భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!
Breaking News
అంతరిక్షంలో అమెరికా జోరు.. రష్యా కొత్త వ్యూహం ఇదే!
Published on Thu, 10/29/2026 - 12:07
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా వంటి దేశాలు నువ్వా.. నేనా? అన్నట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ను నిజమైన మేధావి అని ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ.. రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతోంది. అంతేకాకుండా, స్టార్‌లింక్ పేరుతో వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మస్క్‌పై ప్రశంసలు
మాస్కోలో జరిగిన ఒక ప్రదర్శనను సందర్శించిన సమయంలో పుతిన్.., ఎలాన్ మస్క్ సాధించిన విజయాలను ప్రశంసించారు. వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం సాధారణ విషయం కాదని, అది గొప్ప సాంకేతిక విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా కూడా ఈ రంగంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని, అయితే.. ప్రస్తుతం తాము ప్రారంభ దశలో ఉన్నామని పేర్కొన్నారు.
రష్యాకు అంతరిక్ష పరిశోధనలో సుదీర్ఘ చరిత్ర ఉంది. అయినప్పటికీ.. స్టార్‌లింక్ వంటి శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆ దేశం భావిస్తోంది. దీనివల్ల సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ అందించడంతో పాటు, సైనిక అవసరాలకు కూడా ఉపయోగపడే సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో స్టార్‌లింక్ సేవలు
మరోవైపు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో స్టార్‌లింక్ సేవలు కీలకంగా మారాయి. ఉక్రెయిన్ సైన్యం సమాచార మార్పిడికి ఈ సేవలను ఉపయోగిస్తోంది. అయితే.. శాటిలైట సమాచార సేవల వినియోగం, వాటి లభ్యత విషయంలో అమెరికా, ఉక్రెయిన్ మధ్య వివాదాలు తలెత్తాయి. సేవల్లో అంతరాయాలు ఏర్పడటం వల్ల డ్రోన్లను అడ్డుకోవడం, సైనిక సమాచారాన్ని చేరవేయడం వంటి కార్యకలాపాలపై ప్రభావం పడిందని ఉక్రెయిన్ పేర్కొంది. అయితే, ఈ అంతరాయాలకు తామే కారణమనే ఆరోపణలను ట్రంప్, మస్క్ ఖండించారు.
దీన్నిబట్టి చూస్తే.. శాటిలైట్ ఇంటర్నెట్ అనేది కేవలం ప్రజలకు ఇంటర్నెట్ అందించే సాంకేతికత మాత్రమే కాదు. దేశాల భద్రతకు, సైనిక కార్యకలాపాలకు, అంతర్జాతీయ రాజకీయాలకు కూడా ఇది ఎంతో ముఖ్యమైనదిగా స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: బంగారంపై నడిచే రోజులు వస్తున్నాయ్!
Tags : 1