Breaking News

బిగ్‌బాస్ 10: వంశీ ఎలిమినేట్.. త్రిగుణ్‌కి వార్నింగ్

Published on Sun, 11/29/2026 - 01:37

బిగ్‌బాస్ 10వ సీజన్ దాదాపు చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో హోస్ట్ నాగార్జున షాకిచ్చాడు. ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి వంశీని బయటకు పంపేశాడు. అమన్, ముకేశ్‌కి నాగ్ ఇచ్చిపడేశాడు. త్రిగుణ్-వర్షిణి గొడవని సెటిల్ చేశాడు. ఇంతకీ బిగ్‌బాస్ హౌస్‌లో 83వ రోజైన శనివారం(నవంబర్ 28) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?

వీకెండ్ కావడంతో హౌస్‌లోకి వచ్చిన నాగార్జున.. ఈ వారం ఆట గురించి జడ్జిమెంట్ ఇస్తూనే ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడు. హౌస్‌లోని ప్రస్తుత పరిస్థితి గురించి నాగ్ అడిగిన ప్రశ్నకు వర్షిణి కన్ఫెషన్ రూమ్‌లో ఎమోషనల్ అయిపోయింది. ఈ వారం ఏం జరిగిందని నాగార్జున అడగ్గా తొమ్మిది మంది ఒకవైపు, ఇద్దరం ఒకవైపు ఉన్నట్లుగా అనిపిస్తోందని.. గ్యాంగ్‌గా ఏర్పడ్డారని, తమకు సపోర్ట్ రావడం లేదని బాధపడింది. ఏ విషయంలో అలా జరిగిందని ప్రశ్నించగా.. క్యారెక్టర్ విషయంలోనే ఆ పాయింట్ వచ్చిందని వర్షిణి చెప్పింది.

త్రిగుణ్ ఏమన్నాడని నాగార్జున అడగ్గా.. "చీప్ క్యారెక్టర్ నీది" అని ముఖం మీదే అన్నాడని, ఏ ఉద్దేశంతో అన్నాడో తెలీదు కానీ అన్నాడని వర్షిణి ఏడుస్తూ చెప్పింది. ఫ్రెండ్‌షిప్ విషయంలో అన్నానని తర్వాత వివరణ ఇవ్వలేదా అని నాగార్జున అడగ్గా, ఫ్రెండ్‌షిప్ విషయంలో అన్నానని చెప్పలేదని వర్షిణి సమాధానం ఇచ్చింది. వీడియో ఫుటేజ్ ప్లే చేసిన తర్వాత త్రిగుణ్ ఏ ఉద్దేశంతో అన్నాడో క్లారిటీ వచ్చిందా అని నాగ్, వర్షిణిని అడిగాడు.  త్రిగుణ్‌ని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగ్.. ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇవ్వని క్యారెక్టర్ అని తను గురించి నువ్వు అనుకున్నట్లే, తను కూడా సరిగ్గా అదే అనుకుందని చెప్పాడు. అందువల్ల నీ దగ్గర నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణ కావాలని నాగార్జున అన్నాడు.

కెప్టెన్ అమన్‌తో మాట్లాడిన నాగ్..కెప్టెన్ అయిన తర్వాత కొంచెం కంట్రోల్ తప్పిందా అని సీరియస్ అయ్యాడు. మనిషి క్యారెక్టర్ టాప్ పొజిషన్‌లో, చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడే తెలుస్తుందని, ఆ ప్రవర్తన ఏంటో అదే ఒరిజినల్ క్యారెక్టర్ అని నాగార్జున అన్నాడు. వీడియో వేసి మరీ అమన్ చేసిన పనులను ఎత్తి చూపించాడు. ముకేశ్‌ని రకరకాల పేర్లతో పిలవడం గురించి చెబుతూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. తర్వాత ముకేశ్ బట్టలని త్రిగుణ్.. స్విమ్మింగ్ పూల్ వేసిన విషయం గురించి చర్చించిన నాగార్జున.. చివరకు ముకేశ్‌కి క్లాస్ పీకాడు. నిన్ను బోలెడంత మంది ఇష్టపడేవాళ్లు ఉన్నారు. కానీ నువ్వు ఆడే తీరు, ప్రవర్తన కారణంగా వాళ్లకు నీపై ఇష్టం పోతుంది. నీ స్టార్‌డమ్ కూడా పోతుందని హెచ్చరించాడు.

స్నేక్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారని నాగార్జున అడగ్గా అమన్.. త్రిగుణ్ పేరు చెప్పాడు. బాగా ఆడింది త్రిగుణ్ అయితే ఆర్కే ఎలా గెలిచాడని ప్రశ్నించాడు. కింద పడ్డ బాక్స్ గుంజుకోవచ్చు, లాక్కోవచ్చు అని అమన్ చెప్పాడు. కింద పడిన తర్వాత కదా దాని దగ్గరికి వెళ్లాలని నాగార్జున వీడియో చూపించగా.. తగిలింది సార్ అని అమన్ చెప్పాడు. బాక్స్ పడిన తర్వాత తీసుకోవాల్సింది అని అన్నాడు.

ఈ డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన నాగార్జున.. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పి షాకిచ్చాడు. నామినేషన్లలో ఉన్న వర్షిణి, ముకేశ్, త్రిగుణ్, రామకృష్ణ, వంశీ, రాంప్రసాద్, దేబ్జానీ వరసగా నిలబడగా వాళ్ల ముందు కొన్ని బాక్సులు పెట్టారు. వీటిని పగలగొట్టినప్పుడు అందులో ఎవరి బాక్సులోని అక్షరాలతో ఎక్సిట్(EXIT) పదం పూర్తవుతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు అని నాగ్ చెప్పాడు. అలా వంశీ ఎలిమినేట్ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన తర్వాత వంశీ, నాగార్జునతో మాట్లాడుతూ నా కూతురిని కలిసినట్లు ఉదయమే కల వచ్చింది. అదే ఇప్పుడు నిజం కాబోతుందని అన్నాడు. తన ఫ్రెండ్ త్రిగుణ్‌తో టీవీలో మాట్లాడుతూ.. కప్పు కొట్టి తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అని అన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)