట్టించుకోవడం లేదు
  • ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలను ఇక్కడ నుంచి పంపకుంటే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

చిత్తూరు జిల్లా

  • కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ గూండాల దౌర్జన్యం
  • శాంతిపురం మండలం కడపల్లి  పంచాయతీ బూత్‌లో రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ
  • సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు నివాసం పక్కనే ఉన్న కడపల్లి పంచాయతీలో గెలిచే ధైర్యం లేక రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ శ్రేణులు
  • టీడీపీ నాయకుల అరాచకాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి నిరసన
  • భారీ ఎత్తున కుప్పం పట్టణం నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నాయకులు
  • తవణంపల్లి మండలం పట్నం ఎంపీటీసీ సెగ్మెంట్ పోలింగ్  బూత్ వద్ద ఉద్రిక్తత
  • గొడవలను చిత్రీకరిస్తున్న మండల సాక్షి రిపోర్టర్ జగన్నాథంపై దాడి చేసిన టీడీపీ మూకలు

ఏలూరు జిల్లా

  • నూజివీడు నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 60.70 శాతం పోలింగ్ నమోదు
  • నాలుగు మండలాల్లో కలిపి ఇప్పటివరకు 1,18,085 మంది ఓటు హక్కు వినియోగం
  • ఆగిరిపల్లి మండలంలో 59.39 శాతం పోలింగ్
  • చాట్రాయి మండలంలో 63.69 శాతం పోలింగ్
  • ముసునూరు మండలంలో 63.94 శాతం పోలింగ్
  • నూజివీడు మండలంలో 54.31 శాతం పోలింగ్
  • నాలుగు మండలాల్లో మొత్తం ఓటర్లు – 1,97,103
  • ఇప్పటివరకు పోలైన ఓట్లు – 1,18,085

ఏలూరు జిల్లా

కైకలూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలలో మూడు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 
1) కలిదిండి 60.86
2) ముదినేపల్లి 69.6% 
3) మండవల్లి 63.2%
4) కైకలూరు 60%

పార్వతీపురం మన్యం జిల్లా

  • వీరఘట్టం మండలం, కత్తులకవిటి పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దాడి
  • కూటమికి ఓట్లు వేయాలని ఓటర్లకు ఎమ్మెల్యే బెదిరింపులు  

    వైఎస్సార్‌ జిల్లా
  • పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్
  • టీడీపీ గూండాలు బూత్‌ల వద్ద ఎందుకు ఉన్నారని ప్రశ్నించినందుకు లాఠీ ఛార్జ్
  • పోలింగ్ బూత్ ఆక్రమించుకున్న బీటెక్ అనుచరులు
  • రిగ్గింగ్ చేసుకుంటున్నారని ప్రశ్నించినందుకు లాఠీ ఛార్జ్


కర్నూలు జిల్లా

  • కర్నూలు జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎన్నికల అధికారులు
  • కోసిగి 1 పోలింగ్ కేంద్రంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు.
  • సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని సూచిస్తున్న పీవో
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి ఎంపీటీసీ 4 ప్రాదేశికం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మామిడి జ్యోతి భర్త మామిడి కృష్ణని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులను అడ్డుకున్న ఎంపీటీసీ అభ్యర్థి , వైఎస్సార్‌సీపీ నాయకులు

కోసిగి మండలం ఆర్లబండలో ఉద్రిక్తత

  • టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు
  • పోలింగ్ బూత్ వద్ద కు చేరుకున్న అధికారులు
  • నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ

తూర్పుగోదావరి జిల్లా

  • అనపర్తిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య వివాదం
  • వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కుమారుడిపై టీడీపీ నేత దాడికి దిగడంతో ఒకరినొకరు తోసుకున్న ఇరు వర్గాలు
  • దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం
  • సమాచారం అందుకుని ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు

తిరుపతి జిల్లా

  • నాయుడు పేట పెళ్లకూరు మండలంలో టీడీపీ అరాచకవాదులు రిగ్గింగ్
  • పునబాక గ్రామం 26వ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను బయటకు నెట్టి యధేశ్చగా రిగ్గింగ్

ఎన్టీఆర్ జిల్లా

  • ఎన్టీఆర్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకు జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్  - 55.24 శాతం

నెల్లూరు జిల్లా

  • వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దురుసు ప్రవర్తన
  • ఉదయం నుండి ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట‍్లను తరమికొట్టి మంత్రి అనుచరులు రిగ్గింగ్
  • పోలింగ్ కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ జెడ్పీటిసీ అభ్యర్థిని బయటకు వెళ్ళగొట్టి దుర్భసలాడిన మంత్రి
  • ఎదురుపడ్డ మంత్రి ఆనంను ఇది ఎక్కడి కల్చర్ అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
  • ఆగ్రహంతో ఊగిపోయిన‌ మంత్రి మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిపైకి దూసుకెళ్ళిన వైనం

పల్నాడు జిల్లా

  • సత్తెనపల్లి నియోజకవర్గం చాగంటి వారి పాలెం పోలీసుల దౌర్జన్యం
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని, ఓటర్లను పంపిణీ సీఐ ప్రభాకర్ రావు, సీఐ సుబ్బారావు
  • పోలీసుల వైఖరి పై ఓటర్లు తీవ్ర ఆగ్రహం
  • వైఎస్సార్‌సీపీ నాయకుల్ని ఆపివేసి టీడీపీ నాయకులను అనుమతిస్తున్న పోలీసులు
  • సీఐ ప్రభాకర్ రావు సీఐ సుబ్బారావులు తెలుగుదేశం నాయకుల చేస్తున్న రిగ్గింగ్‌కు సహకరిస్తున్నారంటూ ఆగ్రహిస్తున్న ఓటర్లు

