Breaking News

సూర్య సీన్ రిలీజ్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం!

Published on Wed, 11/04/2026 - 04:35

సూర్య, నజ్రియా నజీమ్‌ జంటగా నటించిన చిత్రం ‘సీన్‌’. ఈ సినిమాకు ఆవేశం’ ఫేమ్‌ జితు మాధవన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్  మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జయశ్రీ దామోదరన్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 6న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌– తెలంగాణలో ఎన్వీఆర్‌ సినిమా ద్వారా ఎన్వీ ప్రసాద్, సురేశ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీలో నస్లేన్, ఆనంద్‌ రాజ్, లాల్, రాజ్‌ ప్రియన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ బ్యాడ్‌ న్యూస్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా తమిళనాడులో ఇంకా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు వ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ ఆపేయడం వెనుక ఒక బలమైన రాజకీయ, సినిమా వ్యూహం దాగి ఉన్నట్లు చెన్నై ఫిల్మ్ నగర్ టాక్ నడుస్తోంది.‍ ‍‍అయితే తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వం సినిమా ప్రదర్శనలకు సంబంధించి సరికొత్త జీవో జారీ చేస్తుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు

తమిళనాడులో ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుకింగ్స్‌ను కావాలనే నిలిపివేశారు. ఈ పద్ధతి ద్వారా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని చిత్రబృందం భావిస్తోంది.

అయితే ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోవడంతో సూర్య అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. టికెట్ విక్రయాలు ఆలస్యమైతే మొదటి రోజు కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చివరి నిమిషంలో బుకింగ్స్ తెరిస్తే ఆశించిన స్థాయిలో రికార్డులు నమోదు కాకపోవచ్చని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సూర్య క్రేజ్ ఉన్న హీరో కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 

Videos

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

YSRCP నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)