Breaking News

23 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు

Published on Sat, 03/25/2023 - 11:12

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ స్థలం విషయంలో వచ్చిన కోర్టు తీర్పు సంచలనంగా మారింది. సినిమా రోడ్‌ సమీపంలోని అన్నభావు సాఠే విగ్రహం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వైపుగా వెళ్లే రోడ్డుకిరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ఈ స్థలం తమదేనంటూ గురువారం ప్లెక్సీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. రాణీసతీజీ కాలనీ సమీపంలోని సాయి పంచవటి హోటల్‌తో పాటు దానిని ఆనుకుని ఉన్న దుకాణాల స్థలం గతంలో సోమా గంగారెడ్డితో పాటు వారికి సంబంధించినదని అతడి తనయుడు సోమ రవి తెలిపారు. రికార్డుల్లో ఈ భూమి తమ పేరిటే ఉందని తెలిపాడు.

అయితే ఈ స్థలాన్ని గతంలో ఓ వైద్యుడు ఇతరులకు విక్రయించాడని, దీంతో తాము 23ఏళ్లుగా పోరాడుతున్నామని, తాజాగా ఈ భూమిపై అన్ని హక్కులు సోమ గంగారెడ్డి కుటుంబీకులకే ఉన్నట్లుగా కోర్టు ఇచ్చిందని తెలిపాడు. కోర్టు తీర్పు మేరకు 33 గుంటలతో కూడిన ఈ భూమిని తమ అధీనంలోకి తీసుకుని బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు.

దీంతో పాటు దిస్‌ ల్యాండ్‌ బిలాంగ్స్‌ టు సోమ గంగారెడ్డి అండ్‌ అదర్స్‌ అన్ని ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీనిని గమనించిన వాహనదారులు, పాదచారులు, షాపుల నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. షాపుల, హోటల్‌ నిర్వాహకులు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు పడడంతో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకూ బందోబస్తు చేపట్టారు.

Videos

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో అక్రమ కేసు బనాయింపు

IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!

మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!

YSRCP నేతలను చావబాదడమే నా టార్గెట్

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు

రైతులపై సోలార్ పిడుగు

కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

Photos

+5

'భైరవం' ప్రీ రిలీజ్ లో ఫ్యామిలీ తో సందడి చేసిన మంచు మనోజ్ (ఫొటోలు)

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)