Breaking News

వైఎస్సార్‌సీపీ వాకౌట్‌.. అసెంబ్లీ రేపటికి వాయిదా

Published on Mon, 07/22/2024 - 09:22

సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ  గళం విప్పింది. ఆ పార్టీ చట్ట సభ్యుల నినాదాల మధ్యే సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నల్లకండువాలతో సభకు వచ్చిన సభ్యులు.. గవర్నర్‌ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్‌ డెమోక్రసీ’ నినాదాలు చేశారు. 

అయినా గవర్నర్‌ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగం ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించనున్నారు.  

పోలీసుల ఓవరాక్షన్‌
అంతకు ముందు.. లా అండ్‌ ఆర్డర్‌ ఘోర వైఫల్యంపై అసెంబ్లీకి జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్‌ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు.. ప్లకార్డుల్ని లాక్కునే యత్నం చేశారు. ఈ క్రమంలో అవి చినిగిపోవడంతో.. జగన్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది’’ అని అన్నారాయన. దీంతో చేసేది లేక పోలీసులు కండువాలతోనే సభ్యుల్ని లోపలికి అనుమతించారు.  

 

 


 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)