భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!
Breaking News
14 ఏళ్ల ప్రేమబంధం.. భార్యపై నాని పోస్ట్ వైరల్
Published on Thu, 10/29/2026 - 12:33
నేచురల్ స్టార్ నాని.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేక సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నారు. భార్య అంజనా యెలవర్తితో తన 14వ పెళ్లిరోజును నిర్వహించుకున్నారు. ‘14 ఏళ్ల బ్లాక్‌బాస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లవ్ స్టోరీ’ అంటూ నాని, అంజనా.. సోషల్‌మీడియాలో ఫొటోలను పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతుండగా.. అసలు వీరి ప్రేమ ఎలా మొదలైందని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
(ఇదీ చదవండి: రోజా ‘లెనిన్ పాండియన్’ మూవీ రివ్యూ)
నటుడిగా నిరుపించుకునే దశలోనే
నాని సినిమాల్లోకి రాకముందు రేడియో జాకీగా పనిచేశారు. ఆ సమయంలో విశాఖపట్నంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజినీరైనా అంజనాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం అలా ప్రేమగా చిగురించింది. అలా 2012 అక్టోబరు 27వ తేదీన వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే అప్పటికే నాని సక్సెస్ హీరో కాలేదు. ఇంకా నటుడిగా నిరుపించుకునే దశలోనే ఉన్నారు. దీంతో తన పెళ్లికి అంజనా కుటుంబం ఒప్పుకుంటారా? అనే సందేహాలు ఆయనలో ఉండేవని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో ఒక్కటయ్యారు.

2017లో అర్జున్ జన్మించారు
ఇటీవల ‘ది ప్యారడైజ్’ విడుదల సమయంలోనూ అంజనా వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గతంలో నాని నటించిన ఓ సినిమాను చూసేందుకు కాలేజీకి వెళ్లకుండా థియేటర్‌కు వెళ్లామని.. అయితే ఆ రోజు ఉదయం షో వేయకపోవడంతో నిరాశ చెందామని గుర్తుచేసుకున్నారు. నాని ప్రతి సినిమాను తన బిడ్డలా భావిస్తారని ఆమె పేర్కొన్నారు. కాగా వీరికి 2017లో అర్జున్ జన్మించారు. అప్పటి నుంచి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తూ ముందుకెళ్తుంటాడు నాని. సినిమాల విషయానికొస్తే.. నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలై ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: నా శరీరం చురుగ్గానే ఉంది.. ట్రోలింగ్‌పై కత్రినా స్పందన)
Tags : 1