Breaking News

వంటింటి ఇంగువతో మిద్దె తోటకు రక్షణ.. ఈ చిట్కాలు తెలుసా?

Published on Fri, 10/30/2026 - 09:35

ఇంగువ మొక్కల ఎదుగుదలకు, తెగుళ్ల నివారణకు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇంటిపంటలు, మిద్దె తోటల్లో, వ్యవసాయంలో దీన్ని ఉపయోగించటం వల్ల మొక్కలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

1. ఇంగువలో ఉండే ఘాటైన గంధకపు వాసన వల్ల మొక్కలను ఆశించే పురుగులు, అఫిడ్స్, తెల్లదోమలు, నల్లి వంటి కీటకాలు దూరంగా పారిపోతాయి.
2. దీనిలోని యాంటీ–ఫంగల్‌ లక్షణాలు మొక్కల వేరు కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, బూజు తెగుళ్లను సమర్థవంతంగా అరికడతాయి.
3. జామ, నిమ్మ, మిరప వంటి మొక్కల పాదుల్లో ఇంగువ పొడిని వేయటం వల్ల పూత రాలటం తగ్గి, కాయలు బాగా కాస్తాయి.
4. మట్టిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, నెమటోడ్స్‌ (వేరు పురుగులు) నాశనమై వేర్లు బలంగా పెరుగుతాయి.
5. మొక్కల కుండీలలో లేదా పాదులలో చీమలు చేరకుండా ఇంగువ వాసన నిరోధిస్తుంది.

6. ఐదు లీటర్ల నీటిలో కేవలం 2 నుంచి 3 గ్రాముల ఇంగువ పొడి లేదా చిన్న ముక్క కలిపి, అరగంట పాటు పక్కన పెట్టాలి. బాగా కలిపి ప్రతి కుండీలో కొద్దికొద్దిగా పోయాలి. నెలకి ఒక్కటి లేదా రెండు సార్లు మాత్రమే ఇలా చేయాలి. 
7. అర స్పూన్‌ ఇంగువ పొడి, ఒక లీటరు గోరువెచ్చని నీరు తీసుకుని బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, తెగుళ్లు ఉన్న ఆకులపై, కాండంపై వారానికి ఒకసారి చల్లాలి. ఎండ ఎక్కువగా లేని సమయంలో ఉదయం లేదా సాయంత్రం మాత్రమే స్ప్రే చేయాలి.

8. ఒక లీటరు పుల్లటి మజ్జిగ, ఒక చిన్న ముక్క లేదా అర స్పూన్‌ ఇంగువ కలిపి 2–3 రోజులు పులియబెట్టాలి. ఈ ద్రావణానికి ఐదు రెట్లు నీటిని కలిపి మొక్కల మొదట్లో (పాదుల్లో) పోయాలి. ఇది మొక్కలకు మంచి పోషకాలను అందించి పూత బాగా రావడానికి సహాయపడుతుంది. 
9. టొమాటో, మిరప, వంగ మొక్కలలో వచ్చే ముడత తెగులు, పూత రాలటం వంటి సమస్యలను ఇంగువ నివారిస్తుంది. ఇది పూత నిలబడి కాయలు పెద్దవిగా అవ్వడానికి సహాయపడుతుంది.
10. పాలకూర, కొత్తిమీర, పుదీనా తోటకూర, వంటి వాటికి ఆకుమచ్చ తెగులు రాకుండా కాపాడుతుంది. ఆకులు పచ్చగా, బలంగా పెరుగుతాయి.

ఇదీ చదవండి: తాటి చెట్టులో ఇన్ని ఉపయోగాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

11. మందార, గులాబీ లాంటి పువ్వులు మొక్కలకు పట్టే తెల్ల నల్లి, అఫిడ్స్‌ నివారణకు ఇంగువ స్ప్రే అద్భుతంగా పనిచేస్తుంది. గులాబీలలో మొగ్గలు రాలకుండా చేస్తుంది.
12. కుండీలలో పెంచే నిమ్మ, జామ వంటి మొక్కలలో కాపు బాగా రావటానికి, కాయలు రుచిగా మారటానికి ఇంగువ–మజ్జిగ ద్రావణం బూస్టర్‌లా పనిచేస్తుంది.
13. కొత్తగా కుండీ కోసం మట్టి మిశ్రమం తయారుచేసేటప్పుడు, మట్టిలో కొద్దిగా ఇంగువ పొడి కలపటం వల్ల వేరు కుళ్ళు తెగులు కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి.
14. ఇంగువ ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయటం వలన పరాగసంపర్కం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంగువకు ఉండే ఘాటైన వాసన దీనికి ప్రధాన కారణం.

15. ఇంగువ ద్రావణం వాసనకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి పరాగసంపర్కానికి సహాయపడే కీటకాలు మొక్కల దగ్గరకు రావటానికి ఇష్టపడవు. దీనివల్ల పువ్వుల నుండి పువ్వులకు పుప్పొడి చేరడం తగ్గి, పోలినేషన్‌ సరిగ్గా జరగదు.
16. ముఖ్యంగా మొక్కలకు పూత దశలో (ముఖ్యంగా పసుపు రంగు పువ్వులు వచ్చే సమయంలో) ఇంగువ ద్రావణాన్ని స్ప్రే చేస్తే పువ్వులు రాలిపోయే అవకాశం ఉంటుంది.
17. ఇంగువ ద్రావణాన్ని పువ్వులు రావడానికి ముందు లేదా పిందె దశలో తెగుళ్లు/కీటకాలను నివారించటానికి ఒక సహజ నివారణిగా వాడుకోవచ్చు. కానీ, పోలినేషన్‌ సమయానికి మాత్రం దీన్ని స్ప్రే చేయకుండా ఉండటం మంచిది.

- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్‌: 94906 02366

నిర్వహణ : పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

మా మహిళలపైనే చేయి వేస్తారా..? అందరి డేటా ఉంది..!

టీడీపీకి షాక్.. YSRCP లోకి భారీగా చేరికలు

9 నెలల వర్కవుట్స్.. సమంత స్పెషల్ వీడియో!

పులివెందులలో TDP మాస్టర్ స్కెచ్ .. పోలీసులే దగ్గరుండి లాడ్జీలలో..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)