Breaking News

బాత్రూంలో జారిపడ్డ దర్శకుడు.. రాత్రంతా ఎవరూ చూడలేదు

Published on Sat, 10/31/2026 - 12:26

హిందీలో ‘కాంటే’, ‘జిందా’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ తదితర సినిమాలు తీసిన సీనియర్ దర్శకుడు సంజయ్ గుప్తా (57) చనిపోయారు. శుక్రవారం రాత్రి తన నివాసంలోని బాత్రూంలో ఈయన జారిపడగా.. శనివారం ఉదయం వరకు ఎవరూ ఈయనని గమనించలేదట. తర్వాత చూస్తే ఈయన మరణించినట్లు తెలిసింది. ఈ విషయమై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తలకు దెబ్బ తగలడం వల్లే సంజయ్ గుప్తా చనిపోయినట్లు ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాలోనూ పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. అదుర్స్ బామ్మ ఇకలేరు)

“ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మన స్నేహితుడు, దర్శకుడు సంజయ్ గుప్తా ఇక లేరనే వార్త ఇప్పుడే తెలిసింది. ఇంట్లో తలకు గాయం కావడంతో ఆయన మరణించారు. మరో అద్భుతమైన ప్రతిభను చాలా త్వరగా కోల్పోయాం. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వ్యక్తి, సినిమాల పట్ల ఎంతో మక్కువ కలిగిన దర్శకుడు. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. మిత్రమా.. నిన్ను మిస్ అవుతాం. ఓం శాంతి” అని అశోక్ పండిట్ తన పోస్టులో రాసుకొచ్చారు.

1994లో విడుదలైన ‘ఆతిష్: ఫీల్ ద ఫైర్’ సినిమాతో సంజయ్ గుప్తా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ‘రామ్ శాస్త్ర’, ‘జంగ్’, ‘ఖౌఫ్’ తదితర చిత్రాలు తెరకెక్కించారు. 2002లో విడుదలైన మల్టీస్టారర్ చిత్రం ‘కాంటే’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో దర్శకుడిగానే కాకుండా రచయిత, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. చివరగా రెండేళ్ల క్రితం 'ది మిరిండా బ్రదర్స్' మూవీ తీశారు. సంజయ్ గుప్తా మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ కుటుంబంలో విషాదం)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)