Breaking News

బంగారు, వెండి నాణేల ‘నిమిషాల పరుగులు’!

Published on Sat, 11/07/2026 - 19:55

పండుగల షాపింగ్‌ తీరు వేగంగా మారుతోంది. ఒకప్పుడు ధన్‌తేరాస్‌ సందర్భంగా బంగారం, వెండి నాణేలు కొనాలంటే ఆభరణాల దుకాణాలకు వెళ్లేవారు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు.. నిమిషాల్లోనే ఇంటి వద్దకు నాణేలు చేరుతున్నాయి. క్విక్‌ కామర్స్‌ సంస్థలు అందిస్తున్న వేగవంతమైన డెలివరీ సేవలకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ధన్‌తేరాస్‌, దీపావళి సందర్భంగా జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.

జెప్టో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్‌ పలిచా వెల్లడించిన వివరాల ప్రకారం.. ధన్‌తేరాస్‌ సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా గరిష్ఠంగా గంటకు 14,000కు పైగా బంగారు, వెండి నాణేలను డెలివరీ చేశారు. ఒక నిమిషంలోనే అత్యధికంగా 298 నాణేలు అమ్ముడయ్యాయి. పండుగ అవసరాల కొనుగోళ్లలోనూ ఇదే జోరు కనిపించింది. సాధారణ రోజులతో పోలిస్తే చీపుర్ల అమ్మకాలు 38.6 రెట్లు, స్టీల్‌ పాత్రల అమ్మకాలు 20 రెట్లు, అలంకరణ దీపాల అమ్మకాలు 18.2 రెట్లు పెరిగాయి. పురుషుల కుర్తాల విక్రయాలు కూడా 5.4 రెట్లు అధికమయ్యాయి.

ఇన్‌స్టామార్ట్‌లో 23 రెట్లు పెరిగిన బంగారు నాణేల ఆర్డర్లు

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ధన్‌తేరాస్‌కు ముందు వారంలో బంగారు నాణేల ఆర్డర్లు ఏకంగా 23 రెట్లు పెరిగాయి. వీటిలో ఒక గ్రాము నాణేలకు అత్యధిక ఆదరణ లభించగా, ఆ తర్వాత స్థానంలో అర గ్రాము నాణేలు నిలిచాయి. వెండి నాణేల ఆర్డర్లు కూడా ఏడు రెట్లు పెరిగాయి. వీటిలో 5 గ్రాములు, 10 గ్రాముల నాణేలకు దాదాపు సమానంగా డిమాండ్‌ ఉంది. నగరాల వారీగా చూస్తే బంగారు నాణేల కొనుగోళ్లలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్‌, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెండి నాణేల కొనుగోళ్లలో ఢిల్లీ ముందంజలో ఉంది.

ఈ ప్లాట్‌ఫామ్‌లో కొందరు వినియోగదారులు భారీ మొత్తంలో కొనుగోళ్లు చేయడం విశేషం. ఒకరు ఒకే ఆర్డర్‌లో రూ.1.73 లక్షల విలువైన లక్ష్మీదేవి బంగారు నాణేలను కొనుగోలు చేశారు. నోయిడాకు చెందిన మరో వినియోగదారుడు తొమ్మిది ఆర్డర్లలో దాదాపు రూ.5 లక్షలు ఖర్చు చేశారు. ముంబైకి చెందిన ఒకరు బంగారం, వెండి నాణేల కోసం పలు ఆర్డర్ల ద్వారా రూ.4.31 లక్షలు వెచ్చించారు.

దీపాలు, స్వీట్లు, గృహోపకరణాలకూ భారీ డిమాండ్‌

ఇన్‌స్టామార్ట్‌లో వంటగది, డైనింగ్‌ ఉత్పత్తుల ఆర్డర్లు 45 శాతం పెరిగాయి. డిన్నర్‌ సెట్ల కొనుగోళ్లు 344 శాతం, ప్రెజర్‌ కుక్కర్ల విక్రయాలు 171 శాతం వృద్ధి చెందాయి. స్వీట్ల ఆర్డర్లు 55 శాతానికి పైగా పెరగ్గా, పూల కొనుగోళ్లు 42 శాతం అధికమయ్యాయి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లకూ ఆదరణ పెరిగింది. ప్రొటీన్‌ చిప్స్‌ ఆర్డర్లు 239 శాతం, చిరుధాన్యాలతో తయారైన స్నాక్స్‌ ఆర్డర్లు 188 శాతం పెరిగాయి.

ఇదీ చదవండి: దీపావళి బోనస్ వచ్చిందా? ఇలా చేస్తే బెస్ట్‌!

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌లో అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 మధ్య మొత్తం ఆర్డర్లు మూడు రెట్లు పెరిగాయి. ప్రమిదల కొనుగోళ్లు 12 రెట్లు, గృహాలంకరణ వస్తువుల ఆర్డర్లు ఐదు రెట్లు అధికమయ్యాయి. ధన్‌తేరాస్‌ సమయంలో బంగారు నాణేలు, కడ్డీల కొనుగోళ్లు రెట్టింపయ్యాయి. జ్యూసర్లు, మిక్సర్లు, ఎయిర్‌ ఫ్రయ్యర్లు, ఇండక్షన్‌ స్టవ్‌ల వంటి వంటగది ఉపకరణాల ఆర్డర్లు 10 రెట్లు పెరిగాయి. పూజా సామగ్రి కొనుగోళ్లు నాలుగు రెట్లు వృద్ధి చెందాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..

Videos

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

పులివెందులలో భారీ రిగ్గింగ్.. టీడీపీపై నిప్పులు చెరిగిన అవినాష్ రెడ్డి

దీపావళి ధమాకా.! బంగారం భారీగా పతనం.. టపాసులు కాదు గోల్డ్ కొంటారు!

RC17 షూటింగ్ ఆలస్యానికి కారణం ఇదే..!

నగరిలో YSRCP సత్తా

నంద్యాలలో YSRCP ప్రభంజనం.. శిల్పా రవి సంచలన వ్యాఖ్యలు!

Photos

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి ప్రగ్యా జైశ్వాల్ (ఫోటోలు)