పశ్చిమగోదావరి జిల్లా

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించిన భీమవరం మండలం కోమటి తిప్పనార్త్ గ్రామ పంచాయతీ వెంకటతిప్ప గ్రామ ప్రజలు
  • 40 ఏళ్లుగా తమ గ్రామం లో ఉన్న పోలింగ్ బూత్ ను కోమటి తిప్ప కు మార్చారని, అందుకే ఎన్నికలను బహిష్కరించామని గ్రామస్తులు వెల్లడి
  • పోలింగ్ బూత్‌ను యాదవిధిగా తమ గ్రామంలో తిరిగి ఏర్పాటు చేసేవరకు ప్రతి ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్థుల నిరసన
  • పోలింగ్ బూత్‌ను పక్క గ్రామానికి ఎందుకు మార్చారు అంటూ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును నిలదీసిన గ్రామస్తులు
  • చేసేదేమీ లేక వెనదిరిగిన జనసేన ఎమ్మెల్యే

అన్నమయ్య జిల్లా.. పీలేరులో టీడీపీ నాయకులు రిగ్గింగ్

  • పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రిగ్గింగ్
  • కె.వి.పల్లి మండలం లక్ష్మిరెడ్డిగారిపల్లెలో జడ్పీటీసీ ఎన్నికల  పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ బాక్స్‌ను బయట వేసేందుకు టీడీపీ నాయకులు యత్నం
  • ఒక్కసారిగా బయటకు పడేయడంతో పరిస్థితి ఉద్రిక్తం
  • పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు యత్నం
  • బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యం

పశ్చిమగోదావరి జిల్లా

• మొత్తం పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర పోలింగ్ (1:00 PM సమయానికి): 47.72%

• పెంటపాడు మండలంలో అత్యధికంగా 53.44% పోలింగ్ నమోదు

• మొగల్తూరు మండలంలో అత్యల్పంగా 42.61% పోలింగ్ నమోదు

• ఆచంట మండలంలో 43.80% పోలింగ్ నమోదు

• ఆకివీడు మండలంలో 47.32% పోలింగ్ నమోదు

• అత్తిలి మండలంలో 51.19% పోలింగ్ నమోదు

• భీమవరంమండలంలో 46.08 % పోలింగ్ నమోదు

• యలమంచిలి మండలంలో  47.84% పోలింగ్ నమోదు

• గణపవరం మండలంలో  48.20% పోలింగ్ నమోదు

• ఇరగవరం మండలంలో 47.64 % పోలింగ్ నమోదు

• కాళ్ళ మండలంలో 48.29% పోలింగ్ నమోదు

• నరసాపురం మండలంలో 46.76% పోలింగ్ నమోదు

• పాలకొల్లు మండలంలో 47.24 % పోలింగ్

• పాలకోడేరు మండలంలో 45.25% పోలింగ్ నమోదు

• పెనుగొండ మండలంలో 44.83% పోలింగ్ నమోదు

• పెనుమంట్ర మండలంలో 48.09 % పోలింగ్ నమోదు

• పోడూరు మండలంలో 50.61% పోలింగ్ నమోదు

• తాడేపల్లి గూడెం మండలంలో 49.86% పోలింగ్ నమోదు

• తణుకు మండలంలో 49.34% పోలింగ్ నమోదు

• ఉండి మండలంలో 49.72% పోలింగ్ నమోదు

• వీరవాసరం మండలంలో 46.64% పోలింగ్ నమోదు

గుంటూరు

  • గుంటూరు రూరల్ మండలం వెంగళయపాలెంలో ఉద్రిక్తత
  • వెంగళాయపాలెంలో భారీగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న తెలుగుదేశం నాయకులు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థితో పాటు నాయకులను పంపించి వేస్తున్న పోలీసులు
  • తెలుగుదేశం అభ్యర్థితో పాటు నాయకులని పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్న సీఐ పొన్నూరు భాస్కర్
  • తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పిన వినిపించుకొని సీఐ పొన్నూరు భాస్కర్
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థితో పాటు కార్యకర్తలని తరిమేస్తున్న పోలీసులు
  • పోలీసులు తెలుగుదేశం నాయకులకు తొత్తులుగా మారారని నిప్పులు చెరుగుతున్న ఓటర్లు

చిత్తూరు

  • గుడిపాల మండలంలో దొంగ ఓట్లు వేసేందుకు అధిక సంఖ్యలో మొహరించిన టీడీపీ నాయకులు
  • చిత్తూరు టీడీపీ నాయకుడు కాజూరు బాలాజీ ఆధ్వర్యంలో మొహరించిన టీడీపీ గూండాలు
  • మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ అల్లరి మూకలు
  • గుడిపాల మండలంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు
  • ఏమాత్రం పట్టించుకోని ఎన్నికల అధికారులు
  • బయట ప్రాంతాల వ్యక్తులతో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్

కాకినాడ జిల్లా
కాకినాడ

  • జగ్గంపేటలో ఎన్నిక కోడ్ ఉల్లఘించిన టీడీపీ
  • ఎన్నికల వేళ టీడీపీ టీష్టరులు, ప్లకార్డులతో బహిరంగ ప్రచారం
  • టీడీపీకి ఓటు  వెయ్యాలంటూ కార్యకర్తల ప్రచారం
  • సెక్షన్ 144 అమలులో ఉన్నా... టీడీపీ ప్రచారంపై పోలీసుల ప్రేక్షక పాత్ర

కళ్యాణదుర్గం

  • కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల కేంద్రం, చింతర్ల పల్లి, కనుకూరు గ్రామాలలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ హల్ చల్
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించేందుకు యత్నం తిరగబడిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై అనుచరులతో దాడి
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, టీడీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం తోపులాట
  • ఆయా గ్రామాలలో గంటలపాటు ఉద్రిక్తత
  • ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
  • ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు అనుచరులతో భౌతిక దాడులకు యత్నం
  • సమస్యాత్మక గ్రామాలలో సైతం కూడా ఇద్దరు పోలీసులను నియమించిన పోలీసు ఉన్నతాధికారులు
  • పలుచోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయని వైనం

