శివుడి త్రిశూలంపై.. నిలిచిన నగరం!

Published on Mon, 11/23/2026 - 09:08

‘ప్రపంచ చరిత్రలో తొలి నగరంగా..  నాగరికత ఉన్నంత వరకు ఉండే చివరి నగరంగా నిలవనుంది’ అని చెప్పే గొప్ప ప్రదేశమే కాశీ. దీనికి మోక్షాన్ని ప్రసాదించే నగరం అని కూడా అంటారు.అందుకే సనాతన ధర్మాన్ని ఆచరించే చాలా మంది తమ జీవితంలో ఒక్కసారి అయినా ఇక్కడికి వెళ్లాలి అని కోరుకుంటారు. వారణాసిగానూ పేరొందిన కాశీ పర్యటన కార్తీకమాసంలో మరింత ప్రత్యేకతను నింపుకుంటుంది.

ఇక్కడ సమయం ఎక్కువగా హడావుడి చేయదు. గంటల చప్పుడు, గంగ హారతి మంత్రాలు, సన్నని గల్లీల మధ్య నెమ్మదిగా సాగే జీవితం... కాశీలో కాలం కాస్త నెమ్మదిగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. దీన్నే కాశీ టైమింగ్‌ అని కూడా అంటారు.

88 ఘాట్లు..
భారతదేశపు ఆధ్యాత్మిక హృదయంలో, గంగానది ఒడ్డున ఉన్న కాశీ 88 ఘాట్లతో కూడిన మోక్ష నగరం. కాశీ విశ్వనాథ్, దశాశ్వమేధ్‌ ఘాట్, మణికర్ణిక ఘాట్‌ వంటి ప్రదేశాలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఆధ్యాత్మిక చరిత్ర, ఘాట్లు, సన్నని గల్లీలు, బనారస్‌ సంస్కతి కలిసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాయి. అందుకే కాశీ యాత్ర కేవలం టెంపుల్‌ టూర్‌గా మిగిలిపోదు. ఒక కంప్లీట్‌ అనుభూతిగా మిగిలిపోతుంది.

సందర్శనీయ ప్రదేశాలు

  • కాశీ అసలు ప్రయాణం అనేది ఘాట్ల నుంచే మొదలవుతుంది. కాశీకి గుండె లాంటిది దశాశ్వమేధ్‌ ఘాట్‌. సాయంత్రం ఇక్కడ జరిగే గంగా హారతి చూడటం ఒక మర్చిపోలేని అనుభవం. వందలాది దీ΄ాలు, శంఖనాదాల మధ్య గంగమ్మకు హారతి ఇస్తుంటే ఆ క్షణం మనసు పూర్తిగా అక్కడే ఉండిపోతుంది.

  • దీనికి దగ్గరలోనే కాశీ విశ్వనాథ్‌ ఆలయం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయం కొత్త కారిడార్‌ తరువాత మరింత విశాలంగా, దివ్యంగా మారింది. విశ్వనాథుడి దర్శనం తరువాత గల్లీల్లో నడుస్తూ బయటకు వస్తే చిన్న చిన్న దుకాణాలు, చాయ్‌ బండీలు, స్థానికుల జీవన విధానాన్ని గమనించవచ్చు.

  • మణికర్ణిక ఘాట్‌ కాశీకి మరో కోణాన్ని చూపిస్తుంది. ఇక్కడ 24 గంటలూ చితి మంటలు వెలుగుతూనే ఉంటాయి. చావు, బతుకులు ఒకే చోట కనిపించే ప్రదేశం ఇది. ఇక్కడ నిశ్శబ్దంగా నిలబడితే జీవితంలో గతంలో ఎప్పుడూ కలగని ఆలోచనలు వస్తాయి.

  • సారనాథ్‌ కాశీకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుద్ధుడు మొదటిసారి ధర్మోపదేశం చేసిన ప్రదేశం ఇదే. ఇక్కడి ధమేక్‌ స్థూపం, మ్యూజియం, బౌద్ధ ఆరామాలు దర్శించుకోవచ్చు.

ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుంచి కాశీకి డైరక్ట్‌ విమానాలు ఉన్నాయి. శంషాబాద్‌ నుంచి లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇంటర్నేషనల్‌ ఎయిర్పోర్ట్‌ (వారణాసి) కి కేవలం 2 గంటల 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇండిగో, స్పైస్జెట్‌ సంస్థలు రోజూ డైరక్ట్‌ ఫ్లైట్స్‌ నడుపుతున్నాయి.

  • తక్కువ బడ్జెట్లో వెళ్లాలి అనుకుంటే ట్రైన్‌ బెస్ట్‌ ఆప్షన్‌. హైదరాబాద్‌ లోని సికింద్రాబాద్, కాచిగూడ నుంచి గంగా కావేరి, దానాపూర్‌ ఎక్సŠప్రెస్‌ వంటి రైళ్లు వారణాసి వరకు ఉన్నాయి. ప్రయాణ సమయం సుమారు 24 నుంచి 30 గంటలు పడుతుంది.

  • విజయవాడ నుంచి వచ్చేవారు విజయవాడ జంక్షన్‌ నుంచి డైరక్ట్‌ ట్రైన్‌ ఎక్కవచ్చు లేదా హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి ఫ్లైట్‌ క్యాచ్‌ చేయవచ్చు. వారణాసి ఎయిర్పోర్ట్‌ నుంచి నగరంలోకి క్యాబ్, ఆటోలు ఉంటాయి. ఘాట్ల మధ్య తిరగడానికి ఈ రిక్షా, పడవ ప్రయాణం ఈ యాత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

ఎక్కడ ఉండాలి?

  • దశాశ్వమేధ్‌ ఘాట్, అస్సీ ఘాట్‌ చుట్టూ గంగకు దగ్గరగా ఉండే హోటళ్లు గెస్ట్‌ హౌజ్‌లు, హోమ్‌ స్టేలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదయం బాల్కనీ తలుపు తెరిచినప్పుడు ముందుగా గంగమ్మను దర్శించుకోవడం,  దూరంగా పడవలు వెళ్లడం చూడటం ఒక స్పెషల్‌ అనుభూతిగా మిగిలిపోతుంది.

  • కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అస్సీ ఘాట్‌ వైపు ఉండే హోటళ్లు, హాస్టళ్లు బెస్ట్‌. లగ్జరీ కావాలి అనుకుంటే రవిదాస్‌ ఘాట్‌ దగ్గర ఉన్న తాజ్, బ్రిజ్‌ రామా ప్యాలెస్‌ వంటి హెరిటేజ్‌ హోటళ్లు ఉన్నాయి.

ఏం తినాలి?

  • కాశీ ఫుడ్‌ అక్కడి సంస్కృతిని రిప్రెసెంట్‌ చేస్తుంది. ఇక్కడి వంటకాల్లో దేశీ ఘీ, చాట్‌ ఫ్లేవర్‌ ఎక్కువగా కనిపిస్తుంది.

  • ఉదయాన్నే కచోరీ సబ్జీ, జిలేబీతో మొదలు పెట్టాలి. మధ్యాహ్నం బనారసీ థాలీ, లస్సీ ట్రై చేయవచ్చు. ఇక్కడి ΄ాపులర్‌ డిష్‌ మలైయో.. చలికాలంలో మాత్రమే దొరికే  స్వీట్‌ ఇది.

  • ఇక బనారస్‌ ΄ాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘాట్‌ పక్కన కూర్చుని వేడి వేడి చాయ్‌ తాగిన తరువాత బనారసీ ΄ాన్‌ వేసుకోవడం ఒక కంప్లీట్‌ కాశీ ఫీలింగ్‌ ఇస్తుందంటారు..

