రూ. 7 లాటరీ టికెట్‌తో..రూ.కోటి గెలుచుకుంది!

Published on Fri, 10/23/2026 - 13:16

అదృష్టం కలిసొస్తే..ఒక్కోసారి రాత్రికి రాత్రే తలరాత మారిపోతుంది. సాధారణ వ్యక్తిని సైతం కోటీశ్వరుడిగా మార్చేస్తుంది. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ పంజాబ్‌కి చెందిన మహిళ.

అసలేం జరిగిందంటే..పంజాబ్లోని ఫరీద్‌కోట్‌ జిల్లా, కోట్‌కపురాకు చెందిన కుటుంబం లాటరీని గెలుచుకుంది. కూలి పనిచేసుకునే వ్యక్తి భార్య అయిన బిమ్లాదేవి ఒక రోజు సాయంత్రం వేళ పిల్లల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు రైల్వే రోడ్డుకు వెళ్లారు. ఆ సయంలోనే సరదాగా ఒక లాటరీ టికెట్‌ని జస్ట్‌ రూ. 7లకు కొనుగోలు చేసింది. మరుసటి రోజు సాయంత్రమే తను కొన్న టికెట్‌కే బహుమతి వచ్చినట్లు తెలియడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. 

సదరు లాటరీ దుకాణదారుడి ద్వారా విషయం తెలుసుకుని నేరుగా లాటరీస్టాల్‌కి చేరుకున్నారు. లాటరీ దుకాణం యజమాని నరేష్‌ మోంగా ఆ కుటుంబానికి మిఠాయిలు అందించి అభినందనలు తెలిపాడు. ఆ కుటుంబం మాత్రం జస్ట్‌ రూ. 7ల టికెట్‌తో కోటి గెలుచుకున్నామన్న సంతోషంతో ఉబ్బితబ్బిబవుతూ చిందులు వేశారు. ఈ బహుమతి సొమ్ముని ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదని, కానీ తమను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుందని చాలా సంతోషంగా చెబుతోంది ఆ కుటుంబం. 

కాగా  లాటరీ స్టాల్ యజమాని నరేష్ మోంగా మాట్లాడుతూ, తాను గత ఆరు నెలలుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నానని, ఇటీవలనే తన దుకాణాన్ని రైల్వే స్టేషన్ సమీపానికి మార్చినట్లు తెలిపాడు. చాలామంది తన దుకాణంలో లక్ష రూపాయలకు పైగా బహుమతులు గెలుచుకున్నారు  కానీ ఎవ్వరూ ఇలా ఇంత పెద్ద మొత్తంలో కోటి రూపాయలు గెలుచుకోలేదని మోంగా చెప్పుకొచ్చాడు.

 

ఇదీ చదవండి: ప్రసవమైన ఆరువారాలకే రన్‌వేపై రీఎంట్రీ..! మాతృత్వపు గ్లామర్‌ వెనుకున్న సీక్రెట్‌ ఇదే

 

#

Tags : 1

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)