ఏలూరు జిల్లా

• మొత్తం ఏలూరు జిల్లా సమగ్ర పోలింగ్ (1:00 PM సమయానికి): 43.74%

• పెదవేగి మండలంలో అత్యధికంగా 54.77% పోలింగ్ నమోదు

• భీమడోలు మండలంలో అత్యల్పంగా 27.33% పోలింగ్ నమోదు

• లింగపాలెం మండలంలో 53.94% రికార్డు స్థాయి పోలింగ్

• నిడమర్రు మండలంలో 49.84% పోలింగ్ నమోదు

• మండవల్లి మండలంలో 49.39% పోలింగ్ నమోదు

• అగిరిపల్లి మండలంలో 48.97% పోలింగ్ నమోదు

• చింతలపూడి మండలంలో 48.91% పోలింగ్ నమోదు

• దెందులూరు మండలంలో 48.71% పోలింగ్ నమోదు

• ముదినేపల్లి మండలంలో 48.64% పోలింగ్ నమోదు

• ముసునూరు మండలంలో 47.59% పోలింగ్ నమోదు

• ఉంగుటూరు మండలంలో 46.51% పోలింగ్ నమోదు

• కలిదిండి మండలంలో 46.24% పోలింగ్ నమోదు

• ఏలూరు మండలంలో 46.35% పోలింగ్ నమోదు

• జంగారెడ్డిగూడెం మండలంలో 45.17% పోలింగ్ నమోదు

• ద్వారకా తిరుమల మండలంలో 42.19% పోలింగ్ నమోదు

• పెదపాడు మండలంలో 41.08% పోలింగ్ నమోదు

• కొయ్యలగూడెం మండలంలో 40.70% పోలింగ్ నమోదు

• నూజివీడు మండలంలో 39.97% పోలింగ్ నమోదు

• కుక్కునూరు మండలంలో 38.49% పోలింగ్ నమోదు

• కైకలూరు మండలంలో 38.35% పోలింగ్ నమోదు

• టి.నరసాపురం మండలంలో 36.81% పోలింగ్ నమోదు

• చాట్రాయి మండలంలో 34.71% పోలింగ్ నమోదు

• కామవరపుకోట మండలంలో 32.07% పోలింగ్ నమోదు

• మొత్తం ఓటర్లు: 11,62,523

 1:00 PM నాటికి ఓటేసినవారు: 5,08,545 (పురుషులు: 2,53,289 | మహిళలు: 2,55,256)

ప్రకాశం జిల్లా

  • ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం కొలిజేడు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • పోలింగ్ కేంద్రంలోకి రాకుండా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ నేతలు
  • పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్

కృష్ణాజిల్లా

  • కృత్తివెన్ను మండలంలో ఎన్నికల పోలింగ్‌కు వర్షం ఆటంకం
  • మాట్లం పోలింగ్ బూత్‌లో  గొడుగు వేసుకుని వర్షంలో కూడా క్యూ లైన్‌లో నుంచుని ఓట్లు వేయడానికి వెళుతున్న ఓటర్లు

నెల్లూరు జిల్లా

  • నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి
  • ఓటు వేసేందుకు వెళ్లిన మస్తాన్‌పై దాడికి యత్నించిన టీడీపీ వర్గీయులు
  • దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్‌లోకి పరుగులు తీసిన మస్తాన్
  • అదే సమయంలో అటుగా వస్తున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు మందల పెంచలరావుపై మూకుమ్మడి దాడి
  • టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన మందల పెంచలరావు
  • ఈ ఘటనతో వెంకటాచలం మండల కేంద్రంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం
  • గాయపడిన పెంచలరావును, మస్తాన్‌ను పోలీస్ స్టేషన్‌కి తరలిపు

విజయవాడ

  • స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం వద్దకు వైఎస్సార్‌సీపీ నేతలు
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమినేతల ఆగడాలు అఘాయిత్యాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
  • ఎస్‌ఈసీకి వచ్చిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, వైఎస్సార్‌సీపీ నేతలు నారాయణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి

కర్నూలు జిల్లా... పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు..

  • పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత
  • స్థానిక ప్రజలపై లాఠీఛార్జి చేసిన సీఐ జయన్న  
  • వైఎస్సార్‌సీపీ నేత బనగాని శ్రీనివాసులను బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించేందుకు ప్రయత్నం
  • పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు..
  • కారణం లేకుండా ఎందుకు అరెస్టు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్  
  • ప్రజలు తిరగబడ్డంతో వైఎస్సార్‌సీపీ నేత శ్రీనును వదిలిపెట్టిన పోలీసులు

చిత్తూరు..

  • వీ.కోట పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత..
  • వీ.కోటలో ఓటు వేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్‌పై సీఐ సోమశేఖర్ రెడ్డి దౌర్జన్యం.. ఆపై దాడికి యత్నం!
  • ఓటు వేయడానికి వేచి ఉన్న సమయంలో కుప్పం రిపోర్టర్ అక్రమ్‌పై దౌర్జన్యం
  • ఓటు వేయడానికి వచ్చానని చెబుతున్న వినకుండా రెచ్చిపోయిన వీ.కోట సీఐ..

