Breaking News

ఓటీటీకి ఆదర్శకుటుంబం.. అఫీషియల్ ప్రకటన

Published on Wed, 11/25/2026 - 07:51

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- హీరో వెంకటేశ్‌ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం-ఏకే47’. ఈ మూవీ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన తొలి రోజే ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ చిత్రంలో వెంకీ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడయన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తోన్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈనెల 27 నుంచే స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఏకే47 కథేంటంటే..

చిట్టిబాబు(వెంకటేశ్‌) ప్రైవేటు ఎంప్లాయ్. భార్య స్వర్ణ(శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారం పేరుతో అప్పులు చేస్తూ ఉంటుంది.  అప్పు కట్టలేక ఇంటి నుంచి బయటకి రాదు.  కాలేజీ చదువుతున్న  కూతురు సంపూర్ణ (యువీనా) .. బైక్ మెకానిక్...ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళతో ప్రేమలో పడుతూ..నాన్నకి తల నొప్పి తెప్పిస్తుంది.  మరోవైపు కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్‌)కు చదువు రాదు. గుండె సమస్యతో బాధ పడుతూ ఉంటాడు. ఆపరేషన్ కి రూ. 2 లక్షలు అవుతుంది అని డాక్టర్లు చెబుతారు.

ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిట్టి బాబుకు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. అప్పులను ఎలా తీర్చాలి? అని బాధపడుతున్న సమయంలో రూ. 100 కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు చేతికి రాకముందుకే చిట్టిబాబు ఫ్యామిలీ ఒక విల్లాకు షిఫ్ట్ అవుతుంది.  రూ.వందకోట్లు వచ్చాయనే సంగతి తెలిసి హత్యలు చేసి ఉన్న డబ్బంతా తీసుకెళ్ళే బీహార్ గ్యాంగ్ చిట్టిబాబు ఇంటిని టార్గెట్ చేస్తుంది. కారు డ్రైవర్ గా, పని మనిషిగా చేరి డబ్బులు ఇంటిని వచ్చిన రాత్రి ఎటాక్ చేస్తారు. బిహార్ గ్యాంగ్ మంచి ఫ్యామిలీని కాపాడుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? అసలు అతని గతమేంటి?   రూ.100 కోట్ల   లాటరీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? చిట్టి బాబు ఇంటిపై దాడికి వచ్చిన బిహారీ గ్యాంగ్ కనిపించకుండా పోవడానికి గల కారణం ఏంటి?  ఎస్పీ (నారా రోహిత్) ఈ కేసును ఎలా డీల్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)