Breaking News

భగవంతుడు ఎక్కడ ఉంటాడు? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!

Published on Thu, 10/29/2026 - 11:31

భగవంతుడంటే మానవజాతి నుండి వేరుగా, సుదూరంగా వుండేవాడని కాదు. తన ధామం నుండి దిగివచ్చి ఈ లోకంలో వివిధ అవతారాలలో మనకు దర్శనమిస్తాడు. తన అవతార ప్రయోజనాన్ని భగవద్గీతలో తానే స్వయంగా వివరించాడు కూడా. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణకై తాను యుగయుగాన అవతరిస్తానని మరీ ప్రకటించాడు. అంతేగాక, మానవజాతి శాంతియుతంగా, సంతోషంగా, సుసంపన్నంగా ఉండేందుకు తగిన ధర్మసంస్థాపన కూడా గావిస్తాడు.

భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు గనుక, తన సంకల్ప మాత్రానే ఏ రూపంలోనైనా లోకంలో అవతరించగలడు. నరసింహుడై ఒక స్తంభముననూ ఉద్భవించగలడు లేదా వరాహ మూర్తియై బ్రహ్మదేవుని నాసికా రంధ్రం నుండీ జనించగలడు! తనకు నచ్చిన విధంగా తన భక్తులకు దర్శనమిచ్చి తగిన సేవా భాగ్యాన్ని ప్రసాదించగలిగే సర్వస్వతంత్రుడు ఆ దేవాదిదేవుడు. అటువంటి ఒక రూపమే మందిరంలోని భగవంతుని అర్చావతారం. దేవాలయంలోని విగ్రహమూర్తి కేవలం మనకు పైకి కనిపించే రాతి లేదా లోహ నిర్మితమైన ఒక వస్తువు కాదు. అతడు సాక్షాత్తు భగవంతుడే.

భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా?
పరబ్రహ్మ స్వరూపుడైన దేవదేవుడు మూడు విధాలుగా వ్యక్తమవుతాడని శాస్త్రాలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి. 
1. నిరాకార, వైవిధ్య రహితమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడే సర్వ వ్యాపకత్వం
2. ప్రతి జీవి హృదయాంతరంలో కొలువైవున్న పరమాత్మ తత్త్వం
3. షడైశ్వర్య సంపూర్ణుడై మూర్తీభవించిన భగవతత్త్వం. సకల ఇతర భగవత్తత్వాలకు ఇదే మూలం.

బ్రహ్మజ్యోతికి తానే ఆధారమని వివరించాడు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు. సకల చరాచర జీవుల హృదయాలలో పరమాత్మగా సైతం వున్నది తానేనని అందులో వివరించాడు. భగవద్గీత 12వ అధ్యాయంలో తాను కేవలం సగుణాత్మక ఆరాధన ద్వారా మాత్రమే ప్రసన్నుడనవుతానని తెలియజేశాడు శ్రీ కృష్ణుడు.

ఆలయంలోని అర్చావతారం 
దేవాలయంలో అర్చా విగ్రహాన్ని ప్రతిష్టించాలంటే ఆగమ శాస్త్ర నియమ నిబంధనలను అనుసరించాలి. శాస్త్రంలో చెప్పబడినట్లుగా, మొదట స్థపతి చేత భగవంతుని విగ్రహాన్ని తయారు చేయించవలసి ఉంటుంది. స్థపతి శిల్ప శాస్త్ర నియమాలను అనుసరిస్తూ రాయి లేదా పంచలోహమును ఉపయోగించి విగ్రహాన్ని చెక్కుతాడు. అనుభవజ్ఞుడైన స్థపతి సరైన కొలతలు, పరిమాణాలతో రూపాన్ని మొలుస్తూ, శాస్త్రాలలో వివరించిన ప్రకారం భగవంతుని ఆకృతిని విగ్రహం పోలివుండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు.

అలా విగ్రహం సిద్ధమైన తర్వాత, ఆగమ శాస్త్రాలు, పాంచరాత్ర నిబంధనలను అనుసరించి ఆలయంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తారు. విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సరైన ముహూర్తం నిర్ణయించి ఉత్సవంగా ప్రతిష్టాపన జరుపుతారు.

అంకురార్పణ, వాస్తు హోమంతో ప్రారంభించి, వైదిక ఆచారాలతో శ్రీ కృష్ణుడిని ఆవాహన చేయడం ద్వారా కుంభ స్థాపన గావిస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని (మూల బింబం) తయారు చేయడం నుండి రవాణా చేయడం వరకు కలిగిన దోషాలేవైనా వుంటే వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది. దీన్ని అధివాసము అంటారు. ఇందులో మూల బింబాన్ని నీరు, పాలు, పంచ గవ్యము, ధాన్యాలు మొదలైన వాటిలో కనీసం రెండు ముహూర్తాల పాటు ఉంచుతారు.

ఈ దశలో...
1. మన
2. ఉన్మన
3. ప్రమాణ
4. పరిమాణ
5. ఉపమాన
6. లంభమన
7. అభిద దోషాలను తొలగిస్తారు.

ప్రాణ ప్రతిష్ట రోజున, కుంభాన్ని యజ్ఞశాల నుండి ఆచారబద్ధంగా సింహాసనంపై అప్పటికే కొలువుదీరిన మూల బింబం వద్దకు తీసుకొస్తారు. ముహూర్త సమయంలో మూలబింబానికి కుంభ ప్రోక్షణ గావిస్తూ, హరినామ సంకీర్తనల మధ్య ఆచార్యుల ద్వారా భగవంతుడిని అర్చామూర్తిగా అవతరించాలని విజ్ఞప్తి చేస్తూ అంగన్యాసాన్ని నిర్వహిస్తారు. ఆ విధంగా భగవంతుడు అర్చామూర్తిగా దేవాలయంలో కొలువుదీరుతాడు.

- శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్‌

నిర్వహణ డి.వి.ఆర్‌. భాస్కర్‌

ఇదీ చదవండి: భర్త ముఖాన్ని జల్లెడలో చూస్తారు.. ఈ పండుగ గురించి తెలుసా?

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)