Breaking News

కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. పదేళ్ల క్రితమే 'ఆమె' చెప్పింది

Published on Sun, 10/18/2026 - 17:55

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారు. గతంలో రూమర్స్ వచ్చినప్పుడు కొందరు నమ్మారు, మరికొందరు నమ్మలేదు. కానీ ఇప్పుడు అధికారికంగానే పెళ్లి పనులు మొదలైపోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే అనిరుధ్ పెళ్లి గురించి ఓ జ్యోతిష్యురాలు పదేళ్ల క్రితం ఓ విషయం చెప్పింది. ఇప్పుడు అదే నిజమైందని మీకు తెలుసా?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

అనిరుధ్ ప్రస్తుతం దేశంలో టాప్ మోస్ట్ సంగీత దర్శకుడిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ పదేళ్ల క్రితం ఓ మాదిరి గుర్తింపు ఉన్న టైంలో ఓ తమిళ షోలో పాల్గొన్నప్పుడు.. ఓ టాడో రీడర్(జ్యోతిష్యురాలు) ఇతడి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నాలుగు విషయాలు చెప్పింది. ఇప్పుడు అవే నిజమయ్యాయి.

ఎంబీఏ చేసిన అమ్మాయి.. టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ఉన్న అమ్మాయి.. పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి.. ఇంటికి 2-4 కిలోమీటర్ల దూరంలో ఉండే అమ్మాయినే అనిరుధ్ పెళ్లి చేసుకుంటాడని సదరు జ్యోతిష్యురాలు అప్పట్లో చెప్పింది. ఇప్పుడు ఆ పాయింట్లన్నీ కూడా కావ్య మారన్‌కి సరిపోలడం యాద్ధృచ్చికమనే చెప్పొచ్చు. దీంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.

అనిరుధ్ విషయానికొస్తే.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఇతడికి దగ్గర బంధుత్వం ఉంది. రజనీ భార్య, అనిరుధ్ తల్లి అక్కాచెల్లెలు అవుతారు. మరోవైపు కావ్య మారన్.. కరుణానిధి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇలా తమిళనాడులోని రెండు ప్రముఖ ఫ్యామిలీస్.. ఈ పెళ్లితో ఒక్కటి కాబోతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ, ఏపీ-తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులకు వివాహ ఆహ్వానాలు అందాయి. రిసెప్షన్ వచ్చే నెల 21న చెన్నైలో జరగనుంది. కానీ పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి.. ఏడాది తిప్పించుకున్న విజయ్ దేవరకొండ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)