బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..
Breaking News
ఆయన కాళ్లు మొక్కిన హీరోయిన్ తమన్నా.. వీడియో వైరల్
Published on Mon, 11/23/2026 - 11:10
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది ది వాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ సెప్టెంబర్లో విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 91.49 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ఈ ఏడాదిలో ఓదెల-2 చిత్రంలోనూ కనిపించింది.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబయిలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు ఫోటో వ్యాసాల పుస్తకం 'డిసప్పియరింగ్ ఫేసెస్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంది. ఈ ఈవెంట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్కు హాజరైన తమన్నా.. సద్గురు పాదాలకు మొక్కింది.
ఆయనపై పాదాలకు నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. తమన్నా గతంలో శివునిపై తనకున్న భక్తి గురించి.. కోయంబత్తూర్లోని సద్గురు ఇషా యోగా కేంద్రాన్ని సందర్శించడం గురించి పలు సందర్భాల్లో మాట్లాడింది. మహా శివరాత్రి వేడుకల్లో కూడా తమన్నా పాల్గొన్నారు. ప్రస్తుతం తమన్నా ది వాన్ సీక్వెల్లో నటించనున్నారు.
Tags : 1