Breaking News

ఎన్విడియా సీఈఓ వివాదం.. వెలుగులోకి మరో సంచలన విషయం!

Published on Thu, 11/12/2026 - 08:05

గ్లోబల్ టెక్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే.. అలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా తన కంపెనీలోనే పనిచేస్తున్న మరో మహిళా ఉన్నతాధికారి 'కింబర్లీ పావెల్‌'తో కూడా ఆయనకు సంబంధం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.

ఎవరీ కింబర్లీ పావెల్‌
48 ఏళ్ల కింబర్లీ పావెల్ 2008లో ఎన్విడియాలో చేరారు. ప్రస్తుతం కంపెనీ హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెడికల్ ఇమేజింగ్, ఔషధాల పరిశోధన వంటి విభాగాల్లో ఎన్విడియా సాంకేతికతను విస్తరించే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ 2017 చివరి నాటికి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆమె నేరుగా జెన్సన్ హువాంగ్‌కు రిపోర్ట్ చేసే సుమారు 60 మంది ఉన్నతాధికారుల్లో ఒకరు కావడం గమనార్హం.

ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని శాన్‌జోస్‌లో జరిగిన ఎన్విడియా వార్షిక టెక్నాలజీ సమావేశం జీటీసీలో కింబర్లీ పావెల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సమీపంలోని ఒక హోటల్‌లో జెన్సన్ హువాంగ్, కింబర్లీ పావెల్ సన్నిహితంగా మెలిగినట్లు.. ఈ వ్యవహారాన్ని అక్కడున్న ఒక వ్యక్తి కెమెరాలో చిత్రీకరించగా, హువాంగ్ భద్రతా సిబ్బంది అతనితో రహస్య ఒప్పందం (NDA)పై సంతకం చేయించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

అలిస్ హువాంగ్‌తో సంబంధం
కాగా.. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ డేటా సెంటర్ సంస్థలో పనిచేస్తున్న ఆలిస్ హువాంగ్‌తోనూ జెన్సన్‌కు సంబంధం ఉన్నట్లు.. 2024, 2025లో వీరిద్దరూ తైవాన్‌లో కలిసి కనిపించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.

అంతేకాకుండా.. అలిస్ హువాంగ్‌కు చైనా ప్రభుత్వ నిఘా సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు కంపెనీ ఉద్యోగులకు పంపిన సందేశంలో అంగీకరించారు.

ఈ వరుస పరిణామాలతో ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ నాయకత్వంపై చర్చ మొదలైంది. ఆయన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు కంపెనీ బోర్డు సమావేశం కావడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. మరోవైపు, ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని పెట్టుబడిదారులకు వెల్లడించలేదని ఆరోపిస్తూ హువాంగ్, ఎన్విడియా కంపెనీపై వాటాదారులు క్లాస్ యాక్షన్ దావా వేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఆయనను పదవి నుంచి తొలగించాలని బోర్డు నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.

ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా లేకున్నా నగదు బదిలీ

#

Tags : 1

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)