పోలీసులు, టీడీపీ కలిసి పులివెందులలో అరాచక పర్వం

  • వైఎస్సార్ జిల్లా.. పులివెందులలో మొత్తం పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ మూకలు
  • పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు
  • ఉదయం నుంచి అరాచకం సృష్టించిన టీడీపీ గూండాలు
  • బీటెక్ బంధువులు, టీడీపీ మూకలు కలిసి అరాచకం!
  • ప్రతి బూత్ నుంచీ వైఎస్సార్‌సీపీ ఏజెంటును లాగేసిన టీడీపీ మూకలు
  • పూర్తిగా పోలీసుల సహకారంతో ఏజెంట్లను అడ్డుకున్న వైనం
  • ఓటర్లు రాకుండా పోలింగ్ కేంద్రాలకు తాళం వేసిన టీడీపీ గూండాలు
  • పెట్రోల్ బాంబులతో స్వైర విహారం చేసిన టీడీపీ మూకలు
  • ఉదయం 11 గంటలకే దాదాపు 50 శాతం పోలింగ్
  • ఉదయం 5 గంటలకే బూత్‌ ల్లోకి దూరి రిగ్గింగ్ చేసుకుంటున్న మూకలు
  • టీడీపీ దాడుల్లో విలేకరులు, ఓటర్లకు గాయాలు


అనంతపురం: రిగ్గింగ్ చేయిస్తూ పట్టుబడ్డ కూడేరు సీఐ రాజు

  • నిలదీసిన మరుట్ల గ్రామస్తులు
  • సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన సీఐ రాజు
  • మంత్రి పయ్యావుల కేశవ్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం

పక్క ఊరి నుంచి వచ్చిన టీడీపీ గూండాల అరాచకాం..

  • పెద్దముడియంలోని బూత్ నంబర్ 32,33 వద్ద ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరవ భాస్కర్ బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి అరవ శ్రీకళపై దాడి..
  • మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడిన టీడీపీ గూండాలు

 

మమల్ని చంపేయండి.. పోలీసులపై వైఎస్సార్‌సీపీ నాయకుడు జంపాని రాఘవులు ఆగ్రహం!

  • నెల్లూరు జిల్లా, కావలి
  • రాజ్యాంగాన్ని కూని చేస్తున్న చెంచుగానిపాలెం టీడీపీ నేతలు..
  • చెంచుగానిపాలెం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ కలకలం
  • అడ్డుకున్న జంపాని రాఘవులు..
  • పోలీస్ సహకారాలతో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న కూటమి నేతలు..
  • ప్రశ్నించిన రాఘవులు మీద కేసులు పెడతామంటూ బెదిరింపులు..

 

నంద్యాల జిల్లా...

  • ప్రాతకోట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
  • వైఎస్సార్‌సీపీ ఏజంట్లకు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
  • రిలీవర్ ఏజంట్లను లోపలికి పంపకుండ అడ్డుకుంటున్న పోలీసులు.

కర్నూలు జిల్లా ....

  • కర్నూలు మండలం టిడిపి పార్టీ నేతలు ప్రలోభాలు
  • మండలంలోని నందనపల్లె ఎంపిటిసి అభ్యర్థి నాగరాజు డబ్బుల పంపిణీ
  • ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు కు డబ్బులు అందిస్తున్న టిడిపి నేతలు
  • దొంగ ఓట్లు వేసేందుకు ఎన్నికల సిరా ను హైపో ద్రవం తో తుడిచి ఓట్లు వేస్తున్న టిడిపి నేతలు ..

 

తాడేపల్లి : సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారు..

  • టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కామెంట్స్..
  • పరిషత్ ఎన్నికలలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు
  • పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తూ కూర్చుంది
  • సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లోనూ సరైన ఏర్పాటు చేయలేదు
  • గతంలో ఎప్పుడూ గొడవలు జరగని చోట కూడా ఘర్షణలు జరుగుతున్నాయి
  • ఇతర రాష్ట్రాల నుండి రప్పించిన గూండాలతో దాడులు చేయిస్తున్నారు
  • పార్నపల్లెలో ఎంపీ అవినాష్‌రెడ్డిని డీఎస్పీ మురళినాయక్ ఎలా అడ్డుకుంటారు?
  • టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలింగ్ కేంద్రాల్లో కూర్చుని రిగ్గింగ్ చేశారు
  • వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలే పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారు
  • అలాంటప్పుడు ఇక ఎన్నికలను జరపటం ఎందుకు?
  • గ్రామాలలో పెట్రోలు బాంబుల సంస్కృతిని తెచ్చారు..
  • అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా?
  • పోలీసులు టీడీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు!
  • పోస్టింగులు, ట్రాన్సఫర్ల కోసం టీడీపీ నేతలు చెప్పినట్టు ఆడుతున్నారు..
  • సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారు..
  • ఇక తనకు అధికారం రాదని తెలిసి ఇలా రెచ్చిపోతున్నారు
  • అన్ని ఆటంకాలను ఎదుర్కొని మా పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారు..
  • మహిళలు సైతం కొంగు బిగించి పోరాటం చేస్తున్నారు..
  • ప్రశాంతంగా ఎన్నికలు జరిపించే దమ్ము చంద్రబాబుకు లేదు.
  • ఎస్ఈసీ, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి దౌర్జన్యాలు, దాడులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు..

 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ పోలీసుల దూకుడు..

  • పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం
  • మంత్రి సవిత ఇలాకాలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై గోరంట్ల సీఐ శేఖర్ దాడులు..
  • మహిళలను సైతం బూతులు తిడుతూ మానసికంగా వేధించిన సీఐ శేఖర్..

రైల్వే కోడూరులో దొంగ ఓట‌ర్లు..

  • రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా సిటీలు, టౌన్ల నుంచి దొంగ ఓట‌ర్ల‌ను త‌ర‌లిస్తున్న టీడీపీ
  • దొంగ ఓట‌ర్ల‌ను త‌ర‌లిస్తున్న వ్యాన్‌ల‌ను మార్గ‌మ‌ధ్య‌లోనే గుర్తించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు..


కృష్ణాజిల్లా...

  • మచిలీపట్నం సౌత్ మండలం కోన గ్రామం..
  • ఎన్నికల బూత్ వద్ద బరితెగించిన టీడీపీ నేతలు
  • ఓట్లు వేయడానికి వెళుతున్న ప్రజలను అడ్డుకుంటున్న వైఖరి..
  • పసుపు కండువాలు, చొక్కాలు ధరించి ప్రలోభాలకు గురి చేస్తున్న తీరు
  • చోద్యం చూస్తున్న అధికారులు

శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే శంకర్ బరితెగింపు..