 ఏం చూడాలి?

  • కాశీలో చూడాల్సింది కేవలం గుడి మాత్రమే కాదు. తెల్లవారుజామున 5 గంటలకు గంగపై పడవలో తిరుగుతూ సన్‌రైజ్‌ చూడటం కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఐకానిక్‌ ఎక్స్పీరియెన్స్‌. ఒక పక్కన చీకటి, మరో పక్కన ఘాట్లలో వెలిగే దీ΄ాలు, పూజలు చేసే జనంం ఇదంతా ఒక సినిమా సీనులా అనిపిస్తుంది.

  • సాయంత్రం గంగా హారతి తరువాత గల్లీల్లో నడవడం, విశ్వనాథ్‌ గల్లీలో షాపింగ్‌ చేయడం, సారనాథ్లో బుద్ధుడి జాడలను వెతకడం ఇవన్నీ థ్రిల్లింగ్‌ కలిగిస్తాయి.లా డిగ్యూలో సైకిల్‌ ఎలాగో, కాశీలో సైకిల్‌ రిక్షా, నడక అలాంటిది. సన్నని గల్లీల్లో తప్పిపోవడం కూడా ఇక్కడ మంచి విషయంలా అనిపిస్తుంది.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు
కాశీలో మూడు రోజులు ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే బడ్జెట్‌ అనేది మీ స్టే అండ్‌ ట్రావెల్‌ విధానాన్ని బట్టి మారుతుంది. హైదరాబాద్‌ నుంచి రిటర్న్‌ ఫ్లైట్‌ టికెట్‌ సీజన్‌ బట్టి రూ..7 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది.

  • ట్రైన్‌ అయితే స్లీపర్‌ కి రూ..800 నుంచి, 3ఎసి కి రూ..2200 వరకు ఉంటుంది.

  • అక్కడ హోటల్స్‌ చాలా రీజనబుల్‌. బేసిక్‌ గెస్ట్‌ హౌస్‌ లేదా ధర్మశాలకి రోజుకి రూ. 800 నుంచి రూ..1500 అవుతుంది. స్టాండర్డ్‌ 3 స్టార్‌ హోటల్స్‌ కి రూ..2500 నుంచి రూ.4500, ప్రీమియం హెరిటేజ్‌ హోటల్‌ కి రోజుకి రూ. 8000 నుంచి మొదలవుతుంది.

  • ఫుడ్‌ కోసం రోజుకి సగటున రూ..800 నుంచి రూ..1200 బడ్జెట్‌ పెట్టుకోవాలి. పడవ ప్రయాణం, ఆటోలు, విశ్వనాథ్‌ దర్శనం, సారనాథ్‌ ఎంట్రీ కలిపి మరో రూ..2000 వరకు అవుతుంది.

  • మొత్తంగా మూడు రోజుల ట్రిప్‌ కి ఒక్కొక్కరికి బడ్జెట్‌లో ప్లాన్‌ చేస్తే రూ.8 వేల నుంచి రూ..12 వేలు, స్టాండర్డ్‌ వసతులతో రూ..15 వేల నుంచి రూ. 22 వేల వరకు ఖర్చవుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ ప్రయాణ ఖర్చు దీనికి అదనం.

ఆసక్తికరమైన విషయాలు..

  • కాశీ ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా నివసిస్తున్న నగరాల్లో ఒకటి. 5000 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు.

  • వారణాసి అనే పేరు వరుణ, అసి అనే రెండు నదుల నుంచి వచ్చింది.

  • మణికర్ణిక ఘాట్లో చితి ఎప్పుడూ ఆరదు. శివుడే ఇక్కడ మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.

  • బనారస్‌ హిందూ యూనివర్సిటీ ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌ యూనివర్సిటీల్లో ఒకటి.

– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

ఇదీ చదవండి: అపార సంపద ఉన్నా.. అనుభవించేవారు లేరని కన్నీళ్లు!

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)