5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
90 కిలోల నుంచి 76 కిలోలకు..! ఫ్లాట్‌లోనే రోజూ జస్ట్ వాకింగ్‌తో..
Published on Thu, 11/26/2026 - 11:32
బరువు తగ్గడం అనేది ఏమి క్లిష్టమైన టాస్క్ కాదని నిరూపించింది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ర్. అందుకోసం జిమ్ మెంబర్ షిప్, కసరత్తులతో పనిలేదని, కేవలం నిలకడ తగ్గాలనే బలమైన ఇంటెన్షన్ చాలని అంటోంది. అంతేగాదు జస్ట్ నడకతో కిలోల కొద్దీ తగ్గి..స్లిమ్‌గా మారిందామె. అది కూడా 2బీహెచ్‌కే ఫ్లాట్‌లో దొరికిన ఆ కాస్త ప్రదేశంలో చేసని వాకింగ్‌తోనే బరువు తగ్గడం విశేషం. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!
ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంబికా సాగర్‌కు తన సొంత డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లోనే ప్రతి రోజు 20 వేల అడుగులు నడిచి ఏకంగా 14 కిలోలు బరువు తగ్గినట్లు వెల్లడించింది. తనకు అందుబాటులో ఉన్న స్థలాన్ని ఉపయోగించుకునే బరువు తగ్గినట్లు తెలిపింది. తానేమి ట్రెడ్మిల్, ఖరీదైన పరికరాలు లేదా రెగ్యులర్ జిమ్ సెషన్లపై ఆధారపడలేదన్నారు. తాను ఒకప్పుడు 90 కేజీల బరువు ఉన్నప్పుడు ధరించిన టీషర్ట్‌లో ఉన్న ఆకృతికి 76 కేజీలు చేరుకున్నప్పుడూ కనిపించిన లుక్‌కి మధ్య ఎంతో అంతరం..మార్పు ఉందని, అది చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.
ఇదంతా కేవలం నిలకడ, సహనం వల్లే ఈ పరివర్తన సాధ్యమైందని పేర్కొంది. ప్రతిరోజూ 20 వేల అడుగులు నడవడం అనేది తన బరువు తగ్గే ప్రయాణంలో అతిపెద్ద గేమ్ ఛేంజర్ అని చెప్పుకొచ్చిందామె. కొన్నిసార్లు సరళమైన అలవాట్లు నిలకడగా చేస్తే..అద్బుతం సృష్టిస్తుందని అంటోంది. తన దృష్టిలో బరువు తగ్గడం అంటే పస్తులుండటం కాదని, నిలకడ, క్రమశిక్షణ , చక్కటి జీవనశైలి మార్పులేనని అంటోందామె.
తను బరవు తగ్గడంలో కేవలం నడక మాత్రమే గాక, ఆలోచనాత్మకంగా తినడం, కేలరీల లోటు తోపాటు నడవడం తదితరాలు అది పెద్ద సాధానంగా మారి స్లిమ్‌గా మారేందుకు ఉపకరించాయని తెలిపింది. చివరగా ఆమె సాకులు చెప్పకుండా..ప్రారంభించాలనే చురుకుతో ముందుకు సాగితే బరువు తగ్గి చక్కటి ఆత్మవిశ్వాసంతో ముందుకు రాగరని నమ్మకంగా చెబుతోందామె..
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇదీ చదవండి: చదువురాని ఇంట పుట్టిన శాస్త్రవేత్త..! ఏకంగా రక్త ప్రవాహ గణితాన్నే శాసిస్తోంది!
Tags : 1