అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
విశ్వక్ సేన్ 'కల్ట్' ట్రైలర్.. మొత్తం రక్తపాతమే
Published on Sun, 10/18/2026 - 20:30
ఈ నగరానికి ఏమైంది?, ఫలక్‌నుమా దాస్, హిట్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తర్వాతి కాలంలో రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలతో వరస ఫ్లాప్స్, డిజాస్టర్స్ చూశాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ టైంలో తానే దర్శకుడిగా మారి అందులో నటించి ఓ మూవీ తీశాడు. అదే 'కల్ట్'. ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
'కల్ట్' (Cult Movie) ట్రైలర్ బట్టి చూస్తే.. గోవాలో కల్ట్ అనే పబ్‌లో ఓ రోజు రాత్రి 300 మందికి పైగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు వీళ్లని లోపలే లాక్ చేసి ఓ గేమ్ పెడతారు. ఓడిపోతే చంపేస్తారు. అయితే ఈ పబ్‌లోనే ఇన్స్పెక్టర్ సంకల్ప్ నాయక్ కూడా ఉంటాడు. మరి లోపలున్న వీళ్లంతా బయటకెలా వచ్చారు. అసలు ఈ సెటప్ అంతా ఏంటి? అనేది మూవీ చూసి తెలుసుకోవాలి.
ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన విశ్వక్ సేన్.. దర్శకత్వం వహించాడు. ఇందులో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా రవి బస్రూర్ సంగీతమందించాడు. ట్రైలర్లో చాలా సీన్స్ వయలెంట్‌గా ఉన్నాయి. యువత మాత్రమే చూసే ఈ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. పదేళ్ల క్రితమే 'ఆమె' చెప్పింది)
Tags : 1