Breaking News

'జైలర్ 2' సినిమాలో షో స్టీలర్.. ఎవరీ మూర్తి?

Published on Sat, 10/17/2026 - 17:33

మీరు 'జైలర్ 2' చూశారా? ఒకవేళ చూస్తే ఏ పాత్ర మీకు బాగా నచ్చింది అని అడిగితే ఆలోచించకుండానే చాలామంది రజనీకాంత్ పేరు చెబుతారు. తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే మూర్తి పాత్ర చేసిన నటుడు భలే నవ్వించాడు కదా అని అంటారు. ఇతడేం కొత్త నటుడు కాదు. గత పద్దెనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ 'జైలర్ 2' దెబ్బకు ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. ఇంతకీ ఇతడెవరు? బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?

(ఇదీ చదవండి: తొలి రోజే కలెక్షన్ల సునామీ.. జైలర్ 2కు ఎన్ని కోట్లంటే?)

'జైలర్ 2'లో మూర్తి పాత్ర చేసిన నటుడి పేరు నమో నారాయణ. 2009లో వచ్చిన తమిళ మూవీ 'నాడోడిగళ్'‍తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర దర్శకుడు సముద్రఖని.. నారాయణకు బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్. సముద్రఖని.. ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్ అయిపోగా, నమో నారాయణ మాత్రం టీసీఎస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యాడు. 'నాడోడిగళ్'తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఉద్యోగం మానేశాడు.

2009 నుంచి ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నమో నారాయణ కనిపించాడు. కాకపోతే 'జైలర్ 2'లో ఇతడిని ఉపయోగించుకున్న తీరు.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. చెప్పాలంటే ఫస్టాప్‌లో మిగతా పాత్రలని మూర్తి డామినేట్ చేసి పడేశాడు. సోషల్ మీడియాలోనూ ఈ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. ఫన్నీ ట్రోల్స్ అయితే నెటిజన్లని తెగ నవ్విస్తున్నాయి. క్రేజ్ చూస్తుంటే ఈ నటుడిని త్వరలో తెలుగు సినిమాల్లో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!

(ఇదీ చదవండి: ‘జైలర్‌ 2’ మూవీ రివ్యూ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)