Breaking News

మట్టిలో మాణిక్యం.. ఒక్క పాటతో ఫేమస్‌..

Published on Sat, 11/28/2026 - 16:42

తెలంగాణ పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్రబృందం ‘ఉల్లపూల’ అనే పాటను విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే తన గొంతుతో ఆకట్టుకున్న గాయని ఎవరు? అంటూ నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు.

నల్గొండకు చెందిన హెనాగ్రేస్‌
 ఈ పాటను ఆలపించింది నల్గొండకు చెందిన హెనాగ్రేస్‌. అభినయ శ్రీనివాస్‌ ఈ పాటకు సాహిత్యం అందించగా.. హెనాగ్రేస్‌ తన మధురమైన గొంతుతో ప్రాణం పోశారు. ఆమె గాన ప్రతిభపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ప్రశంసలు కురిపించారు. ‘హెనాగ్రేస్‌ తెలంగాణ మట్టిలోని మాణిక్యం. నిజానికి ఈ పాటను పెద్ద సింగర్‌తో పాడించాలని అనుకున్నాం. కానీ సురేశ్‌ ఈ అమ్మాయి గురించి చెప్పి.. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో నేను కూడా అంగీకరించాను. ఆమె పాట రికార్డింగ్‌ పూర్తయిన తర్వాతే నేను విన్నాను. విన్న వెంటనే అద్భుతంగా అనిపించింది.

తన గొంతులో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పాట కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ అమ్మాయి కోసమైనా ఈ పాటను మరింతగా ప్రమోట్‌ చేస్తాను’ అని బన్నీ వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెనాగ్రేస్‌తో స్టేజీ పైనే పాడించారు. ఆమె గాత్రానికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. పాట పూర్తికాగానే చప్పట్లతో అభినందనలు తెలిపారు. 

(ఇదీ చదవండి: అరవింద్‌ గారు.. నా కోరిక తీర్చండి: డైరెక్టర్‌ రాజమౌళి)


 

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)