Breaking News

ప్రతిదానికి పిల్‌ ఏమిటి?.. టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్‌పై హైకోర్టు అభ్యంతరం

Published on Fri, 05/12/2023 - 07:57

సాక్షి అమరావతి: విశాఖపట్నం మధు­రవాడలో రామా­నా­యుడు స్టూడియో కోసం కేటాయించిన భూమిలో రెసిడెన్షి­య­ల్‌ లేఅవుట్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ విశాఖ మునిసిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాఖ­పట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) గురువారం హైకోర్టు కొట్టేసింది.

బాధ్యతాయుత ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఇలాంటి పిల్‌ వేయడం ఏమిటని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదం ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉంటే దానిపై పిల్‌  దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అది ఫిల్మ్‌ స్టూడియోకి ఇచ్చిన భూమి అని, ప్రైవేట్‌ భూ వివాదంలో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని అడిగింది. ఇది ధనికుల మధ్య వివాదమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’

ప్రతి దాంట్లో ఉల్లంఘన ఉందంటూ  పిల్‌ దాఖలు చేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనాలు ఎంతమాత్రం లేవని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. 


   

Videos

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)