నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్
Breaking News
మెగా కోడలు ఉపాసన రాహుకేతు పూజలు
Published on Wed, 10/28/2026 - 18:43
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. ఇవాళ శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. ఇవాళ ఉదయమే ఆమె తాతతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పని చేయనున్నారు. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది రామ్ చరణ్ పెద్ది మూవీతో ప్రేక్షకులను అలరించారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీమతి ఉపాసన కొణిదెల. #UpasanaKonidela #RamCharan https://t.co/lwai4PE1ms
— YK Tv Digital (@yktvdigital) October 28, 2026
Tags : 1