Breaking News

ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క: ఏపీ జేఏసీ అమరావతి

Published on Sat, 08/23/2025 - 17:30

సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్‌ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్‌లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.

‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్‌లో సంబంధం లేకుండా ప్లే స్లిప్‌లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.

ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)