బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Breaking News
బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్
Published on Mon, 11/09/2026 - 09:21
వీకెండ్ అండే ఫన్ మోడ్ ఉంటుంది. అందుకు తగ్గట్లే హోస్ట్ నాగార్జున.. బిగ్‌బాస్ 10 హౌస్‌మేట్స్‌కి పెద్ద సర్‌ప్రైజే ఇచ్చాడు. ఇక నరేశ్ కోసం హౌసులో ఉన్నోళ్లంతా త్యాగం చేయగా.. ముకేశ్ మీద వర్షిణి అలిగింది. ఇంతకీ 63వ రోజైన ఆదివారం(నవంబర్ 08) ఏం జరిగింది?
(ఇదీ చదవండి: కుమారుడితో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్)
దీపావళికి తోడు వీకెండ్ కలిసొచ్చింది. అలా ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. దేబ్జానీ, ముకేశ్ గొడవకు ఓ ముగింపు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే శివ్ తన చుట్టూ తిరుగుతున్నాడని ముకేశ్ అనడం నచ్చలేదని దేబ్జానీ చెప్పగా.. నల్ల కోతి అని శరీర రంగుని ఉద్దేశించి దేబ్జానీ అనడం తప్పు కదా అని ముకేశ్ అన్నాడు. దీంతో వీడియో ప్లే చేసి చూపించిన నాగ్. కావాలని దేబ్జానీ అనలేదు కానీ అనడం తప్పే. నువ్వు కూడ అలా అనడం తప్పే. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండని అన్నారు. తర్వాత ముకేశ్.. నామినేషన్ల నుంచి సేవ్ అయినట్లు ప్రకటించారు.
నో పాజ్ ఓన్లీ ఆన్సర్ అనే టాస్క్ పెట్టగా అందులో ముకేశ్ జట్టు గెలుస్తుంది. తర్వాత నరేశ్, రాంప్రసాద్ సేఫ్ అయినట్లు నాగ్ చెప్పారు. బీబీ సినిమా అని మరో టాస్క్ పెడతాడు. ఇందులో భాగంగా ఒకరి గురించి మరొకరు చెప్పుకొన్నారు. ఇది పూర్తయిన తర్వాత వర్షిణి సేఫ్ అని నాగ్ చెప్పాడు. బ్రేక్ టైంలో నీతూ-రామకృష్ణ గొడవ పడ్డారు. నామినేషన్స్‌లో నేనే కనిపిస్తున్నా. ఇక్కడ కూడా నా ఫొటోనే పెట్టాలా? నేనే నీకు కనిపిస్తున్నానా? నీకు రక్త కన్నీరు అంటే ఏంటో చూపిస్తా అని రామకృష్ణని నీతూ బెదిరించింది. తర్వాత వచ్చిన నాగ్.. రామకృష్ణ, వర్షిణి, నరేశ్‌లకు ఫ్యామిలీ వీక్ రావడం లేదని, ఇంట్లోని సభ్యులు సపోర్ట్ చేస్తే ముగ్గురిలో ఒకరికి ఫ్యామిలీ వస్తుందని నాగ్ చెప్పగా.. అయితే దీనికోసం వాళ్లముందున్న దానిలో మీ వస్తువులు వేయాలి. వేసిన తర్వాత అవి తిరిగి రావని అన్నాడు. నరేశ్ కోసం అందరూ తమ వస్తువులు వేయగా, వర్షిణి కోసం ముకేశ్, ఆర్కే కోసం అమన్ మాత్రమే వేస్తారు. అలా హౌస్‌మేట్స్ త్యాగంతో నరేశ్, ఫ్యామిలీ వీక్‌కి ఎంపికయ్యాడు.
నా కోసం నువ్వు వస్తువుల్ని త్యాగం చేయలేకపోయావ్.. నీ బట్టలన్నీ వేయొచ్చు కదా. అదే నేను ఉండుంటే, నా బట్టలన్నీ వేసేదాన్ని. వేరే వాళ్ల బట్టలతో అడ్జస్ట్ అయ్యేదాన్ని అని ముకేశ్ మీద వర్షిణి అలిగింది. చివరగా మిగిలిన నీతూ, శివ్, సుధీర్‌లలో ముందుగా శివ్ సేఫ్ అయ్యాడు. తర్వాత నీతూ సేవ్ అయింది. ఆపై సుధీర్ కూడా సేఫ్ అని నాగ్ చెప్పాడు. ఇదే చివరి వార్నింగ్ అని, ఇకపై జాగ్రత్తగా ఆడండి అని, దీపావళి స్పెషల్ నో ఎలిమినేషన్ అని నాగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రాబోయే పదోవారం 'ఫ్యామిలీ టైం' థీమ్‌తో సాగుతుందని ప్రకటించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: అమితాబ్.. ఈసారి భయపడలేదు)
Tags : 1