Breaking News

రాజమౌళి వారణాసి వాయిదా..? సినిమా రిలీజ్‌పై చర్చ

Published on Sun, 10/18/2026 - 17:50

టాలీవుడ్‌లో వరుసగా సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రభాస్‌ నటిస్తున్న ‘స్పిరిట్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అదిగో ఇదిగో అన్నారే తప్పా.. రిలీజ్‌ డేట్‌ ఊసే లేదు. అంటే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదనే తెలుస్తోంది.

ఇలా పలు సినిమాల విడుదల తేదీలు మారుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై పడింది. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమా విషయంలోనూ అలాంటిదే జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.

(ఇదీ చదవండి: నా ముఖం ఉబ్బినట్లు ఉందని.. ఏడాదిగా గ్యాలరీలో..: హీరోయిన్‌)

వారణాసి విషయానికొస్తే..
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్‌ చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్‌బాబు రుద్రగా.. శ్రీరాముడి పాత్రలోనూ మెప్పించనున్నాడు. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. కార్తికేయ, కేఎల్‌ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దాదాపు 120 దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే..

విడుదల తేదీ మార్పుపై ప్రచారం
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కీలకం కానున్నాయి. ఇలాంటి సినిమాలకు నిర్మాణానంతర పనులు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతర భారీ చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు చోటుచేసుకుంటుండటంతో ‘వారణాసి’ విడుదలపై అభిమానుల్లో చర్చ మొదలైంది.

అయితే, ఈ సినిమా విడుదల తేదీ మారబోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత లేదు. చిత్రబృందం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే సినిమా విడుదలవుతుందా? లేక ఏదైనా మార్పు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.అప్పటివరకు ఈ వార్తలను ఊహాగానాలుగానే చూడాలి మరి. 

(ఇదీ చదవండి: గరివిడి లక్ష్మి కాళ్లపై షకలక శంకర్‌.. చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)