Breaking News

సంపదను సృష్టించడం ముఖ్యం: ఏపీ సీఎం చంద్రబాబు

Published on Thu, 06/13/2024 - 10:37

తిరుపతి, సాక్షి: మన దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని, అలాంటి వ్యవస్థ కలకాలం ఉండాలని దేవుడ్ని ప్రార్థించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, పార్టీ పరివారంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ఈ విజయం సాధించాం.  2003లో వెంకటేశ్వరస్వామి నన్ను రక్షించారు. దేవాన్ష్‌ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నాం. ఇప్పుడు వెంకటేశ్వరస్వామి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తాను.

.. సంపదను సృష్టించడం ముఖ్యం. ఆ సంపద పేదలకు అందాలి. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పేదరికం లేని సమాజం కోసం నిత్యం పని చేస్తాను. నేను అందరివాడిని.. ఐదు కోట్ల మందికి ప్రజాప్రతినిధిని. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. 

.. నేటి నుంచి ప్రజా పాలన మొదలైంది. రాజకీయం ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదు. మంచివారిని కాపాడుకోవాలి.. చెడ్డవారిని శిక్షించాలి. పరిపాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబెడతా. మా కుటుంబానికి నేనీమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా నిలవాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  

ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తిరుమల కొండపై రాజకీయాలు వద్దంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ అండ్‌ కో.. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు తొలి ప్రెస్‌ మీట్‌పై ఏం సమాధానం చెబుతాయో చూడాలి. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)