Breaking News

స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు.. గుడిలో నటికి ప్రత్యేక మర్యాదలు!

Published on Sat, 10/31/2026 - 16:29

బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రన్యారావు మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న ప్రముఖ శ్రీ హసనాంబ ఆలయాన్ని ఆమె కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అయితే, సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండగా.. రన్యారావు కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక ప్రోటోకాల్ వాహనాన్ని ఉపయోగించి ఆలయానికి చేరుకోవడం, ప్రత్యేక ఏర్పాట్లతో దర్శనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న చారిత్రక హసనాంబ ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుచుకుంటుంది. ఈ నేపథ్యంలో వార్షిక ఉత్సవాల సందర్భంగా నటి రన్యారావు ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు తండ్రి, రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి, మాజీ డీజీపీ రామచంద్రరావు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

(చదవండి: కీర్తి సురేశ్‌ ‘అక్క’ రివ్యూ)

సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండగా.. రన్యారావు కుటుంబం ప్రభుత్వ వీఐపీ ప్రోటోకాల్ వాహనంలో ఆలయానికి చేరుకున్నట్లు సమాచారం. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి త్వరగా దర్శనం కల్పించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. రన్యారావు, ఆమె తండ్రి నేరుగా గర్భగుడి వద్దకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆమె తండ్రి గతంలో ఉన్నత పోలీసు పదవిలో పనిచేసిన నేపథ్యంలోనే ఈ సదుపాయాలు కల్పించారా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు అధికారిక ప్రోటోకాల్ సదుపాయాలు కల్పించడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది.

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)