  • కిష్టప్పపేట పోలింగ్ బూత్ దగ్గర ఎమ్మెల్యే హల్‌చల్
  • వైఎస్సార్‌సీపీ నేత నరసింగరావుపై దాడి
  • అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా దాడిచేసిన ఎమ్మెల్యే శంకర్
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల రాళ్ల దాడి

 

  • పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం..
  • పిల్లుట్ల గ్రామం నందు 10.30 నిమిషాలకే ఓటింగ్ పర్సంటేజ్ లేదంటూ టీడీపీ నాయకుల దౌర్జన్యం..
  • ఓట్లు వేయటానికి అవకాశం లేదంటూ ఓటర్లను వెళ్లిపోవాలని బెదిరిస్తున్న వైనం

 

అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత

  • కూడేరు మండలం మరుట్లలో టీడీపీ నేతల రిగ్గింగ్
  • ఆగ్రహంతో బ్యాలెట్ బాక్సు ఎత్తుకెళ్లిన స్థానికులు
  • బ్యాలెట్ పేపర్లు చించేసిన ఓటర్లు
  • కూడేరు సీఐ రాజు స్వయంగా రిగ్గింగ్ చేయించారని ఆరోపణలు

 

పోలీసుల సమక్షంలో రిగ్గింగ్ జరగటం దారుణం..

  • తిరుపతి జిల్లా.. పెనగలూరు మండలం ఓబిలి బూత్
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటికి లాగేసి రిగ్గించేస్తున్న కూటమి నాయకులు
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించని ఎన్నికల అధికారులు, పోలీసులు

 

  • వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రుప్ప దివ్యపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే గొండు శంకర్
  • క్యూ లైన్‌లో ఓటర్లను ఎమ్మెల్యే ప్రలోభ పెడుతుండడంపై ప్రశ్నించిన దివ్య
  • పోలింగ్ బూత్ దాటి బయటకు రాలేవంటూ ఎమ్మెల్యే వార్నింగ్
  • శంకర్ దురుసు ప్రవర్తనపై ముక్కును వేలేసుకుంటున్న సొంత గ్రామం మహిళలు
  • కిష్టప్ప పేటలో గొడవలు రేపేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం
  • దీటుగా ఎదుర్కొంటున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణులు

టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ హల్‌చల్..

  • అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల కేంద్రం..
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించేందుకు యత్నం
  • తిరగబడిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై అనుచరులతో దాడి..
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, టీడీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం తోపులాట
  • ఆయా గ్రామాలలో గంటలపాటు ఉద్రిక్తత
  • ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
  • ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు అనుచరులతో భౌతిక దాడులకు యత్నం
  • సమస్యాత్మక గ్రామాలలో కూడా ఇద్దరు పోలీసులను మాత్రమే నియమించిన పోలీసు ఉన్నతాధికారులు
  • పలుచోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటుచేయని వైనం

ఏలూరు జిల్లా.. నూజివీడు నియోజకవర్గంలో ఉద్రిక్తత

  • ఆగిరిపల్లి నరసింహారావుపాలెం గ్రామంలో ఓటు విషయంలో ఘర్షణ
  • వృద్ధురాలు ఓటు వేసే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం
  • పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు నెలకొన్న ఉద్రిక్త వాతావరణం
  • ఘర్షణతో అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది, అధికారులు

 

  • ఎన్టీఆర్ జిల్లా:
  • విస్సన్నపేట మండలం కలగరలో ఎన్నికల వేళ ఉద్రిక్తత
  • జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఏజెంటును నెట్టేసిన టీడీపీ నాయకడు
  • వైఎస్సార్‌సీపీ నాయకులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం..
  • పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
  • టీడీపీ నాయకుల తీరుతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల యత్నం..

శైలజానాథ్‌ను అడ్డుకున్న పోలీసులు

  • అనంతపురం:
  • మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న పోలీసులు
  • శింగనమల నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలు
  • పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ నేతలు
  • ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ ఆఫీసుకు బయలుదేరిన శైలజానాత్‌ను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో మాజీ మంత్రి శైలజానాథ్ వాగ్వాదం
  • అనంతపురం ఎస్పీ కార్యాలయంలో బైఠాయించిన శైలజానాథ్

టీడీపీ గూండాగిరి..

  • ఏలూరు జిల్లాలో టీడీపీ గూండాగిరి
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ గూండాలు.
  • ఆర్వో అనుమతించినా కుదరదన్న టీడీపీ రౌడీలు.
  • టీడీపీ ఏజెంట్లతోనే పోలింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు.

టీడీపీ గూండాల హల్‌చల్‌..

  • ధూళిపాళ్ల పోలింగ్‌ బూత్‌లో టీడీపీ గూండాల హల్‌చల్‌.
  • బూత్‌ క్యాప్చర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ గూండాలు.
  • ఏజెంట్లకు, టీడీపీ గూండాలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం. 

 

శ్రీ సత్యసాయి జిల్లా.. కదిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం!

  • దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు
  • పోలీసులతో వైఎస్సార్‌సీపీ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి వజ్రా భాస్కర్ రెడ్డి వాగ్వాదం
  • టీడీపీ స్థానికేతరులను ఎలా అనుమతిస్తారని ధ్వజం

కర్నూలు జిల్లా..

  • పోలింగ్ స్టేషన్లలో ఉండాల్సిన ఏజెంట్లు పోలీసుల అదుపులో  ఉన్నారు..
  • పోలింగ్ ముందు రోజు నుండే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోలింగ్ స్టేషన్‌కు వెళితే పీడీ యాక్ట్ పెడతామంటూ బెదిరింపులు
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎక్కడికి వెళ్ళకుండా ఆంక్షలు..
  • క్రిష్ణగిరిలో జరుగుతున్న ఎన్నికల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్న ఓటర్లు ..

