భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
ఓటీటీకి కీర్తి సురేశ్ హిట్ మూవీ.. నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్
Published on Sun, 10/18/2026 - 10:33
కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన లేటేస్ట్ మూవీ డోరతి. ఈ చిత్రంలో రిషికాంత్, సనంత్ హీరోలుగా నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కుటుంబం, స్నేహం వంటి అంశాలను దాటి హిజ్రాల జీవన విధానంపై తెరకెక్కించారు. ఇటీవల రిలీజైన ఈ చిత్రంల బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తమిళంలో హిట్ కావడంతో వారం రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 2న తెలుగులోనూ రిలీజ్ చేశారు. స్పిరిట్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అయితే అంతలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
‘డోరతీ’ కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1995లో తమిళనాడులోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. వేరు వేరు సామానిక నేపథ్యాలు ఉన్న సుబ్బు(సనంత్), కార్తి(రిషికాంత్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. సుబ్బ వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. వాళ్ల నాన్న స్థానికంగా ప్రభావం ఉన్న గ్యాంగ్స్టర్. ఇద్దరు అన్నలు కూడా రౌడీయిజం, రాజకీయాలే చేస్తుంటారు. సుబ్బు, కార్తీ కూడా ఆ గ్యాంగ్లో చేరతారు. అయితే చిన్నప్పుడు పురుష అహంకారం చూపించే సుబ్బు..పెద్దయ్యాక మాత్రం పూర్తిగా మారిపోతాడు. గ్యాంగ్స్టర్ ప్యామిలీ సభ్యుడే అయినా.. రక్తం చూసినా వాంతులు చేసుకుంటాడు. హింసకు దూరంగా ఉంటూ..ఇంట్లోకి కొత్తగా వచ్చిన వదిన డోరతీ(కీర్తి సురేశ్)తో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే అనూహ్యంగా డోరతీ కన్నుమూస్తుంది. వదిన చావుకు తన తండ్రి, అన్నదమ్ములే కారణమని సుబ్బు భావిస్తాడు. ఆమె మరణం తర్వాత సుబ్బు ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? ఆ నిర్ణయం వల్ల సుబ్బు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు పెద్దయ్యాక సుబ్బులో వచ్చిన మార్పులు ఏంటి? ప్రాణ స్నేహితుడైన కార్తి.. సుబ్బుని చంపాలని ఎందుకు ప్రయత్నించాడు? చివరకు కార్తి, సుబ్బులు స్నేహం ఎలా ముగిసింది? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే.
Tags : 1