Breaking News

ఇరుముడికి వందరోజులు.. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్

Published on Thu, 11/26/2026 - 13:32

ఇరుముడి మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.  ఈ ఏడాది ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

అయితే ఈ సినిమా రిలీజై ఈనెల 28కి వంద రోజులు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. అదే రోజు రాత్రి అభిమానుల కోసం ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ షోస్‌లో ఇరుముడి పాటలను రెండుసార్లు ప్లే చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రి థియేటర్స్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఈ ప్రత్యేక షోలను బాలానగర్‌లోని మైత్రి విమల్, దిల్‌సుఖ్‌నగర్‌లో మైత్రి గంగాలో వేయనున్నారు.

ముఖ్యంగా ఇరుముడి సాంగ్స్ ఆడియన్స్‌కు థియేటర్లలో పూనకాలు తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలకు థియేటర్స్‌ దద్దరిల్లిపోయాయి. తాజాగా మరోసారి ఇరుముడిని బిగ్‌ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కనుంది.  కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ మెప్పించింది. ఈ మూవీలో సాయి కుమార్ కీలక పాత్రలో మెరిశారు.   ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా  తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
 

 

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)