Breaking News

కేంద్ర ప్రభుత్వాన్ని రూ.6,880 కోట్లు అడిగాం

Published on Mon, 09/09/2024 - 06:20

సాక్షి, అమరావతి: వరద నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద వల్ల రాష్ట్రానికి రూ.6,880 కోట్ల నష్టం కలిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ మేరకు తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ కలెక్టరేట్‌లో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వినాయక చవితి రోజు బుడమేరు మూడో గండిని ఆర్మీ సాయంతో విజయవంతంగా పూడ్చినట్టు చెప్పారు. వరద వచ్చి వారం రోజులైనా తగ్గకపోవడంతో ప్రజలు ఆవేశంగా ఉన్నారని, శనివారం కూడా రాజరాజేశ్వరిపేటలో 4 అడుగుల నీరు ఉందని వ్యాఖ్యానించారు. 

రెండు రోజుల వర్షాలపై అప్రమత్తం చేశాం
రానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుండటంతో ఏలేరు రిజర్వాయర్‌ నిండి దిగువ ప్రాంతమైన పిఠాపురం పరిసర ప్రాంతాలకు వరద ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఏలేరు నదికి సోమ, మంగళ వారాల్లో 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఏలేరు రిజర్వ్‌యర్‌లో 21 టీఎంసీల నీరు ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బుడమేరు నుంచి వరద కొల్లేరుకు చేరుతుండటంతో నందివాడ మండలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద నీరు క్రమేపీ తగ్గుతోందని, వర్షాలు లేకపోతే సోమవారం సాయంత్రానికి మొత్తం నీరు లాగేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రానున్న 36 గంటల్లో ఎంత వర్షం నీరు వస్తుందన్న అంచనాలు వేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.

ఆపరేషన్‌ బుడమేరు
భవిష్యత్‌లో విజయవాడకు వరద భయం లేకుండా ఆపరేషన్‌ బుడమేరు చేపడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బుడమేరు చుట్టుపక్కల ఆక్రమణలు తొలగించి నీరు వేగంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బుడమేరు సామర్థ్యాన్ని 10–15 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)