 

  • నంద్యాలలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి , శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి హౌస్ అరెస్ట్
  • టీడీపీ నేతలు యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద మంది మార్బలంతో హల్‌చల్!
  • నియోజకవర్గంలో కాన్వాయ్‌లతో  హల్‌చల్ చేస్తున్న ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు భూమ విఖ్యాత్ రెడ్డి
  • వైఎస్సార్‌సీపీ మండల నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్‌లలో పెట్టిన వైనం..
  • తారతమ్యం చూపుతున్న పోలీసులపై మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు..

 

  • కృష్ణాజిల్లాలో ఉదయం 9.00 గంటల వరకునమోదైన పోలింగ్ శాతం 15.75%
  • విజయవాడ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 7 గంటల నుండి 9 గంటలవరకు 4.8శాతం  పోలైన ఓట్లు..

 

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న దౌర్జన్యకాండ..

  • రామకుప్ప మండలం బందార్లపల్లి పంచాయతీ బూత్ నెంబర్ 14, 15..
  • కంచి దాసనపల్లి, లింగాపురం, వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లుగా వెళ్లిన మహేష్, సోమశేఖర్..
  • ఇద్దరినీ టీడీపీ గూండాలు అడ్డుకోవడంతో వాగ్వాదం
  • బలవంతంగా పోలింగ్ బూత్ నుండి బయటికి పంపిన టీడీపీ గూండాలు

మార్కాపురం.. కనిగిరి

  • జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతల ముందస్తు అరెస్టులు..
  • వైఎస్సార్‌సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు హౌస్ అరెస్టు..
  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని సీఎస్ పురం పోలీసులు నోటీసులు..

విశాఖ జిల్లా..

  • MPTC/ZPTC ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్..
  • విశాఖ జిల్లాలో రెండు గంటల్లో 14.83 శాతం పోలింగ్ నమోదు..
  • క్యూ లైన్‌లో బారులు తీరిన ఓటర్లు..

విశాఖ జిల్లా..

  • MPTC/ZPTC ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్..
  • విశాఖ జిల్లాలో రెండు గంటల్లో 14.83 శాతం పోలింగ్ నమోదు..
  • క్యూ లైన్‌లో బారులు తీరిన ఓటర్లు..

చిత్తూరు జిల్లా..

  • కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ..
  • శాంతిపురం మండలంలోని శివరామపురం గ్రామంలో అల్లర్లు..
  • మాజీ వైస్ ఎంపీపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..
  • ఎన్నికల రోజు వైఎస్సార్‌సీపీ నేత రమేష్‌ను అదుపులోకి తీసుకోవడంపై మండిపడిన నేతలు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను అదుపులోకి తీసుకొని భయబ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు..

టీడీపీ అరాచకం.. పెట్రోల్‌ బాంబుల దాడి..

  • రైల్వేకోడూరు నియోజకవర్గంలో రణరంగం..
  • పెట్రోల్‌ బాంబులతో విరుచుకుపడిన టీడీపీ గూండాలు
  • పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ రౌడీల బీభత్సం!
  • పోలీసుల సమక్షంలోనే పెట్రోల్‌ బాంబులతో రౌడీల దాడులు..
  • టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు


 

  • శ్రీకాకుళం.. టెక్కలిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా పోలీసుల చర్యలు..
  • సీఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహం!
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉషారాణి కుమారుడు పృథ్వీని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు..
  • బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన
  • టెక్కలిలో మాజీ ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వరుసగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న తీరు
  • పలుచోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఫామ్ చింపి వేస్తున్న టీడీపీ గూండాలు

అన్నమయ్య జిల్లా...

  • పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ నేతలు దౌర్జన్యం
  • చౌడేపల్లి మండలం చారాల పోలింగ్ కేంద్రంలోకి వైఎస్సార్‌సీపీ ఏజంట్లను రానివ్వడం లేదని నిరసన
  • పోలింగ్ కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ పార్టీ ఏజెంట్లు, నాయకులు..

 

  • కుప్పం నియోజకవర్గంలో అప్రజాస్వామికంగా స్థానిక సంస్థలు ఎన్నికలు..
  • సీఎం ఇలాకాలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
  • రామకుప్పం మండలం బొమ్మనపల్లి గ్రామంలో పోలీసు అధికారుల దైర్జన్యం..
  • ఏజెంట్లను అక్రమంగా అరెస్టు చేస్తున్న వైనం

ఏలూరు జిల్లా ..

  • నూజివీడు మండలం గొల్లపల్లి పీహెచ్‌సీ సమీపంలోని పాఠశాల పోలింగ్ బూత్‌లో నిలిచిపోయిన ఓటింగ్..
  • స్టాంప్ ప్యాడ్ అందుబాటులో లేక పోలింగ్ ప్రక్రియకు అంతరాయం..
  • ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు నిరీక్షణతో ఇబ్బందులు..
  • వెంటనే స్టాంప్ ప్యాడ్ ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రారంభించాలని ఓటర్ల డిమాండ్..


 

  • అనకాపల్లి (మం) రోంగనివాని పాలెంలో ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు..
  • రిజర్వేషన్లు మారిపోవడంతో ఓటింగ్‌కు దూరమైన ఓటర్లు..
  • పోలింగ్ ప్రారంభించేందుకు స్థానికులతో చర్చిస్తున్న సిబ్బంది..

కడప జిల్లా..
అధికారాన్ని అడ్డంపెట్టుకొని, పోలీసుల సమక్షంలో.. ఓట్లు గుద్దుకుంటున్న కూటమి నాయకులు..

