Breaking News

బిగ్‌బాస్ హౌస్‌లో డీమాన్ పవన్, రీతూ.. ఇలా షాకిచ్చారేంటి?

Published on Thu, 11/26/2026 - 08:02

ప్రస్తుతం బిగ్‌బాస్ 12వ వారానికి చేరుకుంది. ఈ వీక్‌లో దశవతారంలో భాగంగా బడ్డీ అప్‌ అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి తీసుకొస్తున్నారు. అలా తొలిరోజు ఇమ్ము, సంజనా, కల్యాణ్, దివ్య వచ్చివెళ్లారు. వీరితో హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో గేమ్స్ ఆడించారు. ఇందులో గెలిచినవాళ్లను కెప్టెన్ కంటెండర్‌ రేసుకు అర్హత సాధించారని బిగ్‌బాస్ ప్రకటించాడు.

బడ్డీ అప్‌లో భాగంగా రెండో రోజు కూడా మరో నలుగురు మాజీ కంటెస్టెంట్స్‌ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ సారి మొదట హౌస్‌లో డీమాన్ పవన్, రీతూ చౌదరిని తీసుకొచ్చారు. వీరితో హౌస్‌లోని ముకేశ్, దేబ్జానీలతో గేమ్ ఆడించారు. ముకేశ్, రీతూ ఒకవైపు, డీమాన్ పవన్, దేబ్జానీ ఓ వైపు నిలిచారు. ఈ టాస్క్‌లో సంచాలక్‌గా త్రిగుణ్ వ్యవహరించాడు. ఈ గేమ్‌లో రూల్స్ పాటించవేదని ముకేశ్‌ను సంచాలక్‌ కడిగిపారేశాడు. ఈ టాస్కులో చివరకు దేబ్జానీ, పవన్ గెలిచారని సంచాలక్ త్రిగుణ్ ప్రకటిస్తాడు. అయితే ఇటీవల పవన్, రీతూ చౌదరి బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిని ఓకేసారి హౌస్‌లో పంపించి అందరికీ షాకిచ్చాడు బిగ్‌బాస్. 

ఆ తర్వాత ఇంట్లోకి టేస్టీ తేజ, శోభా శెట్టి ఎంట్రీ ఇస్తారు. ఫ్రెండ్ షిప్‌ని కంటిన్యూ ఎవరితో చేస్తారో వారి బ్యాండ్‌ ఇవ్వాలి.. ఎవరితో కట్ చేస్తారో వారి చేతికి ఉన్న బ్యాండ్‌ను కట్‌ చేయాలని బిగ్‌బాస్ చెప్తాడు. ఇందులో త్రిగుణ్ వచ్చి.. వంశీతో కంటిన్యూ చేస్తా.. వర్షిణితో కట్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ముకేశ్ వచ్చి.. వర్షిణితో కంటిన్యూ సుధీర్‌ను కట్ చేస్తానంటాడు. దేబ్జానీ నరేశ్‌తో ఫ్రెండ్‌షిప్‌ కంటిన్యూ చేస్తానని చెబుతుంది.

ఆ తర్వాత శోభా శెట్టి- అమన్, నరేశ్- టేస్టీ తేజ పెయిర్‌గా ఓ గేమ్ ఆడతారు. ఈ టాస్క్‌లో సంచాలక్‌గా వర్షిణిని పెడతారు. అయితే ఈ టాస్క్‌లో సంచాలక్ వర్షిణి తీరుపై అమన్, శోభా ఫైరవుతారు. ప్రతిసారి బాల్‌ను నరేశ్ వైపు వేయడమేంటని నిలదీస్తారు. కానీ వర్షిణి మాత్రం నరేశ్‌ టీమ్‌కు ఫేవర్‌గానే చేస్తుంది. కానీ చివరకీ ఈ టాస్క్‌లో అమన్, శోభానే విన్ అవుతారు. దీంతో వర్షిణిపై అమన్‌ మరోసారి ఫైరవుతాడు. వర్షిణి అన్‌ ఫెయిర్ సంచాలక్ అంటూ గట్టిగా అరుస్తాడు. అలా ఇవాల్టి ఎపిసోడ్‌ ముగుస్తుంది.
 

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)