Breaking News

'పాలలాంటి శరీరం కామెంట్స్'.. ఎట్టకేలకు స్పందించిన మిల్కీ బ్యూటీ

Published on Fri, 10/30/2026 - 20:19

టాలీవుడ్‌లోనే కాదు.. బీ టౌన్‌లోనూ మిల్కీ బ్యూటీ పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తమన్నా. ఈ బ్యూటీ ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్‌తో పాటు సినిమాలు కూడా చేస్తోంది. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తమన్నా.. బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఇటీవలే ది వివాన్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్‌గా మెప్పించింది.

ఇక ఈ సంగతి పక్కనపెడితే.. గతేడాది బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ తమన్నా బాడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెది పాలలాంటి శరీరం అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. తాజాగా దీనిపై తమన్నా స్పందించింది. ఇలాంటి నెగెటివ్ కామెంట్స్‌ను తాను ఏమాత్రం పట్టించుకోనని తెలిపింది. ఇలాంటి వాటిని వడపోసి తన పనిపైనే దృష్టి పెడతానని స్పష్టం చేసింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నాను ఈ విషయంపై ప్రశ్నించగా.. ఆమె సమాధానమిచ్చింది. 

తమన్నా మాట్లాడుతూ.. 'ఒక సృజనాత్మక వ్యక్తిగా మనం వినడం చాలా ముఖ్యం. అయితే ఏది పట్టించుకోవాలి.. ఏది వదిలేయాలి అనే విషయంలో క్లారిటీ ఉండాలి. ఒక మహిళగా మనం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పోతే జీవితంలో ముందుకు సాగలేం. నేను నా పనిపైనే దృష్టి పెడతా. ఏం చేయాలనుకుంటున్నానో దానిపైనే నా ఫోకస్ ఉంటుంది. నటనను కేవలం కెరీర్‌గా కాకుండా ఒక సేవగా భావిస్తా" అని హుందాగా సమాధానమిచ్చారు.

కాగా.. 2025లో 'స్త్రీ -2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాటలో తమన్నా నటనను చూసిన అన్నూ కపూర్ ఆమెపై కామెంట్స్ చేశారు. పాలలాంటి ఆమె ముఖం, శరీరం పిల్లలు హాయిగా నిద్రపోవడానికి సాయపడతాయని వల్గర్‌గా మాట్లాడారు. దీంతో అతని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. అయితే ఈ ఏడాది జూలైలో అన్నూ కపూర్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒకవేళ తన మాటల వల్ల తమన్నా బాధపడి ఉంటే క్షమాపణ చెబుతానని ఆయన పేర్కొన్నారు. 
 

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)