  • పెద్దముడియం మండలం జై. కొట్టాలపల్లిలో టీడీపీ మూకల మోహరింపు..
  • ఎంపీపీ స్కూల్‌లో పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టిన టీడీపీ నేతలు
  • ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను వెనక్కి పంపుతున్న టీడీపీ గూండాలు
  • వారిని దారుణంగా అడ్డుకుంటున్న టీడీపీ మూకలు..
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్స్‌ను బయటకు పంపివేసిన పచ్చ మూకలు, ఆపై దాడికి యత్నం..
  • ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడంపై ఓటర్ల ఆగ్రహం!
  • బయట ఊరి నుంచి వచ్చిన టీడీపీ గూండాలు ఓటర్లను అడ్డుకుంటున పరిస్థితి
  • పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా చేరిన టీడీపీ గూండాలు
  • చోద్యం చూస్తున్న పోలీసులు..

 

తిరుపతి జిల్లా... పోలింగ్ కేంద్రం నిబంధనలకు పాతర..

  • రేణిగుంటలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన..
  • బాలికల ఉన్నత పాఠశాల బూత్ నం. 24 ఎదురుగా టీడీపీ కార్యాలయం తెరిచి హల్‌చల్!
  • పోలింగ్ కేంద్రం సమీపంలోనే జోరుగా టీడీపీ కార్యకలాపాలు..
  • చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..
  • బూత్ నంబర్ 24, 25 వద్ద ఓటర్ల తీవ్ర గందరగోళం..
  • క్షేత్రస్థాయిలో ఓటర్ స్లిప్పులు అందించని బీఎల్‌వోలు
  • ​రేణిగుంట. బాలికల, బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాల వద్ద ఓటర్ల ఆందోళన!
  • 'మా ఓటర్ స్లిప్పులు ఎక్కడ?' అంటూ బీఎల్‌వోలను నిలదీస్తున్న వైనం
  • ​రేణిగుంటలో ఓటర్ స్లిప్పులు చేతికందక పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
  • యంత్రాంగం వైఫల్యంపై ఆగ్రహం!
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అధికారుల నిర్లక్ష్యం..
  • తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
  • ఓబులవారిపల్లి మండలం మంగంపేట పునర వాస కాలనీలో కూటమి నాయకులు వైనం..
  • ఎంపీటీసీ అభ్యర్థి మౌనిక పోలింగ్ కేంద్రంలో వెళ్లకుండా అడ్డుకుంటున్న తీరు
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పేపర్లు చించేసి.. బయటికి పంపివేత
  • వైఎస్సార్‌సీపీ పార్టీ ఏజెంట్లు లేకపోవడంతో పోలింగ్ బూత్‌లో టీడీపీ గూండాల రిగ్గింగ్..
  • చోద్యం చూస్తున్న పోలీసులు..

ప్రకాశం..

  • దర్శి మండలం తానంచింతల గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్స్ బయటకు పంపిన తీరు..
  • దారుణంగా రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ గూండాలు..
  • పోలింగ్ బూత్‌లలోకి చొరబడ్డ టీడీపీ మూకలు..
  • నరసరావుపేట నుండి వచ్చినటువంటి 100 మంది గూండాలు..

కృష్ణాజిల్లా.. గన్నవరం నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం..

  • బాపులపాడు తిప్పనగుంటలో వైఎస్సార్‌సీపీ నేత మూల్పూరు ప్రభుకాంత్ హౌస్ అరెస్ట్
  • ఇంట్లో వంటలు చేస్తున్న గిన్నెల్లో వాటర్ పోసిన పోలీసులు..
  • బైండోవర్ కేసులు పేరుతో వైఎస్సార్‌సీపీ నేత తేలప్రోలు రాముని ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కి తరలింపు..

నంద్యాల జిల్లా...

  • నెహ్రూనగర్ గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద ఎంపీ శబరి అనుచరుడు  శ్రీనివాసులు వీరంగం..
  • పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్‌సీపీ నేత మాజీ ఎంపీటీసీ భర్తపై దాడి..

 

ఏలూరు జిల్లా..

  • నూజివీడు మండలం బోరవంచ గ్రామంలో పోలింగ్ బూత్లను ఆక్రమించే ప్రయత్నం..
  • 140, 141 పోలింగ్ బూత్‌లలో  ఏజెంట్లు కాకుండా బయట వ్యక్తులు..
  • ఏజెంట్లు కాకుండా ఎక్కువమంది లోపల ఉండటంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం..
  • పోలింగ్ కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు ఎలా వస్తారంటూ నిలదీసిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో వాగ్వాదానికి దిగిన టీడీపీ ఏజెంట్లు

 

తారుమారు పరిస్థితితో వెనుతిరుగుతున్న ఓటర్లు

  • నర్సీపట్నం అనకాపల్లి మాకవరపాలెంలో నిలిచిన పోలింగ్..
  • 31,32,31,34 బూత్‌లలో నిలిచిన పోలింగ్..
  • బీఎల్‌ఓ లో పంచిన ఓటరు స్లిప్లు బూత్‌లో ఉన్న లిస్ట్ కు నో మ్యాచ్ంగ్‌

విశాఖ..

  • కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఓటర్లు..
  • భీమిలి మండలం రాయానిపేటలో ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు.
  • గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తున్న ఓటర్లు.
  • రాయానిపేట గ్రామంలో మొత్తం 120 ఓట్లకు గాను ఓటర్లంతా ఎన్నికలకు దూరం..

 

ఓటు వేసేందుకు స్లిప్పుల ఆధారంగా వెళ్లిన ఓటర్లకు జలక్..

  • అనకాపల్లి జిల్లా, మాకవారి పాలెం మండలంలో పరిస్థితి తలకిందులు..
  • పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్  జాబితాలకు, ఓటర్లకు ఇచ్చిన స్లిప్పులకు తేడాలు..
  • స్లిప్పుల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళితే.. లేని ఓటరు పేర్లు!
  • పాత జాబితాల ఆధారంగా స్లిప్పులు పంపిణీ చేసిన బిల్ ఓలు
  • ఓట్లు వేసేందుకు కొత్త జాబితాల్లో స్లిప్పుల కోసం ఓటర్ల పరుగులు
  • ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న ఓటర్లు

నంద్యాల జిల్లా..

