Breaking News

ఓ చూపు... మలయాళం వైపు!

Published on Mon, 10/26/2026 - 05:18

టాలీవుడ్‌... కోలీవుడ్‌... మాలీవుడ్‌... శాండల్‌వుడ్‌... ఈ నాలుగు దక్షణాది భాషల్లో ఎవరి మేకింగ్‌ స్టైల్‌ వారిది. అయితే ఈ నాలుగు భాషల్లో మాలీవుడ్‌లో మీడియమ్‌ బడ్జెట్‌ చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. పైగా... ‘కంటెంట్‌’ ప్రాధాన్యం ఉన్న సినిమాల సంఖ్య ఎక్కువ. అందుకే... మాలీవుడ్‌లో ఒక్క చాన్స్‌ వస్తే... ‘ఓ చూపు... మలయాళం వైపు వేస్తేపోలా’  అనుకుంటుంటారు స్టార్స్‌. ముఖ్యంగా హీరోయిన్లు అన్ని భాషల్లో సినిమాలు చేస్తుంటారు కాబట్టి మాలీవుడ్‌ నుంచి కాల్‌ వస్తే ‘యస్‌’ అనేస్తారు. అలా ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు వేరే భాషల తారలు మలయాళ స్క్రీన్‌కి పరిచయం అయ్యారు. ఇప్పుడు కొందరు పరిచయం కానున్నారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం.

కాలాన్ని తిరగ రాసే కథ 
నటిగా కెరీర్‌ను ప్రారంభించిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు అనుష్కా శెట్టి. జయసూర్య హీరోగా నటించిన మలయాళ సినిమా ‘కథనార్‌: ది వైల్డ్‌ సోర్సెరర్‌’లో హీరోయిన్‌ నీల పాత్రలో అనుష్క నటించారు. ‘‘ఇది మీకు తెలిసిన కథ కాదు... కాలాన్ని తిరగ రాసే కథ’’ అంటూ ఓ సందర్భంలో నీల పాత్ర గురించి పేర్కొంది చిత్రబృందం. దీంతో నీల పాత్ర వెండితెరపై మిస్టీరియస్‌గా కనిపిస్తుందని, ఈ పాత్రకు అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయనే ప్రచారం సాగుతోంది.

ఇక ప్రభుదేవా, శాండీ, సనూప్‌ సంతోష్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. గోకులం గోపాలన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఒక క్రైస్తవ మత గురువు దుష్టశక్తుల నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడారు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 15కి పైగా భాషల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్‌ కానుందన్నది మాలీవుడ్‌ టాక్‌. 

ఆపరేషన్‌ స్టార్ట్‌ 
రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు ఉత్తరాది అమ్మాయి భాగ్యశ్రీ బోర్సే. ఆ తర్వాత ‘కింగ్‌డమ్, ఆంధ్రా కింగ్‌ తాలూకా, కాంత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ‘లెనిన్‌’ సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులతో మరిన్ని మంచి మార్కులు వేయించుకున్నారు భాగ్యశ్రీ. ఇలా తెలుగులో నటిగా  నిరూపించుకున్న భాగ్యశ్రీ మలయాళ పరిశ్రమలో తన భాగ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 

మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌  ప్యాక్డ్‌ మూవీ ‘ఆపరేషన్‌ గంగా’లో ఓ లీడ్‌ రోల్‌లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారీ బ్యూటీ. ఇటీవల మోహన్‌లాల్, భాగ్యశ్రీ బోర్సేతో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట ఈ చిత్రదర్శకుడు విష్ణు మోహన్‌. అర్జున్‌ రాంపాల్, ఆదిల్‌ హుస్సేన్, ఆర్‌. పార్తిబన్‌ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఓ రెస్క్యూ ఆపరేషన్‌ ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది.

కన్నడ టు మలయాళం 
రిషబ్‌ శెట్టి ‘కాంతార: చాప్టర్‌ 1’, యశ్‌ ‘టాక్సిక్‌’ వంటి కన్నడ చిత్రాలు తెలుగులో అనువాదమై, ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్‌’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. రుక్మిణీ వసంత్‌ చేస్తున్న స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇదే. ‘డ్రాగన్‌’ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 11న విడుదల కానుంది. 

కన్నడలో ఫేమ్‌ తెచ్చుకుని, తెలుగులో భారీ అవకాశం చేజిక్కించుకుని... ఇప్పుడు మలయాళంపై కూడా దృష్టి సారించారు రుక్మిణీ వసంత్‌. నివిన్‌ ఫౌలీ హీరోగా నషీద్‌ మొహమ్మద్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళంలో రుక్మిణీ వసంత్‌కు ఇదే తొలి సినిమా. నివిన్‌ కెరీర్‌లోని ఈ 51వ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌ కానుందని మాలీవుడ్‌ సమాచారం. 

ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా  ‘ఖలీఫా: ది రూలర్‌’తో మాళవికా శర్మ, ఆంటోని వర్గీస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కాట్టాలన్‌’తో దుషార విజయన్‌ వంటి వారు ఇప్పటికే మాలీవుడ్‌ తెరకు పరిచయం అయ్యారు. మరికొంతమంది హీరోయిన్స్‌ మలయాళ చిత్రపరిశ్రమ వైపు తమ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ దిశగా కథా చర్చలు జరుగుతున్నాయని మాలీవుడ్‌ సమాచారం.                   

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)