నరకానికి దారి.. గుంతల్లో ఇరుక్కుపోయిన బండి
Breaking News
నడవలేని స్థితిలో ఉన్నా.. నటి సుభాషిణి భావోద్వేగం
Published on Sun, 10/25/2026 - 14:49
యాంకర్ సుమ తన మాటలతోనే కాదు.. మంచి మనసుతోనూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఐదేళ్లుగా ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ కార్యక్రమం ద్వారా పేదలు, వృద్ధులకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ఆర్థిక సాయం అందజేస్తున్నారు.తాజాగా ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న నటి అల్లరి సుభాషిణి.. సుమ తనకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
నడవలేని పరిస్థితిలో ఉన్నాను
తన ఆరోగ్యం సహకరించకపోయినా సుమ కోసం ఈ కార్యక్రమానికి వచ్చినట్లు సుభాషిణి తెలిపారు. ఒకానొక సమయంలో నడవలేని పరిస్థితిలో ఉన్నానని, అలాంటి కష్టకాలంలో సుమ తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పారు. ‘నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. అయినా సుమగారి కోసం ఇక్కడికి వచ్చాను. ఆమె నిజంగా గొప్ప వ్యక్తి. సుమ చేసిన సాయం అంతా ఇంతా కాదు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
సుమ నా ప్రాణదాత
‘ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నానంటే అందుకు కారణం సుమనే. ఆమె ద్వారా నాకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల, పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మరో జన్మంటూ ఉంటే సుమలాంటి కూతురు తనకు పుట్టాలి’అని మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
(ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్..? ఓ సూపర్‌స్టార్ కొడుకుతో హీరోయిన్!)
సుభాషిణి విషయానికి వస్తే..
అల్లరి సుభాషిణి అసలు పేరు తిరుమల సుభాషిణి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆమె చిన్నతనంలోనే నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ‘చింతామణి’ వంటి నాటకాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ (2002) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ‘అల్లరి సుభాషిణి’గా పేరు సంపాదించారు. ‘శ్రీ ఆంజనేయం’, ‘కితకితలు’, ‘సుడిగాడు’ వంటి చిత్రాల్లో హాస్య, సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈవీవీ సత్యనారాయణ, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లోనూ కనిపించారు.
(ఇదీ చదవండి: నాని ది ప్యారడైజ్.. మహేశ్ బాబు తనయుడి షాకింగ్ రివ్యూ..!)
సుమ నాకు చేసిన హెల్ప్ ఇంతా అంతా కాదు.. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే సుమనే కారణం. సుమ నా ప్రాణదాత! - #Subhashini Festival for Joys #5thAnniversary Celebrations https://t.co/0ApJKuRbCn
— Telugu70mm (@Telugu70mmweb) October 24, 2026
Tags : 1