  • నందికొట్కూరు నియోజకవర్గంలో బరితెగిస్తున్న టీడీపీ..
  • గ్రామాల్లో ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్..
  • వారిని నందికొట్కూరు రూరల్ స్టేషన్‌లో పెట్టిన పోలీసులు..
  • జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి వన్ సైడ్ చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసుల వేధింపులు..
  • మిడుతూరు, జూపాడుబంగ్లా మండల వైఎస్సార్‌సీపీ నేతలు శివరామిరెడ్డి, క్రిష్ణ రెడ్డి, రామిరెడ్డి రెడ్డి, రమణ, మస్తాన్, రంగస్వామి, శివ, అన్వర్‌లను పోలీస్ స్టేషన్‌లో ఉంచిన పోలీసులు..

వైయస్సార్ జిల్లా..
లింగాల మండలం ఇప్పట్లలో టీడీపీ మూకల దాష్టీకం..

  • సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై దాడి.. కర్రలతో దాడికి దిగిన మూకలు..
  • జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీదేవి, ఇండిపెండెంట్ అభ్యర్థి సురేఖపై కూడా దాడి
  • మహిళా అభ్యర్థులపై దాడి చేసి వారి మెడలో బంగారం లాక్కునే ప్రయత్నం
  • తీవ్ర గాయాలతో అభ్యర్థులు, విలేకరి..
  • ఏ ఒక్క ఏజెంట్‌ను బూత​్‌లోకి వెళ్లకుండా అడ్డగింత...

అన్నమయ్య జిల్లా..

  • పుంగునూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ నేతల గూండాగిరి
  • రొంపిచర్ల గ్రామపంచాయతీలో పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు
  • ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసులు, పోలింగ్  అధికారులు...


చేజర్లలో బరితెగించిన కూటమినేతలు..

  • కోటితీర్థంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి రానివ్వని వైనం..
  • ప్రతిపక్ష ఏజెంట్లు లేకపోవడంతో మొదటి గంటలోనే రిగ్గింగ్‌కు పాల్పడుతున్న కూటమి నాయకులు..
  • జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించాలని వైఎస్సార్‌సీపీ పార్టీ డిమాండ్..

వైఎస్సార్ జిల్లా

  • జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్లీ అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ
  • టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న పోలీసులు
  • గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా అరెస్టులు
  • పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డిల అరెస్ట్
  • నల్లపురెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉమ్మారెడ్డి అరెస్ట్
  • వేములలో పోలింగ్ బూత్‌ల వద్ద రాళ్లు సిద్ధం చేసుకున్న టీడీపీ నేతలు
  • పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల మండలంలో అరాచకానికి స్కెచ్
  • పోలింగ్ బూత్‌ల వద్ద కిరాయి మూకలు
  • ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకునేందుకు కుట్ర

టీడీపీ నేతల అరాచకం..

  • అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
  • పుంగనూరు మండలం ఈడిగపల్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఐడీలను లాక్కొని వారిని బయటకు నెట్టివేసిన కూటమి నేతలు
  • చౌడేపల్లి మండలం దుర్గ సముద్రంలో ఏజెంట్ల ఐడీలను లాక్కొని ఇదే తరహాలో బయటకు పంపించిన కూటమి నేతలు

వైఎస్సార్ జిల్లా..

  • పెద్దముడియం మండలంలో మొదలైన కూటమి  నేతల దాడులు
  • భూతపురం గ్రామం వద్ద వైఎస్సార్‌సీపీ నేత కారుపై దాడి చేసి అద్దం పగులగొట్టిన పచ్చ గూండాలు
  • గుండ్లకుంట గ్రామం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • నేడు పెద్దముడియం మండలంలో 9 ఎంపీటీసీలకు ఒక జడ్పీటీసీకి జరగనున్న ఎన్నికలు
  • పోలింగ్ మొదలవకముందే దాడులకు పాల్పడుతున్న కూటమి గుండాలు
  • బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు
  • మొన్న జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో చేసిన రిగ్గింగ్, 
  • ఇప్పుడు పెద్దముడియం మండలంలో అదే తరహాలో చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న కూటమి నాయకులు
  • పెద్దఎత్తున బయటి ప్రాంతాల నుండి రౌడీ మూకలను తరలించి హింసా కాండకు రంగం సిద్ధం


నంద్యాల జిల్లా...

  • జూపాడుబంగ్లా (మ) మండ్లెం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత,
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి పోనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు,
  • ఇదేమీ న్యాయం అంటూ పోలీసుల తీరుపై తిరగబడ్డ జనం..
  • పోలింగ్ బూత్ వద్ద  బైఠాయించి నిరసన తెలిపిన ఏజెంట్లు,
  • బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

వైఎస్సార్ జిల్లా..

  • జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అరాచకానికి తెరలేపుతున్న టీడీపీ
  • వేముల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద రాళ్లు సిద్ధం చేసిన టీడీపీ నాయకులు
  • ఉదయాన్నే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకునేందుకు కిరాయి మూకలను సిద్ధం చేస్తున్న పచ్చ బ్యాచ్‌
  • రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకుని ఏజెంట్లు, ఓట్లర్లపై దాడికి సిద్ధం
  • పులివెందుల నియోజకవర్గంలో లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లిలో జడ్పీటీసీ ఎన్నికలు
  • అన్ని మండలాల్లో అదే దాష్టీకానికి సిద్ధమవుతున్న టీడీపీ
  • కాసేపట్లో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. 

  • 582 జడ్పీటీసీ,7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ 

  • పోటీలో మొత్తం 20,966 మంది అభ్యర్థులు 

  • 2.61 కోట్ల మంది ఓటర్లు.. 31,460 పోలింగ్‌ కేంద్రాలు  

  • పోలింగ్‌కు వర్షం బెడద

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)