Breaking News

‘సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపేశారు’

Published on Wed, 06/17/2026 - 14:34

సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్‌ స్టేషన్‌లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్‌బాడీని దహనం చేశారు. ఈ అంశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

సాయికృష్ణ మృతిపై గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ లాకప్ డెత్ చర్చనీయాంశమైంది. గాదె సాయి కృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చారు. నేను జనసేన కార్యకర్తను అని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన బాధ కలిగించింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపం ఇవ్వాలి. దేశంలోనే ఇటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ఎన్నో లాకప్ డెత్స్ జరిగాయి.కానీ ఇక్కడ చనిపోయితే శవాన్ని మాయం చేశారు. ఏపి పోలీస్ మర్డర్ చేసి శవాన్ని మాయం చేశారు.హెబియస్ కార్పస్ కేసు వేస్తే సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

సాయికృష్ణ మృతికి పోలీసులే కారణం
సాయికృష్ణ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేసి న్యాయం చేయండి.పవన్ కల్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను పవన్ కల్యాణ్.. ఎంక్వయిరీ వేయండి.మనం మానవులు అన్నది గుర్తించాలి. మర్డర్ చేసి కాల్చేయడం చట్టం చేసే పనా. తమిళనాడు ఘటన కన్నా ఘోరమైన ఘటన. చట్టప్రకారం ఉరిశిక్ష వేయాలి. సాయికృష్ణను లాకప్‌డెత్‌ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం చేయండి. సాయికృష్ణను దహనం చేసి ఉంటే కనీసం బూడిదనైనా ఇవ్వమని అతని తల్లి కోరుతోంది. సీబీఐ విచారణ కోరుతున్నా. లేదంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించండని అంబటి రాంబాబు కోరారు.  అనంతరరం సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ మీడియాతో మాట్లాడారు. 

 నవరంగ్, సాయి కృష్ణ మేనమామ  
సాయి కృష్ణ మృతిని పార్టికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఆ తల్లి బాధ చూసి అందరూ చలించిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి హత్య చేసి దహనం చేయడమా..సాధారణ వ్యక్తి చనిపోతే ఎవరూ స్పందించ కూడదా. ఆ తల్లి బాధ మరొకరికి రాకూడదు. .దారుణంగా చంపేశారు కాబట్టే న్యాయం చేయమని అడుగుతున్నాం.సాయి కృష్ణ మంచోడు కాదు. మరి మీరు హంతకులు కాదా’అని ప్రశ్నించారు.

కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే

వంగవీటి నరేంద్ర
మానవతా దృక్పధంతో స్పందించాం.వంగవీటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా హత్య చేశారు.సాయికృష్ణపై ఒక్క కేసు ఉన్నా బయట పెట్టాలి. తల్లి అడిగినట్లు మృతదేహం అన్నా ఇవ్వాలి లేకపోతే బూడిదన్న ఇవ్వాలి.హోంమంత్రి... సాయికృష్ణ హత్య గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)