Breaking News

రజనీకాంత్ సినిమా.. నటి పూర్ణకు భారీ కటౌట్‌..!

Published on Thu, 10/15/2026 - 18:11

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘జైలర్‌ 2’  ఈరోజు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే మంచి స్పందన వస్తోందని అభిమానులు సందడి చేస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ కామెడీ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్‌ నటి పూర్ణ కూడా భాగమైంది. ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: రేపే రణబాలి విడుదల.. అంచనాలు పెంచేసిన నాని)

రజనీతో కలిసి పూర్ణ స్టెప్పులు..
‘జైలర్‌ 2’లోని ‘అలా బోలేలో’ పాటలో రజనీకాంత్‌తో కలిసి పూర్ణ డ్యాన్స్‌ చేసింది. మాస్‌, క్లాసికల్‌ నృత్యాల మేళవింపుతో ఆమె వేసిన స్టెప్పులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సంప్రదాయ కేరళ చీరకట్టులో పూర్ణ కనిపించిన తీరు, ఆమె నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ పాటకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

పూర్ణకు భారీ కటౌట్‌.. 
‘జైలర్‌ 2’ విడుదల సందర్భంగా సాధారణంగా రజనీకాంత్‌ భారీ కటౌట్లు, అభిమానుల సందడి కనిపిస్తుంటాయి. అయితే ఈసారి నటి పూర్ణకు కూడా నిలువెత్తు కటౌట్‌ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. కేరళలోని తిరువనంతపురంలో ఓ థియేటర్‌ సమీపంలో షమ్నా కాసిమ్‌ ఫ్యాన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. రజనీకాంత్‌ సినిమాలో పూర్ణ కనిపించడంతో ఆమె అభిమానులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటనతో పాటు నృత్యంలోనూ తన ప్రతిభను చాటుకుంటున్న ఆమె.. ‘జైలర్‌ 2’ పాటతో మరోసారి వార్తల్లో నిలిచింది. 

(ఇదీ చదవండి: నటి కోసం భార్యని కోమాకి వెళ్లేలా కొట్టాడు: పూనమ్‌)

 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)